హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణా
జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణా
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకు చెందిన యోగిత భర్త కూడా ఐఏఎస్ అధికారి. జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె...2002లో సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించి ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యారు. తిరిగి 2003లో ఐఏఎస్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడి రాష్ట్ర విభజనలో తెలంగాణకు అలాటయ్యారు. ఇటీవల జాతీయ ఉపాధి హమీ పథకం కింద పెద్దఎత్తున లక్ష్యం సాధించి జాతీయ స్థాయిలో ఎంపికై ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ కలెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నారు.
ప్రొఫైల్:
పేరు: డాక్టర్ యోగిత రాణా
బ్యాచ్: 2003 బ్యాచ్ ఐఏఎస్
విద్యార్హత: ఎంబీబీఎస్
పుట్టిన తేదీ: 17 జనవరి 1973
స్వస్థలం: జమ్మూ