muzaffanagar
-
దారుణం: 34 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా..
పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 34 మంది పాఠశాల విద్యార్థులతో భాగ్మతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు. మరో పద్నాలుగు మంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బెనియాబాద్ ప్రాంతంలోని పట్టి ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. BIG ACCIDENT IN MUZAFFARPUR BIHAR The boat carrying children going to school capsized in Muzaffarpur.. About 34 children were on board the boat. Many children were reported missing. Police reached the spot and NDRF is being called.#Bihar #India #Muzaffarpur #Boatcapsized… pic.twitter.com/U4E2rsrPJ8 — mishikasingh (@mishika_singh) September 14, 2023 ఈ ప్రమాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకుని విలపిస్తున్నారు. అటు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదీ చదవండి: Kerala Nipah Virus Cases: కేరళలో ఐదుకి చేరిన నిఫా కేసులు.. బాధితులతో 706 మంది డైరెక్ట్ కాంటాక్ట్ -
బీజేపీని ఓడిద్దాం
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతల్ని అరాచక శక్తులుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ గడ్డ వారిని సహించలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆదివారం యూపీలోని ముజఫర్‌నగర్‌లో గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన మహా పంచాయత్‌కు వేలాది మంది రైతులు తరలివచ్చారు. ‘దేశాన్ని కాపాడుకుందాం’ అన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా సదస్సుకి ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 300 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. బస్సులు, కారులు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో వేలాది మంది రైతులు రావడంతో నగర వీధులు, ఫ్లై ఓవర్లు కిక్కిరిసిపోయాయి. భారీ సంఖ్యలో మహిళా రైతులు కూడా వచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ఓట్లు కూడా రాలవని తికాయత్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే తమ నినాదమని స్పష్టం చేశారు. ఇండియా ఫర్ సేల్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని అదే ప్రభుత్వ విధానమని మహాపంచాయత్ వేదికగా రాకేశ్ తికాయత్ ఆరోపించారు. రైల్వేలు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, విద్యుత్, రోడ్లు, బ్యాంకులు ఇలా అన్నింటిని అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. సేల్ ఆఫ్ ఇండియా బోర్డులు ఎక్కడికక్కడ పెట్టారని అంబానీ, అదానీలే వాటిని కొనుగోలు చేస్తారని ఆరోపించారు. ‘‘మనం ఈ దేశాన్ని అమ్మకుండా అడ్డుకోవాలి. రైతులు, ఉద్యోగులు, యువత, వ్యాపారాలు ఇలా అన్నింటిని కాపాడు కోవాలి. అందుకే మహాపంచాయత్ ర్యాలీలు చేస్తున్నాం’’ అని తికాయత్ చెప్పారు. ‘‘9 నెలలుగా మేం ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం చర్చించడానికి ముందుకు రావడం లేదు. ఉద్యమం సమయంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం మౌనం పాటించలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదు’’ అని తికాయత్ చెప్పారు. ప్రధానే లక్ష్యం: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రచారం చేస్తామని కిసాన్ మహాపంచాయత్ ప్రకటించింది. నేరుగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. వారణాసి వేదికగా ముజఫర్‌నగర్‌లో జరిగిన మెగా సదస్సుని మిషన్ ఉత్తరప్రదేశ్–ఉత్తరాఖండ్గా రైతు సదస్సు అభివర్ణించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మహాపంచాయత్‌లు నిర్వహిస్తామన్న రాకేశ్ తికాయత్ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి రెండో ప్రధాని కార్యాలయం వంటిదని తదుపరి సదస్సు అక్కడే జరుపుతామన్నారు. లక్నోలో సదస్సు నిర్వహించి రైతుల సత్తా చాటుతామన్నారు. -
ప్రజల దాడి.. ప్రాణభయంతో బీజేపీ ఎమ్మెల్యే పరుగులు
లక్నో: బీజేపీ ఎమ్మెల్యేపై పలువురు దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేను ఘెరావ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రాణభయంతో పోలీసుల భద్రతా నడుమ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. బుదాన నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్ ముజఫర్‌నగర్‌లోని సిసౌలీలో శనివారం పర్యటించారు. జన కల్యాణ్ సమితి కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన ఎమ్మెల్యేను అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న కొందరు అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా నల్ల సిరాను ఎమ్మెల్యేపై విసిరారు. ఈ దాడిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు చేతులు ఎత్తేశారు. అయితే ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది రైతులుగా బీజేపీ పేర్కొంది. సిసౌలి భారతీయ కిసాన్ సంఘం కీలక నాయకుడు రాకేశ్ టికాయత్ గ్రామం. ఆ గ్రామం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి కేంద్రంగా మారింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్ పర్యటించడం ఈ దాడికి కారణంగా మారింది. అయితే బీజేపీ నాయకులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని.. తమపై వారే దాడులు చేశారని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇరు పక్షాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. #WATCH Protestors attack vehicle of BJP MLA from Budhana, Umesh Malik's car in Muzaffarnagar's Sisauli, where he had gone to attend an event of the Jan Kalyan Samiti pic.twitter.com/D8urIragoM — ANI UP (@ANINewsUP) August 14, 2021 -
దరిద్రం అంటే ఇదే: తన చావును తానే రికార్డు చేశాడు
లక్నో: అంతసేపు వారంతా ఒకే దగ్గర కూర్చుని సరదాగా కబర్లు చెప్పుకుంటూ.. మద్యం సేవిస్తూ.. ఎంజాయ్ చేశారు. ఇంతలో వారిలో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీ పని చేస్తుందో లేదో ట్రై చేద్దామని భావించాడు. గన్ బయటకు తీసి, బుల్లెట్లు లోడ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపాడు. దురదృష్టం కొద్ది ఆ తూటా కాస్త స్నేహితుడి శరీరంలోకి దూసుకెళ్లింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బుల్లెట్ తగిలిన వ్యక్తి అప్పటి వరకు తన స్నేహితుడు చేసే పనులను రికార్డ్ చేస్తున్నాడు. కానీ అనుకోకుండా అతడికి తూటా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో ఫోన్ కిందపడిపోయింది. అతడు బాధతో విలవిల్లాడటం కూడా దానిలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రెండు రోజుల కిత్రం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన నిందితుడు, రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి ఊరి బయట కూర్చుని మద్యం తాగుతూ.. పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో నిందితుడు తన దగ్గర తుపాకీ ఉందని వారితో చెప్పాడు. అది పని చేస్తుందో లేదో చూద్దామని భావించాడు. ఈ క్రమంలో బాధితుడు గన్ పేల్చే దృశ్యాలను తాను వీడియో తీస్తానని చెప్పాడు. ఆ తర్వత నిందుతుడు తన దగ్గర ఉన్న తుపాకీ బయటకు తీసి.. దానిలో బుల్లెట్లు లోడ్ చేశాడు. ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే దురదృష్టం కొద్ది ఆ తూటా కాస్త ఈ తతంగాన్ని రికార్డ్ చేస్తోన్న బాధితుడి శరీరంలోకి దూసుకెళ్లింది. దాంతో అతడు బాధతో విలవిల్లాడుతూ చేతిలోని మొబైల్‌ని కింద పడేశాడు. బాధితుడు బాధతో అరవడం వీడియోలో వినిపిస్తుంది. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయిన నిందితుడు.. ఇతర స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. బుల్లెట్ తగిలిన వ్యక్తి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సరదాగా తుపాకీ పని చేస్తుందా లేదా చెక్ చేద్దామని భావించి.. దానిని పేల్చానని.. కానీ దురదృష్టవశాత్తు ఆ తూటా తన స్నేహితుడికి తగిలిందని.. తాను కావాలని ఇలా చేయలేదని వెల్లడించాడు. పోలీసలు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: సైకో ఫ్రెండ్.. ఇద్దరిని కాల్చిపడేసిన పీజీ విద్యార్థి గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. 22 మంది ప్రాణాలు తీసింది.. ! -
భార్యను చంపి..ఆమె ప్రేమికుడి ఇంట్లో పడేసాడు!
ముజఫర్‌నగర్ : భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న నెపంతో ఆమెను గొంతు నులుమి చంపాడో భర్త. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని శామ్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శామ్లి జిల్లాలోని ఖేరా కుర్తాన గ్రామానికి చెందిన ఓ మహిళ... వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించి.. భర్త ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని...ఆమె ప్రేమికుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంట్లో పడేశాడు. కాగా ఈ హత్యకు మహిళ సోదరుడు కూడా సహకరించడం గమనార్హం. పోలీసులు... మృతురాలి భర్తను, సోదరుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. -
భార్య తనతో జీవించలేనని చెప్పడంతో..
ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రానందని ఓ వ్యక్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య లేని జీవితం తనకు వద్దని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా అత్తగారింట్లో ఉంటున్న భార్య ఇటీవలె ఆయనతో జీవించలేనని, కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. అతడు ఎంత బ్రతిమాలుకున్నా రానంటూ నలుగురిలో అవమానించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇంతేజార్ అనే వ్యక్తి విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముజఫర్‌నగర్‌లోని దాదేరూ అనే గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. -
ముజఫర్ నగర్ బాధితులకు మన్మోహన్, సోనియా ఓదార్పు
అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. అల్లర్ల బాధితులు తలదాచుకుంటున్న బాసి కలాన్ సహాయక శిబిరాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు.సహాయక శిబిరంలో వారికి అందుతున్న సహయ చర్యల గురించి వాకబు చేశారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైతే కేంద్ర సహాయం చేస్తుందని.. ప్రధాని మన్మోహన్సింగ్ వారికి హామీ ఇచ్చారు. ప్రశాంత వాతావరణం నెలకొనటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలు సహకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన బాధితులు ప్రధానికి తమ వినతి పత్రాలను అందజేశారు. తమపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.