నాలుగవసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఓ దంపతులు పుట్టిన పాపను ఐసీడీసీ అధికారులకు అప్పగించారు.
అచ్చంపేట (మహబూబ్‌నగర్ జిల్లా) : నాలుగవసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఓ దంపతులు పుట్టిన పాపను ఐసీడీసీ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. సింగారం గ్రామానికి చెందిన భీంజీ,లలిత దంపతులకు గతంలో ముగ్గురు ఆడపిల్లలు సంతానం.
భీంజీ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో హమాలీగా పని చేస్తున్నాడు. కాగా మగపిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వారికి నాలుగవ సంతానంగా కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో పాపను పెంచలేమని చెప్పి ఆ పసికందును ఐసీడీసీ అధికారులకు అప్పగించారు. ఐసీడీసీ అధికారులు బాలికను శిశువిహార్‌కు తరలించనున్నట్లు సమాచారం.