Hypoglycemia
-
నవజాత శిశువుల్లో హైపోగ్లైసీమియా
సాక్షి, విశాఖపట్నం: నవజాత శిశువుల్లో చక్కెర స్థాయిలు తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్, వైద్య పరిశోధకురాలు డాక్టర్ అభామోనీ బారో అగర్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది ఈ హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడించారు. శిశువుల్లో 72 గంటల్లో సాధారణ స్థాయిలకు చక్కెర నిల్వలు తీసుకురాకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఎండోక్రైన్ జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా డాక్టర్ బారో అగర్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. శిశువుల్లో హైపోగ్లైసీమియా లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స పద్ధతులు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి వివరించారు.హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుందంటే...రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. మెదడు, శరీరానికి ఇంధనంలా పనిచేసే ప్రధాన వనరు గ్లూకోజ్. నవజాత శిశువుల్లో అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది శిశువుల్లో వణుకు, చర్మం నీలంగా మారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లికి సరైన పోషకాహారం అందకపోవడం, గర్భిణుల్లో మధుమేహం సరిగా నియంత్రించకపోవడం వల్ల ఎక్కువగా ఇది సంక్రమిస్తుంటుంది.నెలలు నిండకుండా పుట్టినవారికి, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, వివిధ కారణాల వల్ల మందులు ఎక్కువగా వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుంది. ప్యాంక్రియాస్ కణితి వంటి ఇతర కారణాల వల్ల శిశువు మలం ద్వారా ఎక్కువ ఇన్సులిన్ బయటికిపోతుంది. ఇది కూడా ఓ కారణమేనని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజూ జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది శిశువులు హైపోగ్లైసీమియా బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో 76 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది.గర్భిణులే జాగ్రత్త వహించాలిబిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణులు అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. అప్పుడే ఈ తరహా వ్యాధులు చిన్నారుల దరికి చేరవు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడపాలి. చక్కెర స్థాయిలు సక్రమంగా ఉండేటట్లుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి.ముందుగా గుర్తిస్తే మేలుశిశువుల్లో హైపోగ్లైసీమియాను గుర్తించేందుకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం సాధారణ రక్త పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ శిశువుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే దానిపై దృష్టిసారించాలి. పుట్టినప్పుడు తల్లి పాలు తాగిన తర్వాత 4 గంటల్లోపు గ్లూకోజ్ రీడింగ్ నమోదు చేయాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యం అందించాలి.తర్వాత 24 గంటల్లోపు చెక్ చేసుకోవాలి. అలా ప్రతి 12 నుంచి 24 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తూ 72 గంటల్లోగా సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. పిల్లలు పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో కేవలం 55 శాతం మంది నవజాత శిశువుల్లో మాత్రమే ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. వీరికే సకాలంలో వైద్యం అందుతోంది. 45 శాతం మందికి ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుబాటులో అత్యుత్తమ వైద్యసేవలుఈ వ్యాధి బారిన పడిన శిశువులను 72 గంటల్లో ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అనేక అత్యుత్తమ వైద్య సేవలు అందబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువు బరువు, నెలలు నిండాయా... లేదా..? ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వైద్యం అందిస్తుండాలి. అప్పుడే చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి.. శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతాడు. గ్లూకోజ్ లెవెల్స్ మరీ దారుణంగా ఉన్న శిశువులకు 40శాతం డెక్ట్స్ట్రోస్ (చక్కెరలాంటి ఒక రూపం) జెల్‌ను నేరుగా నోటికి పూస్తారు. ఇలా వెద్య విధానాలు అందుబాటులోకి రావడం వల్లే చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. చిన్న వ్యాధే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. -
పసితనంపై మృత్యుపంజా
బిహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రభుత్వాసుపత్రి మృత్యుగీతం ఆలపిస్తోంది. అమ్మలా అక్కున చేర్చుకుని ఆదరించి స్వస్థత చేకూర్చాల్సిన ఆసుపత్రి పసిపిల్లల ప్రాణాలు హరిస్తోంది. కేవలం 17 రోజుల్లో అక్కడ 130మంది మరణించారు. ఆ ఒక్కచోటే కాదు... ఆ జిల్లాలోని వేరే ప్రాంతాల్లో, పొరుగునున్న చంపారన్, మోతీహరి జిల్లాల్లో సైతం ఇప్పటికి వేయిమందికిపైగా పిల్లలు మెదడు వాపు వ్యాధి లక్షణాలతో ఇలా ఆసుపత్రుల్లో చేరారు. ఇంకా చేరుతున్నారు. ఒకపక్క ప్రభుత్వా సుపత్రులన్నీ ఇలా వ్యాధి సోకిన పిల్లలతో కిటకిటలాడుతుంటే పశ్చిమబెంగాల్లో వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం వైద్య సిబ్బంది సమ్మె చేయడంతో అసలే అంతంత మాత్రంగా వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి. ముజఫర్‌పూర్, దాని పొరుగు జిల్లాల్లో 1995 మొదలుకొని ఏటా ఇదే కాలంలో ఈ వ్యాధి ప్రబలుతున్నా వ్యాధికారక వైరస్ ఏమిటో, అదెందుకు వ్యాపిస్తున్నదో శాస్త్రీయంగా నిర్ధారించలేకపోయారు. దాని సంగతలా ఉంచి కనీసం ఇది దాపురించే కాలానికి ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లల్ని చేర్చుకుని చికిత్స అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలోనూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మొత్తంగా దీన్ని అక్యూట్ ఎన్సెఫ లైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) అని పిలుస్తున్నా అది స్పష్టంగా ఫలానా కారణంగా వస్తుందని నిర్ధారించలేదు. వైరస్లు, బాక్టీరియా, ఫంగీ తదితరాలవల్ల ఈ సిండ్రోమ్ రావొచ్చునని, వడదెబ్బ తగలడం వల్ల సైతం ఇది ఏర్పడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. (చదవండి : బిహార్‌లో హాహాకారాలు) ముజఫర్‌పూర్‌లో వ్యాధి గ్రస్తులైన పిల్లల్లో 98శాతంమందికి ఏఈఎస్‌తో పాటు హైపోగ్లైసీమియా లక్షణాలుంటున్నాయన్నది వైద్యుల మాట. ఇలాంటి స్థితి వియత్నాం, బంగ్లాదేశ్‌ల తర్వాత ముజఫర్‌పూర్‌లోనే కనిపిస్తున్నదని వారంటున్నారు. పౌష్టికాహారలోపం వల్ల లేదా సరైన తిండి తినకపోవడంవల్ల హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పడిపోవడం దీని లక్షణం. ఖాళీ కడుపున స్థానికంగా లభించే లిచీ ఫ్రూట్ తింటున్న పిల్లల్లో తీవ్రమైన జ్వరం రావడం, చూస్తుండగానే అయోమయావస్థలోకి వెళ్లడం లేదా పిచ్చివాళ్లుగా మారడం, చివరకు కోమాలోకి వెళ్లడం చూసి వీరందరికీ ఏఈఎస్తోపాటు హైపోగ్లైసీమియా కూడా ఉన్నదని తేలుస్తున్నారు. లిచీ ఫ్రూట్లో ఉండే హైపోగ్లైసిన్–ఏ అనే పదార్ధం విషపూరితమైనదని, మితిమీరి తింటే ఆ పదార్థం శరీరంలో గ్లూకోజ్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ పండ్లు అధికంగా లభించే మే, జూన్ మాసాల్లోనే పిల్లల్లో ఈ ప్రాణాంతక వ్యాధి బయటపడుతోంది. పైగా ఈ పండ్లు తిన్నాకే వారంతా మంచాన çపడుతున్నారు. కనుక వ్యాధి మూలాలు లిచీ ఫ్రూట్లో ఉండొచ్చునని లెక్కేస్తున్నారు. ముజఫర్‌పూర్‌లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేస్తామని, పిల్లలకు వందపడకల ఐసీయూ యూనిట్, వైరాలజీ ల్యాబ్ నెలకొల్పుతామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఈ పని ముందే జరిగుంటే సమస్య ఇంత ముదిరేది కాదు. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయదల్చుకున్నామని ఎన్డీఏ ప్రభుత్వం 2015లో ప్రకటించింది. దానికి సంబంధించి ముసాయిదా సిద్ధమైందని వార్తలు వెలువడ్డాయి కూడా. కానీ ఎందుకో ఇంతవరకూ అది సాకారం కాలేదు. అంతకు చాన్నాళ్లముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సైతం పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చింది. మొన్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తామొస్తే ఆరోగ్య పరిరక్షణను ప్రాథమిక హక్కు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ప్రకటించారు. ఇలా ఎవరెన్నిసార్లు చెబుతున్నా ఆరోగ్యరంగానికి కేటాయింపులు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. మన దేశంలో చికిత్సకు అవకాశమున్న వ్యాధుల వల్ల ఏటా 24 లక్షలమంది జనం చనిపోతున్నారంటే వైద్య సేవలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అర్ధమవుతుంది. ఇక్కడ ప్రతి లక్షమంది రోగగ్రస్తుల్లో 122మంది నాసిరకం వైద్యసదుపాయాల కారణంగా చనిపోతున్నారని లాన్సెట్ గ్లోబల్ సర్వే చెబుతోంది. ఇది బ్రెజిల్(74), రష్యా(91), చైనా(46), దక్షిణాఫ్రికా(93), బంగ్లాదేశ్(57) దేశాలతో పోలిస్తే చాలాఎక్కువ. ముజఫర్‌పూర్, దాని పొరుగునున్న జిల్లాల్లో పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడం, పౌష్టికాహార లోపం లేకుండా చూడటం వంటి చర్యలు తీసుకుంటే ఇన్ని మరణాలు సంభవించేవి కాదు. కనీసం అక్కడ తగినంతమంది వైద్యులున్నా, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నా పసివాళ్ల ప్రాణాలు ఇలా గాల్లో కలిసేవి కాదు. వ్యాధి సోకిన నాలుగు గంటల్లోగా పిల్లలకు 10 శాతం డెక్స్‌ట్రోజ్‌ను అందిస్తే వారు సత్వరం కోలుకునే అవకాశమున్నదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆమాత్రం సదుపాయమైనా అందుబాటులో లేదు. చిత్రమేమంటే బిహార్‌కు పొరుగునున్న ఉత్తరప్రదేశ్ తూర్పుప్రాంతంలో సైతం పౌష్టికా హారలోపం అధికంగా ఉంది. దేశంలో ఏటా సంభవించే పిల్లల మరణాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 35 శాతం. ముజఫర్‌పూర్‌ను స్మార్ట్ నగరంగా ప్రకటించమంటూ కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ప్రభుత్వం ఆమధ్య నివేదిక అందజేసింది. దాని ప్రకారం ఆ నగరంలో ప్రతి లక్షమంది రోగులకు 80మంది వైద్యులున్నారు. అక్కడి ఇతర జిల్లాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి గనుక ముజఫర్‌పూర్ చాలా మెరుగ్గా ఉన్నదని అనుకోవాలి. ఎందుకంటే చాలాచోట్ల లక్షమంది రోగులకు సగటున కేవలం ముగ్గురు ప్రభుత్వ వైద్యులు మాత్రమే ఉన్నారు! సాధారణ పరిస్థితుల్లో కనీసం లక్షమంది రోగులకు వందమంది వైద్యులుండటం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలన్నిటికీ హితవు చెబుతోంది. పట్టించుకునేవారేరి? వైద్యరంగంపై సమగ్రమైన దృక్పథంతో వ్యవహరించి సమూల ప్రక్షాళన చేయడానికి అవసరమైన నిధులను, మానవ వనరులను అందుబాటులోకి తీసుకొస్తే తప్ప ప్రజారోగ్య వ్యవస్థ బాగుపడదు. అంతవరకూ ఈ మరణమృదంగం ఆగదు. -
షుగర్ తగ్గితే గుర్తించే కుక్కలు!
మధుమేహులకు శుభవార్త. పెంపుడు కుక్కలకు కాస్తంత శిక్షణ ఇస్తే.. తమ యజమానికి రక్తంలో చక్కెర స్థాయి బాగా తగ్గినప్పుడు అవి గుర్తు పట్టగలవట! మధుమేహం బాధితులకు అది బాగా తగ్గినప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోవడం వల్ల ఉన్నట్టుండి బాగా నీరసం రావడం, కాళ్లు-చేతులు వణకడం, కళ్లు తిరిగి పడిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లో కుక్కలు ముందుగా తమ యజమానుల పరిస్థితిని గమనించి, వాళ్లను హెచ్చరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇందుకోసం ముందుగా తాము పెంచుకుంటున్న కుక్క పిల్లలకు కొద్దిపాటి శిక్షణ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల అవి తమ యజమానికి హైపోగ్లెసీమియా వచ్చినప్పుడు వెంటనే గమనించి వారిని తమకు చేతనైనట్లుగా హెచ్చరిస్తాయి. దీనివల్ల వాళ్లు వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. హైపోగ్లెసీమియా అనే పరిస్థితి వచ్చినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోతుంది. కుక్కలకు వాసన పసిగట్టే లక్షణం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తమ యజమాని చెమట లేదా ఊపిరి తీసుకునే పద్ధతిలో ఏమాత్రం మార్పు వచ్చినా అవి వెంటనే పసిగట్టగలవు. సాధారణంగా హైపోగ్లెసీమియా వచ్చినప్పుడు ఈ రెండు లక్షణాల్లోనే తేడా కనిపిస్తుంది. చెమట ఎక్కువగా పట్టడం, ఊపిరి వేగంగా తీసుకోవడం లాంటివి మధుమేహులలో కనిపించే ప్రాథమిక లక్షణాలు. సరిగ్గా వీటినే కుక్కలు పసిగడతాయి. ఈ విషయం గురించి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ప్రత్యేకంగా 'గ్లైసీమియా ఎలర్ట్ కుక్కల' పేరుతో శిక్షణ ఇచ్చిన శునకాలను వారు కొందరు యజమానులకు అలవాటు చేశారు. వాళ్లకు మధుమేహం స్థాయి బాగా పెరిగినప్పుడు గానీ, తగ్గినప్పుడు గానీ అవి గుర్తించేలా చేశారు. యజమానులకు రక్తంలో మధుమేహ స్థాయి మారగానే అవి గుర్తుపట్టి వెంటనే యజమానులతో పాటు కుటుంబ సభ్యలకు కూడా తమకు అలవాటైన పద్ధతిలో చెబుతాయి. ఇందుకోసం ఇప్పటివరకు 17 శునకాలకు శిక్షణ ఇచ్చారు. ఇవన్నీ కూడా యజమానుల ఆరోగ్యాన్ని సరిగ్గానే గుర్తించి పరీక్షలో నెగ్గాయి. త్వరలో ఇలా మరిన్ని శునకాలకు శిక్షణ ఇచ్చి, అవసరంలో ఉన్నవారికి ఉచితంగా ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు యజమానులైతే సొంతంగా కూడా ఇలాంటి శిక్షణ ఇచ్చుకుంటున్నారు. శిక్షణ పొందిన కుక్కలు పారామెడికల్ సిబ్బంది చెప్పినంత కచ్చితంగానే కుక్కలు కూడా మధుమేహం విషయాన్ని గుర్తించి చెబుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మధుమేహం స్థాయిని గుర్తించేందుకు గ్లూకోమీటర్లను తయారుచేసే కంపెనీలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ, ఒక మీటర్ చూపించే రీడింగ్‌కు, మరో మీటర్ చూపించే రీడింగ్‌కు సంబంధం ఉండదు. అలాగే, గ్లూకోమీటర్‌లో చూసుకున్నప్పుడు వచ్చే ఫలితానికి, మామూలుగా రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు వచ్చే ఫలితానికి కూడా చాలా తేడా కనిపిస్తుంది. అలాంటి మిషన్ల మీద ఆధారపడి అనవసరంగా పప్పులో కాలేయడం కంటే.. ఎంచక్కా మంచి కుక్కపిల్లను పెంచుకుని, దానికి తగిన శిక్షణ ఇచ్చి మధుమేహం అంచనా వేసుకోవడం ఉత్తమమని శాస్త్రవేత్తలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.