Indian drugs and pharmaceuticals Ltd
-
అమ్మకానికి ఐడీపీఎల్ భూములు!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐడీపీఎల్‌తో పాటు ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలకు చెందిన నిరుపయోగ భూమిని విక్రయించాలనే యోచన ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్(బీసీపీఎల్), హిందూస్తాన్ యాంటిబయాటిక్స్(హెచ్ఏఎల్), హిందూస్తాన్ ఆర్గానిక్ కెమికల్స్(హెచ్ఓసీఎల్) తదితర కంపెనీలకు ముంబై, పుణే, తదితర ప్రధాన నగరాల్లో వేల కోట్ల విలువ చేసే భూములు నిరుపయోగంగా ఉన్నాయని వివరించారు. ఈ భూముల విక్రయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, విక్రయించాలనే అభిప్రాయం ప్రాథమికంగా వ్యక్తం అయిందని పేర్కొన్నారు. ఐడీపీఎల్‌కు హైదరాబాద్, గుర్గావ్, హరిద్వార్‌ల్లో, బీసీపీఎల్కు కోల్‌కతా, ముంబై, కాన్పూర్లలో హెచ్ఏఎల్కు పుణే లో, హెచ్ఓసీఎల్కు మహారాష్ట్ర, కేరళల్లో భూములున్నాయన్నారు. డిజిన్వెస్ట్మెంట్కు సమస్యల నేపథ్యంలో వాటా విక్రయం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోందని, దీంట్లో భాగంగానే ఈ భూ ముల విక్రయం తెరపైకి వచ్చిందని సమాచారం. -
ఐడీపీఎల్ పునరుద్ధరణకు నిధులు
న్యూఢిల్లీ: ఖాయిలాపడిన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) పునరుద్ధరణకు అవసరాల ప్రాతిపదికన నిధులు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫార్మాస్యూటికల్స్ విభాగం, ఐడీపీఎల్లు ఈ మేరకు ఓ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. శక్తివంతమైన ఔషధ ఉత్పత్తి సంస్థగా ఐడీపీఎల్‌ను తీర్చిదిద్దడం, అమ్మకాలను కనీసం 5 శాతం పెంచడం, 2013-14లో ఉత్పత్తి అయిన ఔషధాల్లో (ఇన్వెంటరీ) 5 శాతాన్ని తగ్గించుకోవడం ఎంఓయూలో పేర్కొన్న లక్ష్యాలు. గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.63 కోట్ల విక్రయాలపై రూ.309 కోట్ల నికరనష్టాన్ని చవిచూసినట్లు అంచనా. అత్యవసర మం దులను, జెనెరిక్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రులకు, ఫార్మసీలకు హేతుబద్ధమైన ధరలకు సరఫరా చేసేందుకే ఐడీపీఎల్‌కు ప్రభుత్వం సహకరిస్తోందనిఎంఓయూలో తెలిపారు. దేశంలో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఔషధాలను అత్యవసరంగా సరఫరా చేయాల్సి ఉంటుందనీ, ఐడీపీఎల్‌కు చేయూతనివ్వడానికి ఇది మరో కారణమనీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద ఫార్మా సంస్థ అయిన ఐడీపీఎల్‌కు హైదరాబాద్‌తో పాటు రిషికేశ్, గుర్గావ్లలో ప్లాంట్లున్నాయి. చెన్నై, ముజఫర్‌పూర్‌లలో సబ్సిడరీ యూనిట్లున్నాయి.