ICC Cricket
-
భారత టీమ్‌లో అందరూ సామ్సన్‌లా?
న్యూయార్క్ : వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ఓ కొత్తవాదనను తెరపైకి తెచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న రిషి కపూర్ కొన్ని నెలల క్రితం చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచకప్‌కు సెలక్ట్ అయిన 15 మంది ఆటగాళ్ల ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి, ఎందుకు ఎక్కువమంది గడ్డంతో ఉన్నారు అంటూ కామెంట్ పెట్టారు. అందరూ సామ్సన్‌లా? అంటూ సెటైర్ వేశారు(ప్రాచీన ఇజ్రాలియన్ న్యాయాధిపతుల్లో సామ్సన్ ఒకరు. ఆయన బలమంతా అతని వెంట్రుకల్లోనే ఉండేదని ప్రతీతి). గడ్డంలేకుండా ఉంటే అందంగా, చురుగ్గా ఉంటారని, ఇది కేవలం తాను గమనించిన విషయం మాత్రమేనంటూ ట్వీట్ చేశారు. Don’t take this picture as a reference point but why do most of our cricket players sport full facial hair(beards)? All Samson’s?(remember he had his strength in his hair) Surely they look smart and dashing without it. Just an observation! pic.twitter.com/QMLuQ0zikw — Rishi Kapoor (@chintskap) April 16, 2019 అయితే రిషి కపూర్ ట్వీట్‌కు నెటిజన్లు అదే రీతిలో బదులిస్తున్నారు. మీ కుమారుడు కూడా గడ్డం పెంచుతూ కనబడుతుంటాడుగా అందుకే వీళ్లు కూడా పెంచి ఉంటారు. ముందుగా మీ కుమారుడు ఎందుకు గడ్డంపెంచుకుని తిరుగుతున్నాడో కనుక్కో అంటూ ఓ నెటిజన్ అంటే.. జట్టుకు జిల్లెట్ కంపెనీనీ స్పాన్సర్ చేయమంటే ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ ఏకంగా 2011 వరల్డ్‌కప్ జట్టు సభ్యుల్లో చాలా మంది గడ్డం లేకుండా ఉన్నారంటూ అప్పటి ఫోటోను పోస్ట్ చేసి, బహుశా ఇంగ్లాండ్‌లో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి, గడ్డం పెంచుకుని ఉంటారు అంటూ కామెంట్ పెట్టాడు. Don't believe me see below is 2011 world cup which was in India pic.twitter.com/Hbc1GhFX5d — SHRISHAIL P. KATTI (@Shrishailkatti1) April 16, 2019 మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌కు భారత్ తరపున విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు ఆడనున్నారు. -
వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
-
ప్రపంచకప్ భారత జట్టు ఇదే..!
ముంబై: వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఖరారు చేసింది. చాహల్, పాండ్యాకు చోటు కల్పిస్తున్నట్టు ప్రకటిస్తుంది. అయితే, అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు నిరాశే ఎదురైంది. కాగా, ఆల్ రౌండర్ల స్థానంలో హార్దిక్ పాండ్యాతో పాటు విజయ్ శంకర్‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలో ప్రపంచకప్‌లో పాల్గొనబోయే జట్టు ఈవిధంగా ఉంది. విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ గత ఆరు నెలలుగా నాలుగో నంబర్ ఆటగాడిపైనే చాలా చర్చ జరిగింది. నిజానికి గత ఏడాది అక్టోబరులో ఆసియా కప్ తర్వాత కోహ్లి బహిరంగంగానే రాయుడు సరైనవాడంటూ మద్దతు పలికాడు. గతేడాది ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన తర్వాత రాయుడు టీమిండియాలోకి పునరాగమనం చేశాక భారత్ 24 వన్డేలు ఆడితే రాయుడు 21 ఆడాడు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వన్డే సిరీస్ సమయంలో ఇంకా అనిశ్చితి ఉందంటూ కోహ్లి, రోహిత్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు రేకెత్తించాయి. కివీస్‌తో చివరి వన్డేలో చక్కటి బ్యాటింగ్‌తో 90 పరుగులు చేసిన రాయుడు ఆసీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. దాంతో రాయుడ్ని పక్కన పెట్టేశారు. రాహుల్‌పై నమ్మకం.. ఊహించినట్లుగానే రాహుల్‌కు వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులో చోట దక్కింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ ఆటను పట్టించుకోమని మాటను సెలక్టర్లు పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు. రాహుల్ మిడిలార్డర్లో ఆడటంతో పాటు పైగా మూడో ఓపెనర్‌గా పని కొస్తాడనే ఉద్దేశంతో అతనికి చోటు కల్పించారు. మరోవైపు దినేశ్ కార్తీక్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. ఈ రేసులో రిషభ్ పంత్ ఉన్నప్పటికీ, అనుభవాన్ని పరిగణలోకి తీసుకోనే అతనికి ఉద్వాసన పలికారు. జడేజా, విజయ్ శంకర్లకు చాన్స్ గత కొన్ని నెలలుగా ఆల్‌రౌండర్ స్థానానికి జడేజా, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంది. అయితే ఈ ఇద్దర్నీ ఎంపిక చేయడం ఊహించని పరిణామం. శంకర్ ఆట పట్ల సానుకూలంగా ఉన్న సెలక్టర్లు వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ఎంపిక చేయడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. విజయ్ శంకర్ స్లో మీడియం పేస్ బౌలింగ్ కారణంగా అతని వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. మరోవైపు జడేజా మాత్రం కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేయగల సమర్థుడు. దాని వల్ల వారిపై ఒత్తిడి పెరిగి వికెట్లు దక్కడం చాలా సార్లు జరిగింది. పైగా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో చక్కగా రాణించడం జడేజాకు కలిసొచ్చింది. -
క్రికెట్ కమిటీ చైర్మన్‌గా మళ్లీ కుంబ్లే
సభ్యులుగా ద్రవిడ్, రవిశాస్త్రి దుబాయ్: ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. 2012లో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. తాజా నియామకంతో మరో మూడేళ్ల పాటు (2018 వరకు) ప్యానెల్ కు చీఫ్‌గా వ్యవహరించనున్నారు. ఇక కమిటీలో సభ్యులుగా రాహుల్ ద్రవిడ్‌కు చోటు లభించింది. తాజా ఆటగాళ్ల ప్రతినిధిగా ద్రవిడ్‌తో పాటు ఆసీస్ మాజీ స్పిన్నర్ టిమ్ మే నియామకం జరిగింది. మాజీ ఆటగాళ్ల ప్రతినిధిగా శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ను నియమించారు. వీరంతా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మీడియా ప్రతినిధిగా కామెంటేటర్ రవిశాస్త్రి, అంపైర్ల ప్రతినిధిగా రిచర్డ్ కెటిల్‌బరో... ఎక్స్ అఫీషియో చైర్మన్లుగా శశాంక్ మనోహర్, డేవ్ రిచర్డ్సన్ వ్యవహరిస్తారు. ఈనెల 31, జూన్ 1న లార్డ్స్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో కమిటీ తొలి సమావేశం జరుగుతుంది.