Illusions
-
కేసీఆర్‌పై భ్రమలు తొలిగిపోయాయి
♦ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ♦ కుంభకోణాలు, కమీషన్లతో కాలయాపన ♦ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం ♦ సర్కారుపై ధ్వజమెత్తిన టీడీపీ జిల్లా ఇన్చార్జి అరవింద్‌కుమార్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పూటకో మాటతో ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ సర్కారు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటుందని టీడీపీ జిల్లా ఇన్చార్జి అరవింద్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కాలం గడుపుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కాలంలోనే రూ.70 వేల కోట్ల అప్పులు చేసి.. మిగులు రాష్ట్రాన్ని కాస్తా లోటులోకి తీసుకెళ్లిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరిట కమీషన్ల దండుకుంటున్న టీఆర్ఎస్ మంత్రులు.. ఎంసెట్ పేపర్ లీకేజీ నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన కేసీఆర్.. కార్పొరేట్ కాలేజీల కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, త్వరలోనే ఆ పార్టీ పతనం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఉందని, గ్రామ, వార్డు కమిటీలను బలోపేతం చేయడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తెస్తామన్నారు. సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, నాయకులు సామ భూపాల్‌రెడ్డి, గణేశ్‌గుప్తా, సూర్యప్రకాశ్, రొక్కం భీంరెడ్డి, బుక్కా గోపాల్, చంద్రయ్య, శేరి పెంటారెడ్డి, ఉదయ్‌మోహన్‌రెడ్డి, మోహన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 5న కలెక్టరేట్ ఎదుట ధర్నా.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈనెల 5న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌యాదవ్ తెలిపారు. భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, రుణమాఫీని పూర్తిగా వర్తింపజేయాలని, ఎంసెట్ లీకేజీ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడతామని చెప్పారు. కాగా, ఈనెల 2,3వ తేదీల్లో నియోజకవర్గాల్లో పార్టీ విస్తత స్థాయి కార్యకర్తల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. 2న రాజేంద్రనగర్, ఉప్పల్, 3న తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మల్కాజ్గిరి, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల సమావేశాలుంటాయని వివరించారు. -
భ్రమలు తొలగిపోయాయ్..!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్పై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెదక్ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లకా్ష్మరెడ్డి అధ్యక్షత వహించగా ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జె.గీతారెడ్డి, డి.కె.అరుణ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ సీఎం కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. పూటకో కొత్తమాటతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ బీజేపీపై, ప్రధానమంత్రి మోదీపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. ‘సభ్యత్వం’పై సమీక్ష రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీరుతెన్నులను ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లాల వారీగా సమీక్షించారు. నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఎంత సభ్యత్వం జరిగింది, బలహీనంగా ఉన్నచోట తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. త్వరలో ఉప ఎన్నికలు జరిగే వరంగల్ లోక్‌సభతోపాటు, వరంగల్ నగరపాలక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కుంతియా ఆదేశించారు. జిల్లాల వారీగా సభ్యత్వ కార్యక్రమానికి వస్తున్న స్పందనను డీసీసీ అధ్యక్షులను కుంతియా అడిగి తెలుసుకున్నారు. రాహుల్ ప్రసంగాల సీడీ విడుదల ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్లమెంటులో, రైతు సభలలో చేసిన ప్రసంగాలతో మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ రూపొందించిన సీడీని గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. ‘లీడర్స్‌టాక్’ పేరుతో రూపొందిం చిన ఈ సీడీని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఉత్తమ్, భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. రాహుల్‌గాంధీ ప్రసంగించిన వీడియో క్లిప్పింగులతో ఈ సీడీని రూపొందించారు. నోటి దురుసుతోనే ఓడిపోయా: జగ్గారెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్పై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెదక్ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లకా్ష్మరెడ్డి అధ్యక్షత వహించగా ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జె.గీతారెడ్డి, డి.కె.అరుణ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ సీఎం కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. పూటకో కొత్తమాటతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ బీజేపీపై, ప్రధానమంత్రి మోదీపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. ‘సభ్యత్వం’పై సమీక్ష రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీరుతెన్నులను ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లాల వారీగా సమీక్షించారు. నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఎంత సభ్యత్వం జరిగింది, బలహీనంగా ఉన్నచోట తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. త్వరలో ఉప ఎన్నికలు జరిగే వరంగల్ లోక్‌సభతోపాటు, వరంగల్ నగరపాలక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కుంతియా ఆదేశించారు. జిల్లాల వారీగా సభ్యత్వ కార్యక్రమానికి వస్తున్న స్పందనను డీసీసీ అధ్యక్షులను కుంతియా అడిగి తెలుసుకున్నారు. రాహుల్ ప్రసంగాల సీడీ విడుదల ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్లమెంటులో, రైతు సభలలో చేసిన ప్రసంగాలతో మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ రూపొందించిన సీడీని గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. ‘లీడర్స్‌టాక్’ పేరుతో రూపొందిం చిన ఈ సీడీని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఉత్తమ్, భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. రాహుల్‌గాంధీ ప్రసంగించిన వీడియో క్లిప్పింగులతో ఈ సీడీని రూపొందించారు. -
రూపాయిచ్చింటే ఒట్టు!
పెండ్లమర్రి మండలం చిన్నదాసరిపల్లెకు చెందిన రైతు బత్తిన పెద్ద నాగమల్లారెడ్డి 4.33 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. భూములు కౌలుకు తీసుకుని పంట సాగు చేసుకునే వారికి సమగ్ర కౌలు రుణ అర్హత పత్రాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు తనకు అర్హత ఉందని దరఖాస్తు చేసుకున్నాడు. రెవిన్యూ అధికారులు కౌలు రుణ అర్హత పత్రాన్ని ఇచ్చారు. దానిని తీసుకుని పెండ్లిమర్రి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు వద్దకు వెళ్లి రుణం కావాలని అడిగాడు. రేపురా.. మాపురా.. అంటూ కాళ్లరిగేలా తిప్పారు. విసుగు చెందిన ఆ రైతు బ్యాంకు రుణంపై ఆశలు వదిలేశాడు. అధిక వడ్డీకి గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నాడు. - కౌలు రైతుల గోల పట్టని ప్రభుత్వం - రుణ అర్హత కార్డులు ఉత్తుత్తే - ఈ ఏడాది 4,983 మందిని అర్హులుగా తేల్చి ఒక్కరికీ రుణమివ్వని వైనం - రుణాల కోసం కాళ్లరిగేలా తిరిగి బేజారెత్తిన అన్నదాత కడప అగ్రికల్చర్ : రుణ అర్హత కార్డులపై కౌలు రైతులకు భ్రమలు తొలగిపోతున్నాయి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసినా వాస్తవంగా అవి ఎందుకూ పనికి రావని తేలిపోయింది. ఈ కారణంగా రుణ అర్హత కార్డులను తీసుకునేందుకు కౌలు రైతులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. 2015-16 సంవత్సరానికి కార్డులు జారీ చేసేందుకు ఈ ఏడాది మే నెలలో 945 రెవిన్యూ గ్రామాలలో సభలు నిర్వహించి 5,425 మంది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 437 మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన 4,983 మందికి రుణాలను అందిస్తామని చెప్పారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడచినా ఇప్పటి వరకు ఒక్క కౌలు రైతుకు ఒక్క రూపాయి అందించ లేదు. బ్యాంకర్లు పెడుతున్న తిప్పలకు రైతులు బేజారై రుణాలడగడమే మానేశారు. దీనిపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2011-12లో ప్రభుత్వం తొలి సారిగా కౌలు రైతులను ఆదుకునేందుకు కౌలు రుణ అర్హత చట్టాన్ని తీసుకువచ్చి, కార్డుల జారీ ప్రక్రియను చేపట్టింది. ఇవి ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేటట్లు చర్యలు తీసుకున్నారు. ఈ కార్డులతో సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ పొందవచ్చని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ప్రధానంగా బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందే వీలుంటుందని ప్రకటించింది. అయితే ఈ కార్డులను బ్యాంకర్లు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. గత ఏడాది 9,376 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వగా అతి కష్టమీద 11 మందికి రూ.1.65 లక్షలు మాత్రమే అందించారు. రుణ అర్హత కార్డులు పొందిన ఆయా రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందనేలేదు. ఇన్పుట్ సబ్సిడీ జాడ కరువైంది. యజమానులే సంబంధిత భూములపై అన్ని ప్రయోజనాలు పొందారు. ఇక మీకొచ్చేది ఏమి లేదంటూ బ్యాంకర్లు, అధికారులు తేల్చి చెప్పారు. చివరికి ఈ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కౌలు రైతులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో 2015-16లో కార్డుల కోసం రైతుల్లో ఆసక్తి సన్నగిల్లింది. కడప డివిజన్లో 978 మంది కౌలు రైతులు దరఖాస్తు చేసుకోగా, 809 మంది అర్హత పొందారు. రాజంపేట డివిజన్లో 1450 మంది దరఖాస్తు చేసుకోగా 1402 మంది అర్హత పొందారు. జమ్మలమడుగు డివిజన్లో 2772 మంది దరఖాస్తు చేసుకోగా 2772 మంది అర్హత సాధించారు. ప్రభుత్వం పట్టించుకోక, బ్యాంకర్లు లెక్కచేయక, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాలా మంది కౌలు రైతులు రుణ అర్హత కార్డులపై ఆశలు వదలుకున్నారు. ఈ ఖరీఫ్‌లో రుణాలు అనుమానమే.. పంట రుణాలు అందరి రైతులతో పాటు కౌలు రైతులు పొందకపోతే వారు కార్డులు పొందినా ఏలాంటి ప్రయోజనం ఉండదు. అందునా ఆగస్టు నెలాఖరు వరకే పంట రుణాలు ఇచ్చేదని, అటు తరువాత రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నట్లు కౌలు రైతులు అంటున్నారు. ఈ తరుణంలో రుణ అర్హత కార్డులు పొందినా బ్యాంకర్లు మొండి చేయి చూపడంతో రుణాలు పొందలేమని నిట్టూరుస్తున్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేమని బ్యాంక ర్లు చేతులెత్తేయడంతో ఆయా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీనిపై అటు రెవిన్యూ అధికారులు, ఇటు బ్యాంకర్లు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.