Yogita Rana
-
రాష్ట్రంలో 92% టీకాలు
సాక్షి, హైదరాబాద్: వ్యాధి నిరోధక టీకాలలో తెలంగాణ ఉత్తమ పనితీరు కనపరుస్తున్న రాష్ట్రాలలో ఒకటని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా శుక్రవారం ఓ ప్రకటనలో తెలి పారు. 2015–16లో నిర్వహించిన జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే–4 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 68% టీకాలు వేశారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయడం ద్వారా వ్యాధి నిరోధక టీకాల అమలు కార్యక్రమం 72% నుంచి 92.4 శాతానికి పెరిగిందని తెలిపారు. 2019–20 ఏడాదిలో జనవరి వరకు తెలంగాణ రాష్ట్రం 92.4% టీకాలు వేయడం వల్ల దేశంలో ఉత్తమ పనితీరు కనపరుస్తున్న మొదటి 10 రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో 100% కవరేజ్ సాధించిన రాష్ట్రం కూడా తెలంగాణాయేనని కమిషనర్ పేర్కొన్నారు. పొరపాటుగా సమాధానం లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో టీకాల కార్యక్రమం 2019–20కు సంబంధించిన గణాంకాల్లో 54.20%గా పొరపాటున ఇచ్చామని, అప్పటికి తెలంగాణలో 94.89% టీకాల కార్యక్రమం పూర్తయిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ డాక్టర్ మనోహర్ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖకు పంపిన లేఖ లో తెలిపారు. మార్చి 2 నుంచి జరుగబోయే పార్లమెంటు సమావేశాల్లో దాన్ని సరిదిద్ది సరైన సంఖ్యను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణా
జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణా సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకు చెందిన యోగిత భర్త కూడా ఐఏఎస్ అధికారి. జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె...2002లో సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించి ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యారు. తిరిగి 2003లో ఐఏఎస్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడి రాష్ట్ర విభజనలో తెలంగాణకు అలాటయ్యారు. ఇటీవల జాతీయ ఉపాధి హమీ పథకం కింద పెద్దఎత్తున లక్ష్యం సాధించి జాతీయ స్థాయిలో ఎంపికై ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ కలెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నారు. ప్రొఫైల్: పేరు: డాక్టర్ యోగిత రాణా బ్యాచ్: 2003 బ్యాచ్ ఐఏఎస్ విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన తేదీ: 17 జనవరి 1973 స్వస్థలం: జమ్మూ -
హైదరాబాద్ కలెక్టర్‌గా యోగితా రాణా
- నిజామాబాద్ నుంచి బదిలీ.. జేసీకి అదనపు బాధ్యతలు హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను హైదరాబాద్ కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్(జేసీ) రవీందర్ రెడ్డికి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు. హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్ బొజ్జా.. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జేసీ ప్రశాంతి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మూడు నెలల తర్వాత హైదరాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్‌గను నయమించారు. కాగా, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో యోగితా రాణా బదిలీ అవుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుతుండటం గమనార్హం. సమర్థురాలైన అధికారణిగా పేరు పొందిన యోగితా.. ఈ-నామ్ అమలులో జాతీయ స్థాయి పురస్కారం దక్కించుకున్నారు. గత సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ నుంచి ఆమె విశిష్టసేవ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. -
ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా
నేడు కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు ఇందూరు: తెలంగాణ లో ఉత్తమ కలెక్టర్‌గా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏడాదిలోనే యోగితా రాణా ప్రభుత్వం, ప్రజలు, ప్రజాప్రతినిధులతో తన పనితనంతో భేష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు హరితహారంలో లక్ష్యాన్ని సాధించి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టారు. జిల్లాకు నిర్దేశించిన 3.35 కోట్ల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఈ నెల 13 నాటికే 3.36 కోట్ల మొక్కలు నాటించారు. సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ యోగితా రాణా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు.