IITF
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక.. పడిపోయిన ఆకుల శ్రీజ ర్యాంకు
International Table Tennis Federation (ITTF) world rankings- న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌లో నిలిచింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మనిక గత నవంబర్‌లో ఆసియా కప్‌లో కాంస్యం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతవారం దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో కాంస్యం గెలిచి 140 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ ఆరు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ 41వ ర్యాంక్‌లో, ఆచంట శరత్ కమల్ 46వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణకు చెందిన సూరావజ్జుల స్నేహిత్ మూడు స్థానాలు పడిపోయి 125వ ర్యాంక్‌లో నిలిచాడు. చదవండి: Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
Table Tennis: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి
Manika Batra: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ 136వ ర్యాంక్ లో ఉన్నాడు. సత్యన్ 39వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఇది కూడా చదవండి: రామ్‌కుమార్‌కు మిశ్రమ ఫలితాలు పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ 3–6, 7–5, 3–6తో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. అయితే డబుల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ 7–6 (7/5), 6–7 (4/7), 11–9తో రోహన్ బోపన్న (భారత్)–జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) ద్వయంపై ‘సూపర్ టైబ్రేక్’లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 7–6 (7/1), 5–7, 7–10తో మూడో సీడ్ సాదియో దుంబియా–రిబూల్ (ఫ్రాన్స్) జంట చేతిలో... పురవ్ రాజా–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 4–6, 3–6తో జీవన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ చేతిలో ఓడిపోయాయి. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? -
నైపుణ్యాలను పెంచుకుందాం
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధి కోసం వృత్తి శిక్షణా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రగతి మైదాన్‌లో 33వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన(ఐఐటీఎఫ్)ను గురువారం రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘పెరుగుతున్న జనాభా ఫలితంగా భారతదేశం ఆర్థిక లబ్ధిని పొందనుంది. 2030 నాటికి దేశంలోని 50 శాతం జనాభా ఉత్పత్తి శక్తుల్లో భాగమవుతారు. ప్రపంచంలోనే అత్యధిక శ్రమశక్తి కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఏదైనా సామాజిక పరివర్తనకు కారణమవుతుంది. త్వరితమవుతున్న ప్రపంచ మార్పులకు ధీటుగా ముందుకు సాగాలంటే మన శ్రమశక్తిని నైపుణ్యవంతం చేసుకోవాల్సి ఉంటుంద’ని ప్రణబ్ పిలుపునిచ్చారు. ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైన వాణిజ్య ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన 6 వేల మంది పాల్గొంటున్నారు. విస్తృత శ్రేణిలో ఎలక్ట్రానిక్, అలంకార, వినిమయ వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. 21 దేశాలకు చెందిన 260 మంది పారిశ్రామికులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. జపాన్, థాయ్‌లాండ్, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, హాంగ్‌కాంగ్, కెనడా, ఇటలీ, అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక సంస్థలతో వ్యాపార ఒప్పందాల సమావేశాలు కూడా ఇక్కడ జరగనున్నాయి. తొలి ఐదు రోజులు ప్రధానంగా ఇందుకే కేటాయించనున్నారు. ఇక ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన నగరవాసులు ఇక్కడ ఏర్పాటు చేసిన పెవిలియన్లను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అందులో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను చూస్తూ మైమరచిపోతున్నా రు. ‘ప్రదర్శనలో వైవిధ్యం మమ్మల్ని ఆకట్టుకుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. గృహోపకరణాలు, దుస్తులు, నగలు, ఇంకా అనేక రకాల వినియోగ వస్తువులు అందుబాటులో ఉన్నాయ’ని మోనా అనే సందర్శకురాలు తెలిపింది. థాయ్‌లాండ్ స్టాల్ ముందు చేతి సంచులు కొనడానికి సందర్శకులు బారులు తీరా రు. అప్ఘానిస్తాన్ తివాచీలు ఆకర్షణీయంగా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు కూడా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులు ఈ ప్రదర్శకు భద్రత కల్పిస్తున్నారు.