Indian IT
-
ఐటీ, బిజినెస్ సర్వీసెస్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 6.4 శాతం వృద్ధి సాధించింది. విలువ రూ.51,713 కోట్లకు చేరింది. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2019 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే గతేడాది ఇదే కాలంలో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ 5.1 శాతం వృద్ధి సాధించింది. కంపెనీలు డిజిటల్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేయడమే ఈ వృద్ధికి కారణం. పరిశ్రమలో ఐటీ సేవల వాటా 78 శాతం ఉంది. వృద్ధి 7.3 శాతం నమోదైంది. అంత క్రితం ఏడాది ఇది 5.7 శాతం. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతోపాటు క్లౌడ్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో కంపెనీల పెట్టుబడి వ్యయం పెరగడంతో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ రాబోయే కాలంలో మరింత జోరుగా ఉంటుంది. నాలుగేళ్లలో ఇలా.. భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 2025 నాటికి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఐడీసీ తెలిపింది. ‘2020–25 మధ్య ఏటా 8.2 శాతం వృద్ధి సాధిస్తుంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బపడినప్పటికీ వ్యాపార విధానం మార్పు, కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు, వినియోగదార్లు, సిబ్బంది అనుభూతి పెరిగేందుకు, స్థితిస్థాపకత మెరుగుకు సంస్థలు డిజిటలీకరణకు పెట్టుబడులను కొనసాగిస్తాయి. ప్రభుత్వ, తయారీ రంగాలు 2020లో ఐటీ పెట్టుబడులను ఆలస్యం చేశాయి. 2021 జనవరి–జూన్‌లో ఖర్చులను పెంచాయి. వ్యాక్సినేషన్, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, కస్టమర్ల సెంటిమెట్‌తో పరిశ్రమ కోవిడ్ ముందస్తు స్థాయికి తిరిగి రానుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలు ప్రాసెస్ ఆటోమేషన్, కస్టమర్ల అనుభూతి, హైబ్రిడ్ క్లౌడ్ నిర్వహణపై ఫోకస్ చేశాయి’ అని వివరించింది. -
భారత ఐటీ ఇండస్ట్రీ కోసం మరో దేశం..
ప్రపంచంలోని కొన్ని దేశాలు భారతీయ వీసా హోల్డర్స్ కు షాకిస్తుండగా.. రష్యా బంపర్ అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరమవుతుండటంతో, భారత ఐటీ ఇండస్ట్రీకి రష్యా తలుపులు బార్ల తెరిచే ఉంచుతుందని ఆ దేశ మంత్రి చెప్పారు. గతవారంలో ఇక్కడ పర్యటనకు వచ్చిన రష్యన్ మంత్రి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల్లో రెండింట్లో ఇరుదేశాల మధ్య సహకారం కోసం చూస్తున్నామని తెలిపారు. కేవలం సహకార చర్చలు మాత్రమే కాక, దేశీయ ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తో కూడా రష్యన్ టెలికాం, మాస్ కమ్యూనికేషన్ డిప్యూటీ మంత్రి రషిద్ ఇష్మైలవ్ చర్చలు జరిపారు. రాడికల్ గ్రూప్ లపై పోరాటానికి సైబర్ సెక్యురిటీలో, ఇతర భద్రతా ముప్పుల్లో ఇరు దేశాల మధ్య సహకారం అవసరమని మంత్రి, దేశీయ అధికారులతో చర్చించారు. దీంతో అమెరికాలో వీసా నిబంధనలతో దెబ్బతింటున్న దేశీయ ఐటీ ఇండస్ట్రీకి రష్యా చేదుడు వాదోడుగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అటు అమెరికాతో పాటు పలు దేశాలు తీసుకొస్తున్న వీసా నిబంధనల కఠితనతరంతో భారత టెక్కీలకు కొన్ని దేశాలు ఆహ్వానాలు పలుకుతున్నాయి. తమ దేశంలో టెక్నాలజీ సేవలు అందించేందుకు రావాలంటూ కెనడా లాంటి దేశాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రష్యా సైతం భారత ఐటీకి బార్ల తలుపులు తెరచి ఉంచనున్నట్టు తెలుపుతోంది. జూన్ 1 నుంచి 3వ తేదీల్లో రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించబోతున్నారు. దీనిలో భారత్ గెస్ట్ కంట్రీ. ఐటీ రంగాల్లో ఇండో-రష్యన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ వేదిక ఎంతో సహకరించనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోరమ్ లో ప్రధాని మోదీతో పాటు నాస్కామ్ కు చెందిన కొందరు అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు. భారత్ వరల్డ్ క్లాస్ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో దూసుకెళ్తుండగా.. రష్యా కంప్యూటర్ ప్రొగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లో ఎక్కుగా పురోగతి సాధిస్తోంది. -
సాఫ్ట్వేర్ కా పరేషాన్ !
-
భారత ఐటీలో బ్లడ్‌బాత్? కంపెనీల పరిస్థితి
న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ , దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో ఇటీవల భారీగాఉద్యోగులపై ఉద్వాసన పలుకుతున్నాయనే వార్తలు ఉద్యోగలను కలవరపరిచింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తోడు, దేశీయంగా ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)రంగంఎదుర్కొంటున్నసవాళ్లు వేలమంది ఉద్యోగుల భవిష్యత్‌పై పలు ప్రశ్నల్ని లేవనెత్తింది. ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కేప్జెమినిల్లో ఉద్యోగమంటే యువతకు యమ క్రేజ్. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.3 శాతం వాటాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నమనదేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న రంగం ఐటీ . దేశంలో 40 లక్షలమందికి ప్రత్యక్షజీవనోపాధిగానూ, మరో 20 లక్షల మంది పరోక్షంగానో ఈ రంగం ఉపాధిని కల్పిస్తుంది. ప్రపంచ ఐటీ రంగానికి 57 శాతం ఔట్సోర్సింగ్ భారత్ ఐటీ రంగం నుంచే జరుగుతుంది. ఒక్క 2016 సంవత్సరంలో ఐటీకంపెనీల రెవెన్యూ 14,300 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగ్నిజెంట్ మొదలు... విప్రో వరకూ..! గత మార్చి 20న కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల్లో 6వేల మందిపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది. అటు దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, ఫ్రెంచ ఐటీ మేజర్ కాప్ జెమిని ఉద్యోగాల్లో కోత విధించకుండా రక్షణాత్మక ధోరణి అవలంబించాయి. ఈ ఏడాది తొలి 9నెలల్లో కేవలం 5వేల మందిని మాత్రమే కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇన్ఫోసిస్ ప్రక్రియతో ఐటీరంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోయినా, పరోక్షంగా ఆందోళన కలిగించే విషయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో కూడా ఉద్యోగాల ఉద్వాసన విషయంలో కాగ్నిజెంట్‌నే అనుసరించనుంది. వార్షిక పనితీరు ప్రక్రియం అనంతరం సుమారు 600 నుంచి 2,000 మందిని ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. క్యాప్ జెమినీ శిక్షణ డిజిటల్ , క్లౌడ్ లో కొత్త నైపుణ్యాలలో సుమారు లక్షమంది ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు, ఫ్యూచర్‌కు తమ ఉద్యోగులను రడీ చేయడమే లక్ష్యమని ఫ్రాన్స్‌కుచెందిన ఐటి సేవల సంస్థ క్యాప్ జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ ఒక వార్తా సంస్థతో చెప్పారు. దాదాపు 60 వేలమందికి శిక్షణ పూర్తి అయిందని, డిజిటల్ టెక్నాలజీల వాడకంలో నైపుణ్యంలో లేని మధ్య మరియు సీనియర్ స్థాయిలలో అత్యధిక ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదముందని క్యాప్ జెమినీ ఇండియా అధిపతి శ్రీనివాస్ కందుల ఇటీవల హెచ్చరించడం గమనార్హం. ఆటోమేషన్నే అసలు కారణమా..? వ్యయాలను తగ్గించుకోవడానికి కంపెనీలు ఆటోమేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈ ఐటీరంగంలో పని చేసే లక్షలాది మంది భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు డిజిటైజేషన్, ఆటోమేషన్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఆటోమేషన్ వల్ల ఈ ఏడాదిలో ఐటీ ఉద్యోగాల నియామకాలు 40 శాతం తగ్గవచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం వల్లే: నాస్కాం ప్రెసిడెంట్: ఆర్.చంద్రశేఖర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం మెదలైంది. స్థానికులకు ఉపాధి కల్పన, పాలసీల రూపకల్పన ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని మెరగుపచాలన్నది ఈ ఉద్యమం ముఖ్యలక్షణం. ఈ ఉద్యమాన్ని ఒక్కోదేశం ఒక్కో రకంగా చేస్తోంది. ‘‘అమెరికా హెచ్1బీ వీసా నిబంధనలు మార్పు, ఆస్ట్రేలియా, సింగపూర్ వర్క్ వీసాల పాలసీని రద్దు’’ ఇవన్నీ అందులో బాగమే. అందువల్ల ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలను నిలిపివేయడం, తగ్గించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. -
భారత్ ఐటీలో ఇన్వెస్ట్ చేయండి..
బెల్జియం ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ ఆహ్వానం బ్రసెల్స్: భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని బెల్జియం వ్యాపార దిగ్గజాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. వజ్రాల వర్తకం రూపంలో చిరకాలంగా ఇరు దేశాల మధ్య వ్యాపార బంధాలున్నాయని బెల్జియం సీఈవోల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వజ్రాల పరిశ్రమ భారత్‌లో అనేక మందికి ఉపాధి కల్పిస్తోందని మోదీ చెప్పారు. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్ ద్వారా ఈ విషయాలు తెలిపారు. రఫ్ డైమండ్ల వ్యాపారంలో దాదాపు 84 శాతం బెల్జియంలోని యాంట్వెర్ప్ నగరంలోనే జరుగుతుంది. టర్నోవరు 54 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రమైన యాంట్వెర్ప్లో భారత ట్రేడర్ల సంఖ్య గణనీయంగా ఉంది. మరోవైపు, ఇరు దేశాలు పునరుత్పాదక ఇంధనాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఖగోళ పరిశోధనలు, ఐటీ, పర్యాటకం, బయోటెక్నాలజీ, షిప్పింగ్, పోర్టులు తదితర పరిశ్రమల్లో పరస్పరం సహకరించుకోవాలని మోదీ సూచించారు. బెల్జియంతో భారత్‌కు ‘రక్త సంబంధాలు’ కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వందేళ్ల క్రితం బెల్జియంలో 1,30,000 మంది భారతీయ సైనికులు పోరాడారని, దాదాపు 9,000 మంది ప్రాణత్యాగాలు చేశారని మోదీ గుర్తు చేశారు. -
ఐటీ జీతాల్లో భారత్ వరస్ట్
వార్షిక వేతనం సగటున 41,213 డాలర్లు స్విట్జర్లాండ్‌లో అత్యధికంగా 1,71,465 డాలర్లు న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత తక్కువ జీతభత్యాలు చెల్లించే ఐటీ కంపెనీలున్న 10 దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో నిల్చింది. మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్ నిర్వహించిన ఐటీ శాలరీ 2015 సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే ప్రకారం.. దేశీ ఐటీ మేనేజర్ల సగటు వేతనం 41,213 డాలర్లుగా ఉండగా.. ఇదే స్థాయి ఉద్యోగి స్విట్జర్లాండ్‌లో ఇంతకు నాలుగు రెట్లు అధికంగా అందుకుంటున్నారు. అత్యధిక జీతభత్యాలు చెల్లించే ఐటీ కంపెనీలున్న దేశంగా మరోసారి అగ్రస్థానంలో నిల్చిన స్విట్జర్లాండ్‌లో ఐటీ ఉద్యోగి సగటు వార్షిక వేతనం 1,71,465 డాలర్లు కాగా, రెండో స్థానంలో ఉన్న బెల్జియంలో 1,52,430 డాలర్లుగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. 1,38,920 డాలర్లతో డెన్మార్క్ మూడో స్థానంలో నిలవగా.. అమెరికా (1,32,877 డాలర్లు), బ్రిటన్ (1,29,324 డాలర్లు) వరుసగా నాలుగో, ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక భారతీయ కంపెనీలకన్నా తక్కువ జీతభత్యాలు చెల్లిస్తున్న దేశాల్లో బల్గేరియా (కేవలం 25,680 డాలర్లు), వియత్నాం (30,938 డాలర్లు), థాయ్‌ల్యాండ్ (34,423 డాలర్లు) ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలు మానవ వనరులు చౌకగా లభించే దేశాలకు తరలిపోతున్నాయని మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. పశ్చిమ యూరప్, అమెరికాలో ఉద్యోగాలు కొన్నే ఉన్నా అవి అధిక నైపుణ్యం అవసరమైనవిగానూ ఉంటున్నాయన్నారు. అత్యల్ప వేతనాల దేశాలు... దేశం వార్షిక వేతనం(డాలర్లలో) బల్గేరియా 25,680 వియత్నాం 30,938 థాయిలాండ్ 34,423 ఇండోనేసియా 34,780 ఫిలిప్పీన్స్ 37,534 భారత్ 41,213 చైనా 42,689 చెక్ రిపబ్లిక్ 43,219 అర్జెంటీనా 51,380 అత్యధిక వేతనాల దేశాలు... దేశం వార్షిక వేతనం(డాలర్లలో) స్విట్జర్లాండ్ 1,71,465 బెల్జియం 1,52,430 డెన్మార్క్ 1,38,920 అమెరికా 1,32,877 యూకే 1,29,324