ICDC Officers
-
దారుణం: పసికందును పీక్కుతున్న కుక్క
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పొదలలో వదిలేయడంతో ఆ పసికందు మృతదేహాన్ని కుక్కలు రోడ్డుమీదకు ఈడ్చుకు వచ్చాయి. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గ్రామ మహిళా పోలీసు తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలిసిన ఐసీడీఎస్ అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందు మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన ఐసీడీఎస్ సీడీపీఓ ఆశా రోహిణి సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో ఆ దగ్గర్లోనే పొదలలో ఎవరో గుర్తు తెలియని మహిళ ప్రసవం జరిగినట్లు గుర్తించారు. ప్రసవం జరిగిన ఆనవాళ్లను కనుగొన్నారు. పొలాల్లోనే ప్రసవించిన మహిళ పసికందును వదిలి వెళ్ళిపోవడంతో పసికందు మృతి చెందిందని తెలిసింది. పొదలో ఉన్న పసికందు మృతదేహాన్ని కుక్క నోటకరచుకొని వస్తుండగా స్థానికులు గమనించి విధించడంతో రోడ్డుపైనే పసికందు మృతదేహాన్ని కుక్క వదిలి వెళ్ళిపోయింది. వెంటనే స్థానికులు గ్రామ మహిళా కానిస్టేబుల్ ద్వారా పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటువంటి అవాంఛనీయ గర్భం ధరించిన మహిళలు ఐసీడీఎస్ అధికారులకు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని పిల్లలను సంరక్షించి తామే వేరే వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. దయచేసి ఇలాంటి పాపపు పనులు చేయొద్దని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఆశా రోహిణి తెలియజేశారు. -
నాన్నా మళ్లీ వస్తా..
షాద్‌నగర్ రూరల్: ఆ చిన్నారులకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. చిన్నారుల ఆలనా, పాలనా తండ్రికి భారంగా మారింది. ముక్కుపచ్చలారని పసిమొగ్గలను లాలించేందుకు అమ్మ లేకపోవడం.. వారి బాధ్యత నాన్నకు భారం కావడంతో ఆ చిన్నారులను ఐసీడీఎస్ అధికారులు శిశు విహార్‌కు తరలించారు. ఈ ఘటన శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల దీపాయిగూడకు చెందిన గణేష్ 16 సంవత్సరాల క్రితం షాద్‌నగర్‌కు వలస వచ్చాడు. పట్టణంలో కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షాబాద్ మండలం సర్దార్‌నగర్‌కు చెందిన శ్రీలతతో పరిచయం ఏర్పడింది. (అమ్మ బతకాలని..) 9 సంవత్సరాల క్రితం గణేష్, శ్రీలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూలీపని చేస్తూ రైల్వే స్టేషన్ సమీపంలో జీవనం కొనసాగిస్తున్నారు. వారికి శ్రీగాయత్రి(4), హన్సిక(17నెలలు) చిన్నారులు ఉన్నారు. శ్రీలత మూడు నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందింది. చిన్నారుల ఆలనా పాలనా చూసే తల్లి లేకపోవడంతో వారి బాధ్యత తండ్రికి భారంగా మారింది. ఈ విషయాన్ని తండ్రి గణేష్ అంగన్వాడీ టీచర్ జయమ్మ ద్వారా ఐసీడీఎస్ అధికారులకు సమాచారాన్ని అందించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ చిన్నారులను రెండు నెలల పాటు హోం క్వారంటైన్లో ఉంచి శుక్రవారం సీడీపీఓ నాగమణి ఆధ్వర్యంలో శిశు విహార్ ప్రతినిధులకు అప్పగించారు. (బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!) నేను పెద్దయ్యాక మళ్లీ వస్తా చిన్నారులను అధికారులు శిశువిహార్‌కు తీసుకువెళ్లే సమయంలో ‘నాన్న నేను మళ్లీ వస్తా’ అంటూ చిన్నారి శ్రీగాయత్రి తండ్రి గణే‹శ్‌కు చెప్పింది. ‘మా అమ్మ బిస్కెట్లు, చాకెట్లు ఇప్పిస్తుండె. ఇప్పుడు గుండెనొప్పితో చనిపోయింది. అందుకే నేను మా చెల్లి హాస్టల్‌కు వెళ్తున్నాం. నేను పెద్దయ్యాక మళ్లీ వస్తా’ అంటూ ఆ చిన్నారి చెప్పిన మాటలు అందిరి మనసులను కదిలించాయి. ముక్కుపచ్చలారని పిల్లలు పసితనంలోనే తల్లిని కోల్పోయి మేము హాస్టల్‌కు వెళుతున్నామంటూ అమాయకత్వంతో ఆ చిన్నారి చెప్పడాన్ని చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి.(భళారే చార్కోల్ చిత్రాలు) -
మళ్లీ ఆడపిల్లే పుట్టిందని..
అచ్చంపేట (మహబూబ్‌నగర్ జిల్లా) : నాలుగవసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఓ దంపతులు పుట్టిన పాపను ఐసీడీసీ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. సింగారం గ్రామానికి చెందిన భీంజీ,లలిత దంపతులకు గతంలో ముగ్గురు ఆడపిల్లలు సంతానం. భీంజీ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో హమాలీగా పని చేస్తున్నాడు. కాగా మగపిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వారికి నాలుగవ సంతానంగా కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో పాపను పెంచలేమని చెప్పి ఆ పసికందును ఐసీడీసీ అధికారులకు అప్పగించారు. ఐసీడీసీ అధికారులు బాలికను శిశువిహార్‌కు తరలించనున్నట్లు సమాచారం.