hyderabad passport office
-
అత్యుత్తమ సేవల్లో నం.1
హైదరాబాద్: ‘ఏ’కేటగిరీ పాస్‌పోర్టు కార్యాలయాల్లో (ఏడాదికి 5 లక్షలకు పైగా పాస్‌పోర్టులు అందించేవి) ఒకటైన హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అత్యుత్తమ సేవలు అందించి 2017– 18 సంవత్సరానికి మొదటి స్థానం దక్కించుకుంది. బుధవారం సికింద్రాబాద్‌లో హైదరాబాద్ ప్రాంతీ య పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి మీడి యాకు వివరాలు వెల్లడించారు. వేగంగా పాస్‌పోర్టు అందించడం, పెండింగ్‌లను తగ్గించడం, ఫిర్యాదులను పరిష్కరణ తదితర అంశాలను పరిశీలించి విదేశీ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రకటించినట్లు చెప్పా రు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ను కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేస్తున్న రాష్ట్ర పోలీసులు కూడా అత్యుత్తమ సేవల్లో మొదటి స్థానం దక్కించుకున్నారన్నారు. మూడోసారి రాష్ట్ర పోలీసులు ఈ అవార్డు అందు కుని హ్యాట్రిక్ సాధించారన్నారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే అఖిల భారత పాస్‌పోర్టు అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఈ అవార్డును అందిం చనున్నట్లు వివరించారు. అలాగే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించిందన్నారు. దేశంలో మొత్తం 214 పీవోపీఎస్‌కేలు ఉండగా రాష్ట్రంలో 7, ఏపీలో 13 ఉన్నాయన్నారు. పీవోపీఎస్కేల్లో దరఖాస్తు తీసుకుంటున్నా.. అవి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చాకే జారీ ప్రక్రియ జరుగుతుందన్నా రు. ఈ జాప్యాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొదట వరంగల్‌లోని పీవోపీఎస్కేను ఇలా మారుస్తున్నామన్నారు. -
హైదరాబాద్ పాస్‌పోర్టు అధికారిగా విష్ణువర్ధన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఎమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డిని నియమితులయ్యారు. విదేశీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఉన్న అశ్విని సత్తారును ఢిల్లీకి బదిలీ చేశారు. ఈమె మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫెయిర్స్లో రిపోర్టు చేయాల్సి ఉంది. కొత్తగా నియమితులైన డా.విష్ణువర్ధన్‌రెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 2008 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఈయన గతంలో విదేశీ మంత్రిత్వ శాఖలో ఎక్స్టర్నల్ పబ్లిసిటీ సెల్లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. నెల రోజుల కిందటే ఆయన హైదరాబాద్ సచివాలయంలోని బ్రాంచ్ సెక్రటేరియట్‌కు బదిలీ అయ్యారు. ఇప్పుడు పాస్‌పోర్ట్ అధికారిగా నియమితులయ్యారు. ఈయనది వరంగల్ జిల్లాకు చెందిన వారని పాస్‌పోర్ట్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు వైఎస్సార్ , కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాలు విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. -
వారంలో 40,000 పాస్‌పోర్ట్‌లు
* దేశంలో ఇదే తొలిసారి * పాస్‌పోర్టు కార్యాలయం ఘనత * ఉద్యోగులకు పాస్‌పోర్ట్ అధికారి అశ్వని సత్తారు అభినందన సాక్షి, హైదరాబాద్: గత వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి 40,000 పాస్‌పోర్ట్‌లను జారీ చేసినట్టు పాస్‌పోర్ట్ కార్యాలయం మీడియా సమన్వయకర్త డా.ఎ.ఎం.శిరీష్ తెలిపారు. ఒక పాస్‌పోర్ట్ కార్యాలయం ఏడు రోజుల్లో ఇన్ని పాస్‌పోర్ట్‌లు జారీ చేయడం దేశంలోనే ఇదే ప్రథమమన్నారు. ఆగస్టు నెల చివరకు అత్యధికంగా 70,000 పాస్‌పోర్ట్‌లు జారీ చేయనున్నట్టు తెలిపారు. వీలైనంత వరకు పెండింగ్ పాస్‌పోర్ట్‌లు లేకుండా చూడాలని హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి అశ్విని సత్తారు సూచించారని చెప్పారు. అత్యధిక పాస్‌పోర్ట్‌లు జారీ చేసిన సందర్భంగా ఉద్యోగులను ఆమె అభినందించినట్టు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులు సెలవు పాస్‌పోర్ట్ కార్యాలయానికి వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో గురువారం నగరంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే) కిటకిటలాడాయి. నగరంలో టోలిచౌకి, అమీర్‌పేట్, బేగంపేటల్లో ఉన్న పీఎస్‌కేలకు దరఖాస్తుదారులు వందల్లో సంఖ్యలో తరలి వచ్చారు. శుక్రవారం వినాయక చవితి పండుగ, శని, ఆదివారాలు పాస్‌పోర్ట్ కార్యాలయానికి సెలవు. ఈ మూడు రోజులకు వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ కూడా ఉండదు. సోమవారం నుంచి యథావిధిగా పని చేస్తుంది.