IIFL Holdings
-
తెలుగు రాష్ట్రాల్లో రూ. 7,200 కోట్ల గృహ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నాటికల్లా రూ. 7,200 కోట్ల గృహ రుణాల మంజూరును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ (ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్) ఈడీ మోనూ రాత్రా వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4,320 కోట్లు, తెలంగాణలో రూ. 2,880 కోట్లు ఉండనున్నట్లు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 17,000 పైచిలుకు కుటుంబాలకు రూ. 2,448 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో హరిత గృహాల నిర్మాణంపై డెవలపర్లలో అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన 9వ ’కుటుంబ్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోనూ ఈ విషయాలు తెలిపారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్‌తో (ఏడీబీ) కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పర్యావరణ హిత నిర్మాణాలు చేపట్టే డెవలపర్లకు చౌకగా రుణాలివ్వడంలో తోడ్పడేందుకు ఏడీబీ 10 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చిందని వివరించారు. సగటు గృహ రుణ పరిమాణం సుమారు రూ. 15 లక్షలుగా ఉంటోందని మోనూ చెప్పారు. ప్రస్తుతం తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 87 శాఖలు ఉన్నాయని, 2023 నాటికి వీటి సంఖ్యను 120కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: డార్మిటరీలో మొదలైన స్టార్టప్.. నేడు 101 బిలియన్ డాలర్ల కంపెనీ -
ప్రమోటర్ల పుష్- IIFL షేర్లు హైజంప్
గ్రూప్ కంపెనీలో ప్రమోటర్లు వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఐఐఎఫ్ఎల్(IIFL) కౌంటర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు క్యూకట్టడంతో గ్రూప్‌లోని మూడు లిస్టెడ్ కంపెనీల షేర్లూ అనూహ్య లాభాలతో పరుగు తీస్తున్నాయి. ట్రేడింగ్ పరిమాణం సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓపెన్ మార్కెట్ ద్వారా కంపెనీ ప్రమోటర్, డైరెక్టర్ నిర్మల్ జైన్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 4.54 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు రూ. 3.4 కోట్లు వెచ్చించారు. దీంతో కంపెనీలో జైన్ వాటా 12.49 శాతం నుంచి 12.61 శాతానికి బలపడింది. ఈ నేపథ్యంలో ఐఐఎఫ్ఎల్ గ్రూప్ షేర్లన్నీ హైజంప్ చేశాయి. యమ స్పీడ్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ బాటలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 1134 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1195 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కౌంటర్ సైతం అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 82.50 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 2.46 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కౌంటర్లో 4.85 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇదే విధంగా 99,000 షేర్ల సగటుతో పోలిస్తే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కౌంటర్లో 65,000 షేర్లు, 2700 షేర్ల సగటుతో పోలిస్తే ఐఐఎఫ్ఎల్ వెల్త్ కౌంటర్లో 1400 షేర్లు చొప్పున ట్రేడయ్యాయి. -
ఐఐఎఫ్ఎల్ కౌంటర్లో జోరు
ముంబై: దేశీయ ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలతో ఈ కౌంటర్ జోరందుకుంది. ఈవాల్టి మార్కెట్లో భారీ లాభాలను ఆర్జించింది. ఒక దశలో ఈ షేరు 11 శాతం మేర దూసుకెళ్లింది. బుధవారం మార్కెట్ ముగిసిన తరువాత ఐఐఎఫ్ఎల్ మెరుగైన ఫలితాలను వెల్లడించింది. అయితే గురువారం గణతంత్ర దినం సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో ఈ కౌంటర్ కు డిమాండ్ పుట్టింది. ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకుదిగారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 41.3 శాతం ఎగసిం 179.07 కోట్లను సాధాచింది. గత ఏడాది లో రూ. 127 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా గత ఏడాది రూ. 985 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగి రూ. రూ.1,274 కోట్లకు చేరింది.