the husband and wife
-
సంతానం విషయమై వివాదం భార్యాభర్తల బలవన్మరణం
సర్ధార్‌నగర్‌లో విషాదం పహాడీషరీఫ్: సంతానం విషయంలో తలెత్తిన వివాదం భార్యాభర్తలను బలిగొంది. భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకోగా... భార్య మృతిని జీర్ణించుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అందరి హృదయాలను కలిచి వేసిన ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. ఎస్ఐ మహేందర్ జీ, స్థానికుల కథనం ప్రకారం....తుక్కుగూడ సమీపంలోని సర్ధార్‌నగర్ గ్రామానికి చెందిన పూర్ణ మౌనిక(22), నరేందర్(26) ఐదేళ్ల క్రితం ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నరేందర్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుండగా మౌనిక ఇంటి వద్దే ఉంటోంది. జీవితంలో స్థిరపడ్డాక పిల్లలను కనాలనే ఉద్దేశంతో మౌనిక గర్భం రాకుండా మాత్రలు వేసుకుంటోంది. ఈ విషయమై నరేందర్ భార్యను మందలిస్తూ వచ్చాడు. ఇటీవలే మౌనిక గర్భం దాల్చింది. నెలన్నర గర్భంతో ఉన్న మౌనిక గర్భం పోవాలని శనివారం మాత్రలు వేసుకుంది. విషయం తెలుసుకున్న నరేందర్ సాయంత్రం 4 గంటలకు భార్యను మందలించి బయటికి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన నరేందర్ కొనఊపిరితో ఉన్న భార్యను స్థానికుల సాయంతో సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ మౌనిక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో తీవ్రమనోవేదనకు గురైన నరేందర్ వెంటనే సర్దార్‌నగర్ గ్రామానికి వెళ్లి ఊరు బయట ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి తాడుతో ఉరేసుకున్నాడు. తాడు తెగి పోవడంతో మృతదేహం కింద పడిపోయింది. ఆదివారం ఉదయం 6 గంటలకు నరేందర్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా ఇంటర్మీడియట్ చదివిన మౌనిక కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోందని స్థానికులు తెలిపారు. మౌనిక, నరేందర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో సర్ధార్‌నగర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. -
భార్యాభర్త ఆత్మహత్య
ఒకరి తర్వాత ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య అనాథలైన చిన్నారులు చిన్నబోయిన ఆర్సి కురవపల్లె కురబలకోట: కురబలకోట మండలం మట్లివారిపల్లె గ్రామం ఆర్సి కురవపల్లెకు చెందిన భార్యాభర్తలు ధనలక్ష్మి (28), ఈశ్వరప్ప (30) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఒకరి తర్వాత మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఊరంతా గొల్లుమంది. చిన్నారులు ఒంటరి వారయ్యారు. తల్లిదండ్రుల కోసం బేలగా చూస్తున్న చిన్నారులను చూసి కంటతడిపెట్టని వారు లేరు. గ్రామస్తుల కథ నం మేరకు..ఆర్సి కురవపల్లెకు చెందిన ఈశ్వరప్పకు తంబళ్లపల్లె మండలం కుక్కరాసిపల్లెకు చెందిన ధనలక్ష్మి తో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి కాపురం సజావుగానే సాగిపోతోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భర్త ఈశ్వరప్ప పొలం నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య ధన లక్ష్మి చనిపోయి ఉండడాన్ని గమనించాడు. నోటి నుంచి నురుగు రావడం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తిం చాడు. దీంతో భీతిల్లిన అతను ఇంట్లోని విషపూరిత గుళికల మందు తీసుకుని వెళ్లి ఊరి బయట పొలం వద్ద కలుపుకుని తాగేశాడు. ధనలక్ష్మి ఇంట్లో చనిపోయిన విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు ఈశ్వరప్ప కోసం వెదికారు. అతను కూడా పొలం వద్ద గుళికల మందు తాగి పడి ఉండడాన్ని చూసి వె ంటనే 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గంటల వ్యవధిలో భార్యా భర్తలు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆర్సి కురవపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరూ కూడా అనుకువుగా మసలుకునే వారని గ్రామస్తులు చెబుతున్నారు. ఊరి విషయాలు కూడా పట్టించుకునేవారు కాదని తెలిపారు. ఇద్దరూ భయస్తులని ఇలా జరగడం ఊహించలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఒకరితో సన్నిహిత సంబంధం ఉందన్న అనుమానంతో ఆ ఊరిలోని ఓ మహిళ ధనలక్ష్మిని వేధించినట్టు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా గొడవ జరి గిందని స్థానికులు తెలిపారు. దీంతో మనస్తానికి గురై ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకోడానికి దారి తీసి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ముదివేడు పోలీసు లు తెలిపారు. అమ్మేది.. నాన్నేడి అమ్మేది..నాన్నేడి ఎందుకు ఇంత మంది వచ్చి వెళుతున్నారు అని చిన్నారులు బిత్తర చూపులు చూస్తూ నిలుచుండిపోయారు. ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు మోహన, స్థానికంగా ఉన్న స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. కూతురు పల్లవి బాలబడికి వెళుతోం ది. భార్యభర్తలు ఇద్దరూ ఒకరి తర్వాత మరొకరు లోకం విడచిపోవడంతో వారిని చూసిన వారికి కడుపు తరక్కుపోతోంది. చిరు వయస్సులోనే మాతృప్రేమకు దూరమైన ఆచిన్నారులను చూసి తల్లడిల్లని వారు లేరు. అయి న వారు, బంధువులు ఉన్నా వీరి ఆలనాపాలనా ఎవరు చూస్తారన్నది సమాధానం దొరకని ప్రశ్నలా మారింది.