ముగిసిన ఎంసీఐ తనిఖీలు
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మెడికల్ కళాశాలలో రెండు రోజులపాటు కొనసాగిన ఎం సీఐ తనిఖీలు గురువారంతో ముగిసాయి. ప్రొఫెసర్ అనిల్‌కుమార్, ప్రొఫెసర్ అనురాగ్ అగర్వాల్ ఆస్పత్రిని, కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మూడవ సంవత్సరం తరగతులకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, వివిధ విభాగాలకు సంబంధించి సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో వసతులు ఎలా ఉన్నాయి, రోజుకు ఔట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు? ఇన్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.
వివిధ విభాగాలలో రోగులకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయో, అత్యవసర సేవలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించారు. వీరి వెంట కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి తదితరులు ఉన్నారు. అనంతరం నవీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాలపల్లి అర్బన్ హెల్త్‌సెంటర్‌ను తనిఖీ చేశారు. క్లినికల్ టెన్సింగ్‌లో భాగంగా క్షేత్ర స్థాయిలో వైద్యసేవల గురించి వైద్యులకు సూచనలు చేశారు. తరువాత వారు తిరుగు పయనమయ్యారు.