IIT rurki
-
జేఈఈ టాపర్ కార్తికేయ
న్యూఢిల్లీ: జేఈఈ (అడ్వాన్స్డ్) 2019 ఫలితాల్లో గుజరాత్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్ 372కు గాను 346 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఐఐటీల్లో ప్రవేశ అర్హతను కల్పించే జేఈఈ ఫలితాలను ఐఐటీ– రూర్కీ శుక్రవారం విడుదల చేసింది. అలహాబాద్‌కు చెందిన గౌరవ్‌సింగ్ 340 మార్కులతో, ఢిల్లీకి చెందిన అర్చిత్ బుబ్నా 335 మార్కులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. వీరిద్దరూ మిత్రులు కావడం గమనార్హం. ఒకరి నోట్స్ ఒకరు పంచుకొని చదువుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జోన్‌కు చెందిన ఆకాశ్ రెడ్డి, కార్తికేయ బత్తెపాటి నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. మొత్తం 1,61,319 విద్యార్థులు పరీక్ష రాయగా 38,705 మంది అర్హత సాధించారు. అందులో 5,356 మంది మాత్రమే విద్యార్థినులు ఉన్నారు. జనరల్ కేటగిరీ నుంచి 15,556, ఆర్థికంగా వెనుకబడిన వర్గం నుంచి 3,636, బీసీ నుంచి 7,651, ఎస్సీ నుంచి 8,758, ఎస్టీ నుంచి 9,034 మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్ 16 నుంచి సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థినుల విభాగంలో సహాయ్ టాప్ కామన్ ర్యాంక్ లిస్టు (సీఆర్ఎల్)లో గుప్త కార్తికేయ మొదటిస్థానం సాధించగా, 308 మార్కులతో పదో ర్యాంక్ సాధించిన షబ్నమ్ సహాయ్ విద్యార్థిని విభాగంలో టాప్‌గా నిలిచారు. ఈమెకు నృత్యంతోపాటు పియానో వాయించడంలో కూడా నైపుణ్యం ఉంది. రోజుకు ఎనిమిది గంటలపాటు చదివానని ఆమె అన్నారు. ఉపాధ్యాయులతో, మిత్రులతో మాట్లాడటానికి మాత్రమే వాట్సప్ వినియోగించానని తెలిపారు. సహాయ్ తండ్రి ఐఐఎం–అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మాదాపూర్‌కు చెందిన సూరపనేని సాయి వంగ, ముంబైకి చెందిన తులిప్ పాండే విద్యార్ధినుల విభాగంలో రెండు, మూడు ర్యాంకులు సాధించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా: గుప్తా సోషల్ మీడియాకు దూరంగా ఉండి, కష్టపడి చదవడం వల్లే మొదటి ర్యాంకు సాధించగలిగానని గుప్తా కార్తికేయ అన్నారు. తన తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ ఇస్తామని చెప్పినప్పటికీ తానే తిరస్కరించానని అన్నారు. చదువులో ఎదురయ్యే ఒత్తిడి తగ్గించుకోవడానికి బాడ్మింటన్ ఆడటంతోపాటు మిత్రులతో కలసి ఆహారం తినేవాడినని అన్నారు. గుప్తా తండ్రి ఓ పేపర్ తయారీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గుప్తా రెండు సంవత్సరాలుగా ముంబైలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడని అతడి తల్లి పూనమ్ తెలిపారు. క్లాసులు ముగిశాక కూడా ఆరేడు గంటలు చదువుకునేవాడని ఆమె అన్నారు. టాప్–10లో తమ కుమారుడు నిలుస్తాడన్న నమ్మకం ముందు నుంచీ ఉందని తెలిపారు. -
టాప్ 200లో 49 భారతీయ వర్సిటీలు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) 2019 సంవత్సరానికి విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించగా భారత్‌కు చెందిన 49 వర్సిటీలు టాప్ 200లో స్థానం సంపాదించాయి. ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్) 61వ స్థానం, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 64వ స్థానంలో నిలిచాయి. సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అమృతా యూనివర్సిటీ ఈసారి టాప్ 150లో స్థానం సంపాదించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, ఐఐటీ(హైదరాబాద్) తొలిసారిగా ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి. 2018లో భారత్ నుంచి 42 వర్సిటీలు స్థానం సంపాదించగా ఈసారి అది 49కి పెరిగింది. టాప్‌లో చైనా వర్సిటీలు చైనాకు చెందిన నాలుగు వర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత వర్సిటీల్లో విద్యాబోధన మెరుగుపడినా ప్రమాణాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయని టీహెచ్ఈ ఎడిటర్ ఎల్లీ బోత్వెల్ తెలిపారు. -
గేట్–2017 ఫలితాలు విడుదల
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ర్యాంకుల పంట.. సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, కేంద్ర విద్యా సంస్థల్లో ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గేట్–2017 పరీక్ష ఫలితాలను ఆదివారం ఐఐటీ రుర్కీ విడుదల చేసింది. విద్యార్థులు www. gate.iitr.ernet.in వెబ్సైట్ నుంచి ఫలితాలు పొందాలని సూచించింది. ఆలిండియా స్థాయి గేట్–2017 పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ర్యాంకుల పంట పండింది. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్‌లో నవీన్ తాడూరి మొదటి ర్యాంక్ సాధించాడు. ఈసీఈ విభాగంలో కె.సాయిప్రమోద్రెడ్డికి మొదటి ర్యాంకు, శ్రీకల్యాణికి రెండో ర్యాంకు, ఉప్పు లిఖిత సాయికి ఆరో ర్యాంకు, ఆనంద్ ఉప్పాడకు తొమ్మిదో ర్యాంకు దక్కింది. అలాగే సీఎస్ఐటీలో మేఘశ్యామ్ పసునూరి ఆరో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. వీరితోపాటు జేఎన్టీయూహెచ్లో 2016లో బీటెక్–ఈఈఈ పూర్తి చేసుకున్న అచ్చుకట్ల సర్ఫరాజ్ నవాజ్ జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు.