India economic recovery
-
అంతర్జాతీయ సవాళ్లతో భారత్‌కు భయం అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరిస్థితుల వంటి అంశాలు భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు విఘాతం కలిగించకపోవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో పేర్కొంది. దేశ రేటింగ్ విషయంలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం ఎకానమీ పురోగమిస్తే, 2022–23లో ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. రానున్న 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.3 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. భారత్‌కు మూడీస్ ప్రస్తుతం దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీఏఏ3’ హోదాను ఇస్తోంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ‘చెత్త’ రేటింగ్కన్నా ఇది ఒక మెట్టు ఎక్కువ. గత ఏడాది అక్టోబర్‌లో రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’క మార్చింది. తాజాగా మూడీస్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశం క్రెడిట్ ప్రొఫైల్... పలు స్థాయిల్లో పటిష్టతలను ప్రతిబింబిస్తోంది. పెద్ద, వైవిధ్యభరిత, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, అధిక వృద్ధి సామర్థ్యం, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోగలిగిన పరిస్థితులు, ప్రభుత్వ రుణానికి స్థిర మైన దేశీయ ఫైనాన్సింగ్ బేస్ వంటి కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణలుసహా అంతర్జాతీయంగా ఎకానమీకి ఎదురవుతున్న సవాళ్లు– ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో భారత్ రికవరీకి (కోవిడ్–19 సవాళ్ల నుంచి) విఘాతం కలిగించే అవకాశం లేదని భావిస్తున్నాం. ► ఎకానమీ, ఫైనాన్షియల్ వ్యవస్థల గురించి ప్రస్తుతం కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అవి తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ఈ కారణంగానే ఎకానమీకి ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నాం. ► అధిక క్యాపిటల్ (మూలధన ) నిల్వలు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) పటిష్టత వంటి విభాగాలకు సంబంధించి సవాళ్లు ఉన్నా... ఆ సమస్యలు ఎకానమీకి కలిగించే నష్టాలు అతి స్వల్పం. ఆయా అంశాలు మహమ్మారి నుండి ఎకానమీ రికవరీని సులభతరం చేస్తున్నాయి. ► ద్రవ్యలోటు తక్షణ సమస్య ఉన్నప్పటికీ, రానున్న సంవత్సరాలోఈ సవాళ్లు తగ్గుతాయని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలంలో సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ క్షీణించకుండా ఆయా అంశాలు ఎకానమీకి దోహదపడతాయని భావిస్తున్నాం. రేటింగ్ పెంపుదలే కాదు, తగ్గింపు అవకాశాలూ ఉన్నాయి... భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్ రంగాల్లో సంస్కరణల అమలు పటిష్టంగా జరిగాలి. ఇది ప్రైవేట్ రంగ పెట్టుబడులలో గణనీయమైన, స్థిరమైన పురోగతికి దారితీయాలి. తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధి సామర్థ్యం అంచనాలకు మించి పెరిగాలి. అలాగే ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వ రుణ భారాలను తగ్గించాలి. రుణ చెల్లింపుల సామర్థ్యం మెరుగుదల క్రెడిట్ ప్రొఫైల్‌కు మద్దతు నివ్వాలి. ఈ పరిస్థితుల్లోనే సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇక బలహీన ఆర్థిక పరిస్థితులు తలెత్తినా లేక ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు తీవ్రమయినా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం జరుగుతుంది. మేము అంచనావేసినదానికన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయితే, అది ప్రభుత్వ రుణ భారాలను పెంచుతుంది. ఆ పరిస్థితి దేశ సార్వభౌమ ద్రవ్య పటిష్టతను మరింత దిగజార్చే వీలుంది. ఆయా అంశాలు నెగటివ్ రేటింగ్ చర్యకూ దారితీయవచ్చు. – మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ -
ఎకానమీ రికవరీ వేగవంతం: పీహెచ్‌డీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఇటీవలి నెలల్లో వేగవంతం అయ్యిందని ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ప్రదీప్ ముల్తానీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ భారీగా జరగడం, పండుగల సీజన్, వినియోగ డిమాండ్ మెరుగుపడ్డం, పారిశ్రామిక సెంటిమెంట్ బాగుండడం దీనికి కారణమని తెలిపారు. పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ జీపీఎస్ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 113.1 వద్ద ఉంటే, అక్టోబర్‌లో 131కి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే సూచీ 78.7 నుంచి 114.8కి ఎగసిందని తెలిపారు. వస్తు సేవల పన్ను వసూళ్లు, పాసింజర్ వాహన విక్రయాలు, సెన్సెక్స్ సగటు రోజూవారీ కదలికల ప్రాతిపదికన పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ జీపీఎస్ ఇండెక్స్ కదలికలు ఉంటాయి. ఆయా అంశాలు ఎకానమీ పురోగతికి సానుకూలంగా ఉన్నాయని ప్రదీప్ ముల్తానీ పేర్కొన్నారు. సవాళ్లూ ఉన్నాయ్... అయితే అధిక కమోడిటీ ధరలు, ముడిపదార్థాల సరఫరాల కొరత సమస్యలుగా ఉన్నాయన్నారు. వినియోగం పెరగడానికి, ప్రైవేటు పెట్టుబడులు పురోగమించడానికి ఈ సవాళ్ల పరిష్కారం తక్షణ అవసరమని సూచించారు. గృహ వినియోగం మరింత పటిష్ట పడాల్సి ఉందని వివరించారు. ఆయా అంశాలు పెట్టుబడుల పురోగతికి దోహదపడతాయని ప్రదీప్ ముల్తానీ పేర్కొన్నారు. -
ఎకానమీ పునరుద్ధరణలో కీలకం కావాలి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆర్థికశాఖ బుధవారం పిలుపునిచ్చింది. ‘‘మూలధనం, సమర్థవంతమైన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాల్లో కీలక పాత్ర పోషించాలని నేను ఐబీఏ చైర్మన్‌ను కోరుతున్నాను. ఐబీఏ కేవలం బ్యాంకింగ్ సమస్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు నివేదించే సంఘం మాత్రమే కాదు, వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థను అనుసంధానం చేయడానికి ప్రయత్నించాలి’’ అని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి దేబాషిష్ పాండా పేర్కొన్నారు. ఐబీఐ ఢిల్లీ కార్యాలయం ప్రారంభం అంతకుమందు దేబాషిస్ పాండా ఢిల్లీలో ఐబీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. నిర్వహణ విషయంలో మధ్య శ్రేణి బ్యాంకింగ్ నిపుణులకు శిక్షణను ఇవ్వడానికి, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి కూడా ఐబీఏ తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల బ్యాంకులకు ఈ విషయంలో భారం తగ్గిపోతుందని విశ్లేషించారు. కస్టమర్ సేవలపై దృష్టి: రాజ్‌కిరణ్ రాయ్ ఈ సందర్భంగా ఐబీఐ చైర్మన్ రాజ్‌కిరణ్ రాయ్ మాట్లాడుతూ, ఐబీఏలో పరివర్తన 2018 లో ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం సలహాలు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించకుండా, బ్యాంకింగ్ వ్యాపారం, సేవల పరంగా కార్యకలాపాలలో మరింత నిమగ్నమైందని అన్నారు. కాగా, మహమ్మారి కోవిడ్ సమయంలో కస్టమర్లకు సేవలు అందించే విషయంలో వినూత్న విధానాలు రూపొందించడంపై దృష్టి సారించినట్లు ఐబీఏ సీఈఓ సునిల్ మెహతా ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సమన్వయ పనితీరు కోసం మార్గదర్శకాలను రూపొందించిందని వివరించారు. రుణాల మంజూరు, పంపిణీల్లో ఎటువంటి అవకతవకలకూ చోటులేని విధంగా కార్పొరేట్ రుణ వ్యవస్థసహా పలు సంస్కరణలను తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రూ.6,000 కోట్ల బ్యాంక్ బ్యాంక్ (నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్– ఎన్ఏఆర్సీఎల్) ఏర్పాటుకు లైసెన్స్ జారీ చేయాలని కోరుతూ ఇటీవలే ఆర్బీఐకి ఐబీఏ దరఖాస్తు దాఖలు చేసింది, వ్యవస్థల పట్ల పట్టింపులేకపోవడమే బ్యాంకు మోసాలపై సీవీసీ పరిశీలన రుణాల మంజూరులో, ఇతర కార్యకలాపాల విషయంలో వ్యవస్థలను, విధానాలను పట్టించుకోకపోవడమే బ్యాంకింగ్ రంగంలో పెద్ద ఎత్తున మోసాలకు కారణంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) గుర్తించింది. అవినీతికి చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రతీ దశలోనూ మోసాల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లను సీవీసీ కోరింది. అలాగే, విదేశీ శాఖల్లో చోటుచేసుకున్న పెద్ద మోసాల్లో అంతర్గతంగా ఉన్న అంశాలను విశ్లేషించాలని కూడా సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు సీవీసీ తెలిపింది. విజిలెన్స్ కేసులు, వాటి పురోగతి, నివారణ చర్యలను బ్యాంకుల చీఫ్‌లు సీవీసీకి ఇదే సమావేశంలో వివరించారు. చదవండి : బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక అడుగు -
రికవరీపై చిగురించిన ఆశలు
ముంబై: భారత ఆర్థిక రికవరీపై ఆశలు చిగురించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం పేర్కొంది. రాజకీయంగా స్థిరమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నిర్ణయాత్మకమైన, సహకారాత్మక విధాన నిర్ణయాలు తీసుకుని, వాటిని సమర్థవంతంగా అమలు చేయగలదన్న అంచనాలు రికవరీకి దోహదపడే అంశాలని వివరించింది. మార్కెట్ల పరుగుకూ ఈ పరిణామం దోహదపడే అవకాశం ఉందని అంచనావేసింది. గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్బీఐ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ముఖ్యాంశాలు... ఆర్థిక, విధాన నిర్ణయాల అమలు పెట్టుబడుల ఊపునకు దోహదపడతాయి.వృద్ధికి, ద్రవ్య స్థిరీకరణకు మూలధన పెట్టుబడులు కీలకం. ఆర్థిక వ్యవస్థకు కొన్ని ఇబ్బందులు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నప్పటికీ, కరెంట్ అకౌంట్, ద్రవ్యలోటు అంశాల్లో ప్రతికూలతలూ ఉన్నాయి. గడచిన ఏడు త్రైమాసికాల్లో వృద్ధి-ద్రవ్యోల్బణం వంటి అంశాల్లో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపు కొనసాగుతుండగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలోనే ఉంది. అధిక ద్రవ్యోల్బణం... పొదుపు, పెట్టుబడులు, వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వనరుల కేటాయింపునకు సంబంధించి ఆర్థిక రంగ సామర్థ్యాన్ని సైతం ద్రవ్యోల్బణం దెబ్బతీస్తోంది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సరఫరాల సమస్యలను తగ్గించి, ద్రవ్యోల్బణం ఒత్తిడులను తొలగిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు ఆర్బీఐ కొన్ని పరపతి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రభుత్వ పక్షంగా కొన్ని కీలక చర్యలు అవసరం. దేశీయంగా సరఫరాల అడ్డంకులను తొలగించడం, నిలిచిపోయిన ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. తద్వారా వృద్ధికి ఊపును అందించవచ్చు. బ్యాంకింగ్‌పై ఇలా..: బ్యాంకుల్లో ఇటీవల మొండిబకాయిల సమస్య తగ్గుతోంది. దీనితో రుణ నాణ్యత మొత్తంగా మెరుగుపడింది. అయితే ఈ రంగంలో వ్యవస్థీకృత ఇబ్బందులు పెరుగుతున్నాయి. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), లాభదాయకత వంటి అంశాల్లో సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రైవేటు రంగ బ్యాంకుల కన్నా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. అయితే పరిస్థితులు ఇదే విధంగా కొనసాగబోవన్న భరోసా ఉంది.