Hyderabad District Collector
-
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణా
జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణా సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకు చెందిన యోగిత భర్త కూడా ఐఏఎస్ అధికారి. జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె...2002లో సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించి ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యారు. తిరిగి 2003లో ఐఏఎస్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడి రాష్ట్ర విభజనలో తెలంగాణకు అలాటయ్యారు. ఇటీవల జాతీయ ఉపాధి హమీ పథకం కింద పెద్దఎత్తున లక్ష్యం సాధించి జాతీయ స్థాయిలో ఎంపికై ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ కలెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నారు. ప్రొఫైల్: పేరు: డాక్టర్ యోగిత రాణా బ్యాచ్: 2003 బ్యాచ్ ఐఏఎస్ విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన తేదీ: 17 జనవరి 1973 స్వస్థలం: జమ్మూ -
హైదరాబాద్ కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా
కలెక్టర్ నిర్మల బదిలీ సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిర్మల బదిలీపై వెళుతున్నారు. ఆ స్థానంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలోకలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నిర్మలను ఏడు నెలల వ్యవధిలోనే బదిలీ చేయడం అధికార, ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధికారులు, ఉద్యోగులను పారదర్శకంగా పని చేయించడంలో ఆమె కఠినంగా వ్యవహరించారు. సామాజిక పింఛన్లు, భూక్రమబద్ధీకరణలో భాగంగా ఉచిత పట్టాలు పంపిణీ చేయడంలో కలెక్టర్ నిర్మల కీలక భూమిక పోషించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడం, పనితీరును మెరుగుపరిచే క్రమంలో ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. హైదరాబాద్ జిల్లాలోని అధికార పార్టీ నేతలకు కూడా ఆమెముక్కుసూటితనం మింగుడు పడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ నిర్మల బదిలీ కావటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారు. సీఎం సొంత జిల్లా అయిన మెదక్ నుంచి బదిలీపై హైదరాబాద్ కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా వస్తున్నారు. -
హైదరాబాద్ కలెక్టర్‌గా నిర్మల
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కె.నిర్మల సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా 18 మాసాలకుపైగా పని చేసిన ముఖేష్‌కుమార్ మీనా ఐఏఎస్ క్యాడర్ కేటాయింపుల్లో భాగంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లారు. హైదరాబాద్ ఏపీఎండీపీలో ైడెరైక్టర్గా పనిచేస్తున్న నిర్మలను జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయటంతో సోమవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా ఇన్చార్జి జేసీ సంజీవయ్య, డీఆర్ఓ అశోక్‌కుమార్‌తో సహా ఆర్డీఓలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు , కలెక్టరేట్ ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియచేశౠరు. ఇక ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ పోస్టును ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీ చేసింది. ఖమ్మం జిల్లా జేసీగా పనిచేస్తున్న సురేంద్ర మోహన్‌ను హైదరాబాద్ జేసీగా బదిలీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో జిల్లా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ప్రజా ఫిర్యాదులకు పెద్ద పీట: కలెక్టర్ నిర్మల ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కె.నిర్మల తెలిపారు. బాధ్యతలు స్వీరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. భూముల పరిరక్షణ, ఇళ్ల క్రమబద్ధీకరణ, ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రొఫైల్... స్వస్థలం: మహబూబ్‌నగర్ జిల్లా ఏ బ్యాచ్: 2005 ఐఏఎస్ బ్యాచ్ గతానుభవం: 1995 నుంచి 1999 వరకు కర్నూల్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆర్డీఓగా పని చేశారు. 1999 నుంచి 2002 వరకు మెదక్ జిల్లాలో డ్వామా పీడీగా, డీఆర్డీఏ పీడీగా బాధ్యతలు. 2003లో వరంగల్ జిల్లా వెలుగు పీడీ. 2004-09 వరకు హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి శాఖలో జాయింట్ కమిషనషర్గా, 2010 నుంచి 2011 వరకు పాడేరు ఐటీడీఏ పీడీగా పని చేశారు. 2011 నుంచి 2014 ఫిబ్రవరి వరకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఆ తర్వాత 10 మాసాలు హైదరాబాద్‌లో ఏపీఎండీపీలో డెరైక్టర్‌గా నిర్మల పని చేశారు.