ముజఫర్ నగర్ కాల్పులు జరగడానికి ముందు ఫోటో
లక్నో: అంతసేపు వారంతా ఒకే దగ్గర కూర్చుని సరదాగా కబర్లు చెప్పుకుంటూ.. మద్యం సేవిస్తూ.. ఎంజాయ్ చేశారు. ఇంతలో వారిలో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీ పని చేస్తుందో లేదో ట్రై చేద్దామని భావించాడు. గన్ బయటకు తీసి, బుల్లెట్లు లోడ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపాడు. దురదృష్టం కొద్ది ఆ తూటా కాస్త స్నేహితుడి శరీరంలోకి దూసుకెళ్లింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బుల్లెట్ తగిలిన వ్యక్తి అప్పటి వరకు తన స్నేహితుడు చేసే పనులను రికార్డ్ చేస్తున్నాడు.
కానీ అనుకోకుండా అతడికి తూటా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో ఫోన్ కిందపడిపోయింది. అతడు బాధతో విలవిల్లాడటం కూడా దానిలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రెండు రోజుల కిత్రం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన నిందితుడు, రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి ఊరి బయట కూర్చుని మద్యం తాగుతూ.. పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో నిందితుడు తన దగ్గర తుపాకీ ఉందని వారితో చెప్పాడు. అది పని చేస్తుందో లేదో చూద్దామని భావించాడు. ఈ క్రమంలో బాధితుడు గన్ పేల్చే దృశ్యాలను తాను వీడియో తీస్తానని చెప్పాడు. ఆ తర్వత నిందుతుడు తన దగ్గర ఉన్న తుపాకీ బయటకు తీసి.. దానిలో బుల్లెట్లు లోడ్ చేశాడు. ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే దురదృష్టం కొద్ది ఆ తూటా కాస్త ఈ తతంగాన్ని రికార్డ్ చేస్తోన్న బాధితుడి శరీరంలోకి దూసుకెళ్లింది. దాంతో అతడు బాధతో విలవిల్లాడుతూ చేతిలోని మొబైల్‌ని కింద పడేశాడు. బాధితుడు బాధతో అరవడం వీడియోలో వినిపిస్తుంది.
అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయిన నిందితుడు.. ఇతర స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. బుల్లెట్ తగిలిన వ్యక్తి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సరదాగా తుపాకీ పని చేస్తుందా లేదా చెక్ చేద్దామని భావించి.. దానిని పేల్చానని.. కానీ దురదృష్టవశాత్తు ఆ తూటా తన స్నేహితుడికి తగిలిందని.. తాను కావాలని ఇలా చేయలేదని వెల్లడించాడు. పోలీసలు అతడిని అరెస్ట్ చేశారు.
చదవండి:
సైకో ఫ్రెండ్.. ఇద్దరిని కాల్చిపడేసిన పీజీ విద్యార్థి
గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. 22 మంది ప్రాణాలు తీసింది.. !
Comments
Please login to add a commentAdd a comment