రాష్ట్రంలో 92% టీకాలు | 92 percent of vaccines in Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 92% టీకాలు

Published Sat, Feb 22 2020 2:30 AM | Last Updated on Sat, Feb 22 2020 2:30 AM

92 percent of vaccines in Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వ్యాధి నిరోధక టీకాలలో తెలంగాణ ఉత్తమ పనితీరు కనపరుస్తున్న రాష్ట్రాలలో ఒకటని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితా రాణా శుక్రవారం ఓ ప్రకటనలో తెలి పారు. 2015–16లో నిర్వహించిన జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే–4 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 68% టీకాలు వేశారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ కిట్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయడం ద్వారా వ్యాధి నిరోధక టీకాల అమలు కార్యక్రమం 72% నుంచి 92.4 శాతానికి పెరిగిందని తెలిపారు. 2019–20 ఏడాదిలో జనవరి వరకు తెలంగాణ రాష్ట్రం 92.4% టీకాలు వేయడం వల్ల దేశంలో ఉత్తమ పనితీరు కనపరుస్తున్న మొదటి 10 రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంలో 100% కవరేజ్‌ సాధించిన రాష్ట్రం కూడా తెలంగాణాయేనని కమిషనర్‌ పేర్కొన్నారు. 

పొరపాటుగా సమాధానం
లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో టీకాల కార్యక్రమం 2019–20కు సంబంధించిన గణాంకాల్లో 54.20%గా పొరపాటున ఇచ్చామని,  అప్పటికి తెలంగాణలో 94.89% టీకాల కార్యక్రమం పూర్తయిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ మనోహర్‌ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖకు పంపిన లేఖ లో తెలిపారు. మార్చి 2 నుంచి జరుగబోయే పార్లమెంటు సమావేశాల్లో దాన్ని సరిదిద్ది సరైన సంఖ్యను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement