Indian mens
-
Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ జట్లు అర్హత
న్యూఢిల్లీ: మూడు క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా వీలుకాకపోయినా వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా ఇప్పటికే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్న 10 జట్లను మినహాయించి... వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండు అత్యుత్తమ జట్లకు మిగిలిన రెండు బెర్త్‌లను కేటాయించారు. పురుషుల విభాగంలో భారత్, చైనా... మహిళల విభాగంలో భారత్, ఇండోనేసియా జట్లకు ఈ అవకాశం లభించింది. ఫలితంగా వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో, వ్యక్తిగత విభాగాల్లో, మిక్స్డ్ టీమ్ విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో (టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్) పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 44 ఏళ్ల తరుణ్‌దీప్ రాయ్... మాజీ నంబర్‌వన్ దీపికా కుమారి నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ విభాగంలో భజన్ కౌర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత పురుషుల ఆర్చరీ జట్టు: తరుణ్‌దీప్ రాయ్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్ జాధవ్. భారత మహిళల ఆర్చరీ జట్టు: దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత. -
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది. ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది. హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. స్నేహిత్‌కు కాంస్యం సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు. -
భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లకు నిరాశ
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీలో తొలి రోజు భారత పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. అందుబాటులో ఉన్న ఆరు వెయిట్ కేటగిరీల (57, 65, 74, 86, 97, 125 కేజీలు) నుంచి ఒక్క విభాగంలోనూ భారత రెజ్లర్‌కు ఒలింపిక్ బెర్త్ ఖరారు కాలేదు. ప్రతి వెయిట్ కేటగిరీలో ఫైనల్ చేరిన ఇద్దరికి ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్‌కు త్రుటిలో ఒలింపిక్ బెర్త్ చేజారింది. సెమీఫైనల్లో అమన్ 0–10తో గులోమ్జన్ అబ్దుల్లాయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు అమన్ తొలి రౌండ్లో 10–0తో యెరాసిల్ ముఖాతరూలీ (కజకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–1తో కిమ్ సంగ్వన్ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. భారత ఇతర రెజ్లర్లు జైదీప్ (74 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో... దీపక్ (97 కేజీలు) తొలి రౌండ్లో... సుమిత్ మలిక్ (125 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. దీపక్, సుజీత్ ఆలస్యంగా... టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం బౌట్లో ఓడిపోయిన దీపక్ పూనియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు) ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి ఎంట్రీలు పంపించినా దురదృష్టం వారిని వెంటాడింది. రష్యాలో ఈనెల 2 నుంచి 15 వరకు శిక్షణ పొందిన దీపక్, సుజీత్ 16న దుబాయ్ మీదుగా కిర్గిస్తాన్ రాజధాని బిషె్కక్ చేరుకోవాలనుకున్నారు. అయితే దుబాయ్‌లో అనూహ్య వరదల కారణంగా వీరిద్దరు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. పలు విమానాలు రద్దు కావడం... మరికొన్ని ఆలస్యంగా నడవడంతో దీపక్, సుజీత్ శుక్రవారం తప్పనిసరిగా హాజరుకావాల్సిన వెయింగ్ కార్యక్రమానికి సమ యా నికి చేరుకోలేకపోయారు. దాంతో దీపక్, సుజీత్ ఈ టోర్నీలో బరిలోకి దిగలేకపోయారు. మే నెలలో టర్కీలో వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ రూపంలో భారత రెజ్లర్లకు పారిస్ బెర్త్‌లు సంపాదించే అవకాశం మిగిలి ఉంది. శనివారం మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయి. వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అన్షు (57 కేజీలు), మాన్సి (62 కేజీలు), నిషా (68 కేజీలు), రీతిక (76 కేజీలు) బరిలో ఉన్నారు. -
అబ్బాయిలకు నాలుగు.. అమ్మాయిలకు ఐదు
ముగిసిన చెస్ ఒలింపియాడ్ * హరికృష్ణ, విదిత్, తానియాలకు చేజారిన కాంస్యాలు * ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌కు అమ్మాయిల జట్టు అర్హత బాకు (అజర్బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి భారత పురుషుల, మహిళల జట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశాయి. అయితే మూడు కాంస్య పతకాలు గెల్చుకునే అవకాశాన్ని భారత క్రీడాకారులు త్రుటిలో చేజార్చుకున్నారు. పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ, ఆధిబన్, సేతురామన్, విదిత్ సంతోష్ గుజరాతి, మురళీ కార్తికేయన్‌లతో కూడిన భారత జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానాన్ని సంపాదించింది. ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, బొడ్డ ప్రత్యూషలతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. టాప్-5లో నిలిచినందున భారత మహిళల జట్టు వచ్చే ఏడాది మేలో రష్యాలో జరిగే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. 2014లో జరిగిన ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి కాంస్య పతకాన్ని సాధించింది. కార్ల్‌సన్‌ను నిలువరించిన హరికృష్ణ నార్వే జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’ చేసుకుంది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన గేమ్‌ను హైదరాబాద్ ప్లేయర్ హరికృష్ణ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోవడం విశేషం. హ్యామర్‌తో జరిగిన గేమ్‌ను ఆధిబన్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించగా... విదిత్ 45 ఎత్తుల్లో ఆర్యన్ తారిని ఓడించాడు. అయితే ఫ్రోడ్ ఉర్కెడాల్‌తో జరిగిన గేమ్‌లో సేతురామన్ 25 ఎత్తుల్లో ఓడిపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఓవరాల్‌గా భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో ఓడిపోయింది. ‘డ్రా’తో ముగించిన అమ్మాయిలు అమెరికా జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2-2తో ‘డ్రా’గా ముగించింది. ఇరీనా క్రుష్‌తో జరిగిన గేమ్‌ను హారిక 38 ఎత్తుల్లో... కాటరీనా నెమ్‌కోవాతో జరిగిన గేమ్‌ను సౌమ్య 94 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. తానియా 78 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీని ఓడించగా... పద్మిని రౌత్ 40 ఎత్తుల్లో నాజి పైకిడ్‌జి చేతిలో ఓడిపోవడంతో భారత్ ‘డ్రా’తో సంతృప్తి పడింది. ఓవరాల్‌గా భారత్ ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, అజర్బైజాన్ చేతిలో మాత్రమే ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయింది. చేరువై... దూరమై... ఇక వ్యక్తిగత విభాగాల ప్రదర్శను పరిగణనలోకి తీసుకుంటే... పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ బోర్డు-1పై 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, బోర్డు-3పై విదిత్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో... మహిళల విభాగంలో తానియా బోర్డు-3పై 7 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను త్రుటిలో కోల్పోయారు. టాప్-3లో నిలిచినవారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. అమెరికా, చైనాలకు స్వర్ణాలు పురుషుల విభాగంలో అమెరికా జట్టు 20 పాయింట్లతో స్వర్ణం సాధించగా...ఉక్రెయిన్, రష్యా, రజత కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. మహిళల విభాగంలో చైనా 20 పాయింట్లతో పసిడి పతకాన్ని కై వసం చేసుకోగా... పోలాండ్, ఉక్రెయిన్ రజత, కాంస్య పతకాలను సంపాదించాయి. 2018 చెస్ ఒలింపియాడ్‌కు జార్జియా ఆతిథ్యం ఇస్తుంది. -
ప్రతి అబద్ధమూ మోసం కాదు!!
అబద్ధం మంచిది... అబద్ధం చెడ్డది... మన పూర్విక తాత్వికులకూ తెలుసు అందుకే వారన్నారు... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యమప్రియమ్. అంటే... ఎదుటివాళ్లకు ప్రియంగా ఉంటేనే సత్యం చెప్పమన్నారు. లేకపోతే వద్దన్నారు. అంతమాత్రాన వాళ్లు మోసం చేయమని చెప్పలేదు కదా! అబద్ధం మంచిది... అబద్ధం చెడ్డది... ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్టు? రెండూ కరెక్టే. అందుకే ప్రతి ఇంట్లో ముగ్గురు కచ్చితంగా ఉంటారు... భార్య, భర్త, ఒక అబద్ధం! ఒక మనిషి అన్నీ నిజాలే చెప్పి బతకడం చాలా కష్టం. దాన్ని కొందరు మూర్ఖత్వం అంటారు. అలా నిత్యం నిజాలు మాట్లాడే వ్యక్తి అంటే ఈ సమాజం భయపడుతుంది కూడా. నిజం ఎంత ప్రమాదమో అబద్ధాలు అంతే ప్రమాదం. కాపురాలు నిలబెట్టే అబద్ధాలుంటాయి, కాపురాలు కూల్చే అబద్ధాలుంటాయి. పెళ్లికి ముందు ముగిసిపోయిన ప్రేమకథ దాచితే అబద్ధం గాని పెళ్లయ్యాక నెరపే అక్రమ సంబంధం దాయడం అబద్ధం కాదు మోసం. వెయ్యి అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. దాని అంతరార్థం మోసం చేసి పెళ్లి చేసుకోమని కాదు. జీవితంలో సంతోషం సర్దుకుపోవడంలోనే ఉంది. ప్రతి మనిషిలో లోపాలుంటాయి. వాటినే వెతుక్కుంటూ ఉంటే ఎవరికీ పెళ్లిళ్లు కావు. పైగా పెళ్లపుడు చెప్పే చాలా అబద్ధాలు దాగవు. అయితే, తెలిసినా ఇరువైపులా సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోగలిగిన అబద్ధాలే చెప్పాలి. జీతం ఓ ఐదు వేలు ఎక్కువ చెప్పి పెళ్లి చేసుకుంటే సర్దుకుపోవచ్చు కానీ ఉద్యోగమే అబద్ధం అయితే సర్దుకుపోయేదేమీ ఉండదు. అంటే, ఈ అబద్ధాలు మంచి చేసేవి కావాలి గాని హాని చేసేవి కాకూడదు అన్నది పెద్దల సిద్ధాంతం. ఇలాంటిదే పాశ్చాత్య దేశాల్లో కాస్త పద్ధతిగా ఉంటుంది. అదే ‘వైట్లైస్ థియరీ’. దీని ప్రకారం కాపురం కాపాడుకోవడానికి చెప్పే ప్రతి అబద్ధమూ మంచిదే. ‘అతడు’ సినిమా చూసి ఉంటే మీకు ఓ డైలాగు గుర్తుండే ఉంటుంది... ‘నిజం దాచాలనుకోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’. అంటే కాపురంలో అబద్ధాలు ఉండొచ్చు గాని మోసాలు ఉండకూడదు. సమస్య ఎక్కడ వస్తుందంటే... భర్త చెప్పే ప్రతి అబద్ధమూ మోసమే అనే భావన భార్యలో ఉంటుంది. అది నిజం కాదు. ఎందుకంటే భర్త చెప్పే అబద్ధాల్లో కొన్ని భాగస్వామిని బాధ పెట్టకూడదని చెప్పేవి ఉంటాయి. కొన్ని కాపురంలో కలతలను నివారించడానికి అయి ఉంటాయి. ఇంకొన్ని మోసం చేయడానికే చెప్పి ఉండొచ్చు. నిజాలు తెలియకుండా/తెలుసుకోకుండా మనిషిని అపార్థం చేసుకోవడం వల్ల జీవితం ముళ్ల బాట అవుతుంది. ఈ విషయం మన పూర్విక తాత్వికులకూ తెలుసు అందుకే వారన్నారు... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యమప్రియమ్. అంటే... ఎదుటివాళ్లకు ప్రియంగా ఉంటేనే సత్యం చెప్పమన్నారు. లేకపోతే వద్దన్నారు. అంతమాత్రాన వాళ్లు మోసం చేయమని చెప్పలేదు కదా. అందుకే ప్రతి అబద్ధమూ మోసం కాదు. ప్రాణ, మాన, విత్త భంగంలో ముందు బొంకే ప్రతి అబద్ధమూ ఆపద్ధర్మమే. ఆమోదయోగ్యమే. అది మోసం కానే కాదు. ఈ విషయం గ్రహిస్తే అబద్ధానికీ, మోసానికీ తేడా తెలుస్తుంది. అది ప్రతి జీవిత భాగస్వామీ తెలుసుకుంటే వాళ్లదిక పండంటి కాపురమే. అయితే కొన్ని విషయాలు గ్రహించాలి సాధారణంగా భారతీయ పురుషులు తల్లీపెళ్లాల గొడవలు తగ్గించడానికి, భార్యకోపం నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతారట. కొన్నిసార్లు నొప్పించకూడదన్న మంచి కారణంతో చెప్పిన అబద్ధాలు కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంటాయట. అబద్ధం చెప్పిన విషయం కన్నా భర్త అబద్ధమాడాడన్న బాధే మహిళలను ఎక్కువగా బాధిస్తుందట. హద్దుల్లో ఉండే అబద్ధాల గురించి తెలిసినా కారణాలు అడిగి ఒకరినొకరు క్షమించుకుంటే కాపురం పండుతుంది. - ప్రకాష్ చిమ్మల