ప్రతీకాత్మక చిత్రం
ముజఫర్‌నగర్ : భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న నెపంతో ఆమెను గొంతు నులుమి చంపాడో భర్త. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని శామ్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శామ్లి జిల్లాలోని ఖేరా కుర్తాన గ్రామానికి చెందిన ఓ మహిళ... వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించి.. భర్త ఆమెను గొంతు నులిమి చంపేశాడు.
అనంతరం భార్య మృతదేహాన్ని...ఆమె ప్రేమికుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంట్లో పడేశాడు. కాగా ఈ హత్యకు మహిళ సోదరుడు కూడా సహకరించడం గమనార్హం. పోలీసులు... మృతురాలి భర్తను, సోదరుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment