ideals
-
జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు. చరిత్ర పుటలకే పరిమితమైన వారి చిత్రాలు, బోధనలు ప్లకార్డుల ద్వారా ఆందోళనలో మళ్లీ ఊపరి పోసుకున్నాయి. ముఖ్యంగా యువత వారి బోధనలను నినాదాలుగా ప్రజల్లోకి మళ్లీ తీసుకొచ్చారు. అలాంటి జాతీయ నాయకులో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్లు ముందున్నారు. జాతి, మత, కుల భేదాలు లేకుండా ముఖ్యంగా హిందూ, ముస్లిలు కలసిమెలసి శాంతి, సామరస్యాలతో జీవించాలంటూ గాంధీ ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తున్నారు. ఆయన రామ రాజ్యాన్ని కోరుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రానంతరం జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లలో బెంగాల్లో బాధితులను పరామర్శించిన గాంధీ ‘ప్రజలు మనసు మార్చుకోవాలి’ అంటూ ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటిస్తున్నారు. ఇంతకుముందు లైబ్రరీలకు, వీధి కూడళ్లకు మాత్రమే పరిమితమైన అంబేడ్కర్ ఫొటోలు నేడు యువత చేతుల్లో దర్శనమిస్తున్నాయి. ‘మన అద్భుతమైన రాజ్యాంగం’ అన్న నినాదాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగం ముందు మాటలో పేర్కొన్న ‘లౌకికవాదం’కు నిజమైన అర్థం కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఒక్క జాతీయ నాయకులే కాకుండా ఇటీవల ఢిల్లీలో ఓ పోలీసుల లాఠీచార్జి నుంచి తప్పించేందుకు ఓ విద్యార్థి చుట్టూ నలుగురు విద్యార్థినిలు రక్షణ కవచనంలా నిలబడి రక్షించిన ‘హీరోల’ ఫొటోలు కూడా ప్రదర్శనల్లో కనిపిస్తున్నాయి. (చదవండి: ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు) -
పురుషుడు మిగిలాడు!
ఆదర్శాలు మారకూడదు. ఆదర్శాలు‘మారడం’ అంటే మునుపు ఏర్పరచిన అభిప్రాయాలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం. ఒక ఆదర్శ పురుషుడిపై పదేళ్ల క్రితం ఉన్న అభిప్రాయాలు ఈ పదేళ్లలో మారకూడదనేం లేదు. అయితే ఏ కారణం చేతనైతే అతడు ఆదర్శప్రాయుడిగా ఉన్నారో అదే ఆదర్శం నిన్నటికి, నేటికీ, రేపటికీ మారిపోకూడదనే ఆశిస్తాం. అభిప్రాయాలు మారొచ్చు. ఆదర్శాలు మారకూడదు. ఆదర్శాలు ‘మారడం’ అంటే మునుపు ఏర్పడిన అభిప్రాయాలకు భంగం కలగడం. ఆదర్శం మారినప్పుడు ఆ ఆదర్శం నుంచి రూపుదాల్చిన అభిప్రాయాలు మారిపోవడం సహజమే అయినా ఆసారాం బాపూజీపై ఇప్పటికీ ఆయన అనుచరుల అభిప్రాయాలు మారలేదు! నిన్న జోథ్పూర్ కోర్టు ఆసారాంపై తుది తీర్పుకు సిద్ధమవుతూ, అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందనుకున్న నాలుగు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించడాన్ని బట్టి ఆయనకు నేటికీ బలమైన అనుచరులు, ఆ అనుచరులకు బలమైన అభిప్రాయాలు ఉన్నాయని అర్థమవుతోంది. పదేళ్ల క్రితం అటల్ బిహారీ వాజపేయి, మరో మాజీ ప్రధాని చంద్రశేఖర్, కె.ఆర్.నారాయణన్, కమల్నాథ్, కపిల్ సిబాల్, అశోక్ సింఘాల్, ఉద్ధవ్ ఠాక్రే, పవన్ గుప్తా వంటి వాళ్లకు సైతం ఆసారాం తనపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచగలిగారు. అది ఆయన నేరుగా వాళ్లను కూర్చోబెట్టి ఏర్పరచినది కాకపోవచ్చు. ప్రాపంచిక అజ్ఞానపు పొరల్ని తొలగించారని, ఆయనకు యావత్ భారత జాతీ రుణపడి ఉందని, ఆయనొక శాంతి దూత అని, దేవజ్ఞాన జ్యోతి అని, నేటి తరానికి ఆధ్యాత్మిక విలువల్ని ప్రసాదించారని, సత్ప్రవర్తనను ప్రబోధించారనీ ఆయనపై ఒక గొప్ప భక్తిభావంతో కూడిన అభిప్రాయం విశ్వవ్యాప్తం అయిందంటే ఆసారాం ఆదర్శాలే కారణం. ఆయనకు రెండు కోట్ల మంది అనుచరులు ఉన్నారు. ఇప్పటికీ వారు (కోర్టు తీర్పు తర్వాత కూడా) తమ అభిప్రాయాలపై తాము నిలబడే ఉన్నారు! ఆసారాం కూడా తన ఆదర్శంపై నిలబడి ఉంటే బాగుండేది. ఆదర్శపురుషుడు ఇప్పుడు పురుషుడిగా మాత్రమే మిగిలిపోయారు. – మాధవ్ శింగరాజు -
సరైన నిర్ణయాలు తీసుకోవాలి
విద్యార్థులకు సత్యవాణి ఉద్బోధ చాపాడు: విద్యార్థులు 18-22 ఏళ్ల వయస్సులో తీసుకునే ఆశయాలు, ఆదర్శాల మీదనే వారి 75 ఏళ్ల జీవితం ఆధారపడి ఉంటుందని , ప్రతి విద్యార్థి సరైన నిర్ణయాలు తీసుకుని మంచిమార్గంలో వెళ్లాలని సమైక్యాంధ్ర ఉద్యమంలో బాణీ విన్పించిన భారతీయం సత్యవాణి అన్నారు. చాపాడు సమీపంలోని శ్రీచైతన్యభారతీ, విజ్ఞానభారతీ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం విద్యార్థులకు ‘యువతకు దిశ, దశా నిర్ధేశ సదస్సు’ నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యతిధిగా హాజరైన సత్యవాణి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచానికి గణితం నేర్పించిన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులు తలెత్తుకునే గొప్పవారవుతారన్నారు. పటేల్, లాల్బహదూర్శాస్త్రి, ఝాన్సీ, నెహ్రూ వంటి వారందరూ విద్యార్థి దశ నుంచే దేశనాయకులయ్యారన్నారు. ప్రతి విద్యార్థిలో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, చదువు ద్వారానే అది బయటికి వస్తుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు దేశభక్తి, ధైవభక్తి ఉండాలన్నారు. తమ పిల్లలు మంచి మార్గాలలో నడవాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు దేశనాయకులు, దేవుళ్ల పేర్లను వారికి పెడతారన్నారు. విద్యార్థికి ప్రతి క్షణం విలువైనదని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే చదువులో ఏదైనా సాధిస్తారని కరస్పాండెంటు వి.జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదర్శరైతు గుడివాడ నాగరత్నంనాయుడు, సంఘ సేవకులు లక్ష్మీనరసయ్య, ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.