Imported alcohol
-
అక్కడ ఇక స్కాచ్ దొరకదా? కేంద్రం కీలక ఆదేశాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి చేసుకున్న వస్తువులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనడం మానేయాలని దేశంలోని 4000 ఆర్మీ క్యాంటీన్లకు ఆదేశాలిచ్చినట్టు తాజా నివేదికల సమాచారం. అంతేకాదు ఆర్మీ క్యాంటిన్లలో ఇకమీదట విదేశీ మద్యం అమ్మకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అక్టోబర్ 19న అంతర్గత ఉత్తర్వులు జారీ అయినట్టు తెలుస్తోంది. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనం ప్రకారం, ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్, యూకే కంపెనీ డియాజియోకు చెందిన స్కాచ్ లాంటి విదేశీ మద్యం అమ్మకాలను నిలిపివేయనుంది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే విదేశీ బ్రాండ్ల కోసం ఆర్డర్లను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మే, జూలై నెలల్లో ఈ అంశంపై సైన్యం, వైమానిక, నావికాదళంతో చర్చల అనంతరం, దేశ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఏ ఉత్పత్తులను నిలిపివేయాలో ఆర్డర్ నిర్దిష్టంగా పేర్కొనలేదనీ అయితే, విదేశీ మద్యం కూడా జాబితాలో ఉండవచ్చని విశ్వసిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి డియోజియో, పెర్నోడ్ ప్రతినిధులు తిరస్కరించారు. దీనికి సంబంధించి క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు డిఫెన్స్ స్టోర్లలో దిగుమతి చేసుకున్న మద్యం అమ్మకాలు వార్షిక అమ్మకాలలో కేవలం 17 మిలియన్ డాలర్లు మాత్రమేనని, ఈ బ్రాండ్లపై బ్యాన్ విధించినా కూడా కలిగే నష్టం ఏమీ లేదని, స్టాక్ చాలా తక్కువగానే ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనుకునే ప్రభుత్వం ఆలోచనకు తాజా ఆర్డర్ ప్రతికూల సంకేతాన్ని పంపుతుందన్నారు. కాగా దేశవ్యాప్తంగా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ దాదాపు 5,000 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిద్వారా మద్యం సహా ఎలక్ట్రానిక్స్, ఇతర నిత్యావసర వస్తువులను సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు రాయితీ ధరలకు విక్రయిస్తుంది. 2 బిలియన్ డాలర్లకు పైగా వార్షిక అమ్మకాలతో, భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చెయిన్స్ లో ఒకటిగా క్యాంటీన్ స్టోర్స్ ఉన్నాయి. -
ఇక్కడా బ్రాండ్ మిక్సింగ్?
విజయనగరం: తూర్పు గోదావరికి చెందిన మధ్యవర్తి ద్వారా అనంతపురానికి చెందిన బడా వ్యాపారి జిల్లాకు గోవా మద్యం దిగుమతి చేసిన వ్యవహారం ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది. గోవా మద్యం బయట కనబడకుండా బావిలో దాచిన భాగోతం జామి, కొత్తవలస మండలాల్లోని పలుచోట్ల బయటపడింది. అప్పట్లో ఈ ఘటనకు సంబంధించి ఐదుగుర్ని అరెస్టు చేశారు. కేసును లోతుగా విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారు. దీంతో గోవా మద్యం దిగుమతికి కాసింత అడ్డుకట్ట పడింది. కొన్ని నెలలుగా ఒడిశా మద్యం జిల్లాకు దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వమిస్తున్న మార్జిన్ ఎటూ చాలలేదన్న ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ఒడిశా మద్యాన్ని గుట్టుగా జిల్లాకు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఒడిశాలో తక్కువకే మద్యం మన రేటు కన్న ఒడిశాలో 20శాతం తక్కువకు వస్తుండటంతో అక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు. రాయఘడ, గుణుపూర్, సుంకి మీదుగా తీసుకొచ్చే సరకును పార్వతీపురానికి చెందిన కొందరు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శివారు కాలనీల్లో నిల్వ చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడి నుంచే అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు లారీల ద్వారా తరలిస్తున్నట్టు సమాచారం. అక్కడినుంచి వచ్చే మద్యాన్ని మన ప్రాంతానికి చెందిన మద్యంతో కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా వెళ్లాల్సిన ఆదాయానికి గండి పడుతున్నది. మిక్సింగ్‌పై ఫిర్యాదులున్నాయి ఇదే విషయమై ఎక్సైజ్ శాఖ విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ ఎ.శంభుప్రసాద్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా బ్రాండ్ మిక్సింగ్ జరుగుతున్నట్టు తమకు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కాకపోతే, తాము నిర్వహించిన దాడుల్లో ఎక్కడా దొరకలేదన్నారు. శుక్రవారం కూడా 207మద్యం దుకాణాలు, 28బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేశామన్నారు. కానీ ఎక్కడా బయటపడలేదన్నారు. ప్రస్తుతం బ్రాండ్ మిక్సింగ్ ఒకవైపు ఒడిశా మద్యాన్ని వాడుతున్నారు. మరోవైపు ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపడుతున్నారు. ఇది చాలదన్నట్టు కొందరు బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రీమియర్ బ్రాండ్ మద్యంలో రూ. 40 చీప్ లిక్కర్ కల్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం, పార్వతీపురంలో గల పలు బార్ అండ్ రెస్టారెంట్లలోనూ, గ్రామీణ ప్రాంతంలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్ట్‌షాపుల్లో ఈ కల్తీ బాగోతం కొనసాగుతోంది. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలు తీసేసి, చీప్ లిక్కర్‌ను కలిపిన తర్వాత అనుమానం రాకుండా మళ్లీ కొత్త మూతలు అమర్చుతున్నట్టు తెలిసింది. ఆ మూతలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది అంతుచిక్కడంలేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరిద్దరు కింద స్థాయి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినా వాటి జోలికెళ్లొద్దని హెచ్చరించినట్టు తెలుస్తోంది. -
మహా కిక్కు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఎన్నికల వేళ మద్యం విక్రయాలపై అధికారులు నియంత్రణ విధించడంతో అక్రమార్కులు మహారాష్ట్ర నుంచి మద్యం దిగుమతి చేసుకుంటున్నారు. సరిహద్దు గ్రామాల్లో దాచి రాత్రి వేళ బెల్టుషాపులకు తరలిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చినా బెల్టు దుకాణాల్లో మాత్రం దేశీదారు ఏరులై పారుతోంది. అధికారులు ఎంత కట్టడి చేసినా అక్రమ మద్యం రవాణా ఆగడం లేదని ఇప్పటివరకు పట్టుబడ్డ మద్యాన్ని బట్టి తేటతెల్లమవుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై 496 కేసులు నమోదు చేయగా రూ.24.54లక్షల మద్యం పట్టుబడింది. ఇందులో అధికంగా మహారాష్ట్ర నుంచి మద్యం తరలిస్తున్న కేసులే ఉండడం గమనార్హం. దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు గతేడాది ఇదే నెలలో మద్యం అమ్మకాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ మొత్తంలోనే దుకాణాలకు మద్యం పంపిణీ చేసింది. ఎన్నికల వేళ కావడంతో మద్యం కొరత తీవ్రంగా ఏర్పడింది. మద్యం దుకాణాదారులు వచ్చిన స్టాకును బెల్టు దుకాణాలకు తరలించి దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ఉన్న కొద్ది మద్యాన్ని అమ్ముతుండగా ఈ మద్యం కోసం మందుబాబులు ఉదయాన్నే బారులు తీరుతున్నారు. దొరికిన మద్యాన్ని కూడా మద్యం వ్యాపారులు అధిక ధ రలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మహారా ష్ట్ర నుంచి మద్యం అక్రమంగా దిగుమతి చేస్తూ గ్రామా ల్లో నిల్వ చేస్తున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముం దు జిల్లా అంతట డంప్ చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. మన జిల్లాలోని సరిహద్దు గ్రామాలకు లింక్‌రోడ్ల ద్వారా మహారాష్ట్ర నుంచి మద్యం దిగుమతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం లెసైన్సుల గడువు చివరికి రావడం, ఇప్పటికే టార్గెట్ పూర్తి చేసుకున్న మద్యం వ్యాపారులు అక్రమాలకు తెర లేపుతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ దందా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొందరు మద్యం వ్యా పారులు కొత్త దందాకు తెరలేపారు. స్టాక్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. తెరవెనుక బ్లాక్ దందాను గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకొ ని వ్యాపారులు అసలు ధరకన్నా అధిక మొత్తానికి మ ద్యం బాటిళ్లను బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే కొందరు మద్యం వ్యాపారులు మద్యం లేదంటూ దుకాణాలు మూసివేస్తున్నారు. మరో వైపు రా జకీయ నాయకుల ప్రచార కార్యక్రమాల్లో తిరిగే వారు మాత్రం పుష్కలంగా మందుతో విందు చేసుకుంటున్నా రు. ఇదేలా సాధ్యమంటే.. వచ్చిన మద్యం స్టాక్ రాజకీ య నాయకుల రహస్య ప్రదేశాలకు తరులుతోంది. దీం తో దుకాణాల ఎదు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నా యి. మరోవైపు దుకాణదారులు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. మద్యం కావాలని ఎవరైన వస్తే మద్యం లేదని చె బుతున్నారు. ధర ఎంతైన చెల్లిస్తాం.. కచ్చితంగా మ ద్యం కావాలంటే మాత్రం ఎంఆర్పీ ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నాయకుల నుంచి ముందస్తు అర్డర్లను తీసుకుంటూ మద్యాన్ని వాహనాల్లో చేరవేస్తున్నట్లు సమాచారం. ఎంఆర్పీ ధరకంటే 30 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్షల్లో అక్రమ దందా సాగుతోంది. ఆ రెండు రోజుల కోసం భారీగా నిల్వలు ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల పోలింగ్ రోజుకంటే 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఈనెల 30న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం దిగుమతికి వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి రెండు రోజులు ఓటర్లకు పెద్ద మొత్తంలో మద్యం పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ రెండు రోజుల కోసమే భారీగా మద్యం నిల్వలు ఉంచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం మొత్తం మద్యం పంపిణీ ఒక ఎత్తై పోలింగ్‌కు ముందు రెండు రోజుల మద్యం పంపిణీ మరో ఎత్తు. చాలా మంది అభ్యర్థులు ప్రచారం కంటే ఎన్నికల ముందు రోజే ఎక్కువగా మద్యం పంపిణీ చేస్తుంటారు. గ్రామాల్లో రాత్రికి రాత్రే ఇంటికొక మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తుంటారు. ఉదయం వరకే స్టాక్‌ను సరఫరా చేసేస్తారు. ఎన్నికల్లో ఈ ప్రభావం చాలా మట్టుకు కనిపిస్తోంది. ఏదేమైన మద్యం ఏరులై పారించడమే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహరచన చేస్తుండడంతో అధికారులు దాన్ని ఏమాత్రం అడ్డుకుంటారనేది చూడాల్సిందే.