హైదరాబాద్ కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా | Rahul Gandhi was a collector of Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా

Published Fri, Aug 7 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

హైదరాబాద్ కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా

హైదరాబాద్ కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా

కలెక్టర్ నిర్మల బదిలీ
 
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిర్మల బదిలీపై వెళుతున్నారు. ఆ స్థానంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలోకలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నిర్మలను ఏడు నెలల వ్యవధిలోనే బదిలీ చేయడం అధికార, ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధికారులు, ఉద్యోగులను పారదర్శకంగా పని చేయించడంలో ఆమె కఠినంగా వ్యవహరించారు. సామాజిక పింఛన్లు, భూక్రమబద్ధీకరణలో భాగంగా ఉచిత పట్టాలు పంపిణీ చేయడంలో కలెక్టర్ నిర్మల కీలక భూమిక పోషించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టారు.

ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడం, పనితీరును మెరుగుపరిచే క్రమంలో ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.  హైదరాబాద్ జిల్లాలోని అధికార పార్టీ నేతలకు కూడా ఆమెముక్కుసూటితనం మింగుడు పడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ నిర్మల బదిలీ కావటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు. సీఎం సొంత జిల్లా అయిన మెదక్ నుంచి బదిలీపై హైదరాబాద్ కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా వస్తున్నారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement