ఐసెట్ కన్వీనర్‌గా రామచంద్రమూర్తి
ఏయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్-2015 ప్రవేశ పరీక్ష కన్వీనర్‌గా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్.వి.రామచంద్రమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తిని ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు శుక్రవారం తన కార్యాలయంలో అభినందించారు. ప్రభుత్వం అందించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని చెప్పారు.