Illeagal relation
-
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే..
సాక్షి, ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని గడ్‌చాంద గ్రామంలో గురువారం రాత్రి ఒకరిపై కత్తితో దాడిచేయగా గాయాలయ్యాయి. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం... గడ్‌చాంద గ్రామానికి చెందిన గొల్ల సంజీవ్ బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. సంజీవ్ భార్యకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. మూడేళ్లుగా గల్ఫ్ నుంచి పంపించిన డబ్బుల విషయమై భార్యను ప్రశ్నించగా ఆమె నుంచి సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కాగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మరింతగా అనుమానం పెంచుకున్నాడు. తాను లేని సమయంలో తన భార్యకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులన్నీ వాడుకున్నాడని శ్రీనివాస్‌పై అనుమానం పెంచుకుని గురువారం రాత్రి తెల్లకల్లు దుకాణంలో ఉండగా కత్తితో దాడిచేశాడు. గాయాలపాలైన శ్రీనివాస్‌ను లోకేశ్వరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం శ్రీనివాస్ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్ పంపినట్లు ఎస్సై పేర్కొన్నాడు. -
వద్దురా అంటే వినలేదు.. భార్య లవర్ చెవులు, ముక్కు కోసేసిన భర్త
లాహోర్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. ఆమె ప్రియుడికి కూడా చెప్పాడు. అయినా ఇద్దరూ మారలేదు. దీంతో తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై ఆ భర్త కోపం పెంచుకున్నాడు. అతడిపై దాడి చేసి చెవు, ముక్కు కోసి వేశాడు. ప్రస్తుతం ఆ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన పక్కదేశం పాకిస్తాన్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని ముజఫరానగర్‌కు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే ఇతడి భార్యకు మహ్మద్ అక్రమ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యతో దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినా వారిద్దరూ మాట వినలేదు. సంబంధం కొనసాగిస్తుండడంతో ఖయ్యూమ్ కత్తి తీసుకుని అక్రమ్ వెంట పడ్డాడు. కత్తితో అక్రమ్ ముక్కు, చెవులు, కోసేశాడు. తీవ్ర గాయాలపాలైన అక్రమ్ వెంటనే ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించిన వైద్యులు ఏం జరిగిందని వివరాలు ఆరా తీయగా పై విషయం వెలుగులోకి వచ్చింది. -
భార్యను చంపి..ఆమె ప్రేమికుడి ఇంట్లో పడేసాడు!
ముజఫర్‌నగర్ : భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న నెపంతో ఆమెను గొంతు నులుమి చంపాడో భర్త. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని శామ్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శామ్లి జిల్లాలోని ఖేరా కుర్తాన గ్రామానికి చెందిన ఓ మహిళ... వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించి.. భర్త ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని...ఆమె ప్రేమికుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంట్లో పడేశాడు. కాగా ఈ హత్యకు మహిళ సోదరుడు కూడా సహకరించడం గమనార్హం. పోలీసులు... మృతురాలి భర్తను, సోదరుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.