ముంబై: దేశీయ ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలతో ఈ కౌంటర్ జోరందుకుంది. ఈవాల్టి మార్కెట్లో భారీ లాభాలను ఆర్జించింది. ఒక దశలో ఈ షేరు 11 శాతం మేర దూసుకెళ్లింది. బుధవారం మార్కెట్ ముగిసిన తరువాత ఐఐఎఫ్ఎల్ మెరుగైన ఫలితాలను వెల్లడించింది. అయితే గురువారం గణతంత్ర దినం సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో ఈ కౌంటర్ కు డిమాండ్ పుట్టింది. ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకుదిగారు.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 41.3 శాతం ఎగసిం 179.07 కోట్లను సాధాచింది. గత ఏడాది లో రూ. 127 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా గత ఏడాది రూ. 985 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగి రూ. రూ.1,274 కోట్లకు చేరింది.
ఐఐఎఫ్ఎల్ కౌంటర్లో జోరు
Published Fri, Jan 27 2017 1:58 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
Advertisement