రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గత అర్థరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, రంగారెడ్డి, నిజామాబాద్, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా తడ మండలం బీవీపాలెంలోని చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడిలో రూ. లక్ష నగదును స్వాదీనం. నిబంధనలకు విరుద్ధంగా చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు బయట వ్యక్తులు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తరు జిల్లా నరహరిపేట చెక్‌పోస్ట్‌పై దాడి చేసి రహదారిపై వెళ్తున్న పలు వాహనాల నుంచి అక్రమంగా నగదు వసూల్ చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ చెక్ పోస్ట్ నుంచి రూ. లక్షకుపైగా నగదును స్వాధీనం చేసకున్నారు. అలాగే ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం చెక్‌పోస్ట్‌పై నిర్వహించిన దాడుల్లో రూ. 2 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుపై ఏసీబీ అధికారులు చెక్ పోస్ట్ సిబ్బందిని ప్రశ్నించిగా వారు మీనమేషాలు లెక్కపేట్టారు. దీంతో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
వీటితోపాటు నిజామాబాద్ జిల్లా భోదన్ మండలం సాలూరు చెక్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించి అధిక మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై దాడి చేశారు. ఆ దాడిలో రూ. లక్షకు పైగా నగదులు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ నగదును స్వాధీనం చేసుకుని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్ ఫెక్టర్ కిరణ కుమార్ తో పాటు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే ఏసీబీ చేపట్టిన దాడులు శనివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి.