రాష్ట్రంలో ఐకియా ఫర్నిచర్ స్టోర్
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ దిగ్గజం ఐకియా ఆంధ్రప్రదేశ్‌లో ఫర్నిచర్ స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ భారత్‌లో రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడి ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో, నోయిడా(ఉత్తరప్రదేశ్) కూడా ఈ కంపెనీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐకియా సీఈవో మైకేల్ ఓహిసన్ కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద శర్మను సోమవారం కలిశారు.
ఈ సమావేశంలో ఐకెయా పెట్టుబడి ప్రణాళికలను ఆనంద శర్మకు ఓహిసన్ వెల్లడించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రణాళికల్లో భాగంగా ఈ 4 రాష్ట్రాల్లో స్టోర్స్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రయత్నాలను కూడా ఆయన ఆనంద్ శర్మకు వివరించారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల కథనం ప్రకారం.., ఐకియా కంపెనీ ఇప్పటికే ఐకియా ఇండియా పేరుతో భారత అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.