ఐఐటీ–జేఈఈ మెయిన్ రాత పరీక్ష ప్రశాంతం
15,835 మంది విద్యార్థులు హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీయూ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో నడుస్తున్న జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఐఐటీ–జేఈఈ) మెయిన్స్ పరీక్ష ఆదివారం తిరుపతిలో ప్రశాం తంగా జరిగింది. తిరుపతిలో 27 పరీక్షా కేంద్రాల్లో జేఈఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. తిరుపతి కేంద్రంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.