indian museum
-
ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు
కోల్‌కతా: కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలో బాంబును అమర్చినట్లు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సందర్శకులందర్ని మ్యూజియం నుంచి ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలను మ్యూజియానికి పంపించారు. బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు బూటకమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి అలాంటి మెయిల్స్ కొన్ని వచ్చాయని వెల్లడించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఎక్కువైంది. దేశరాజధానిలో ఇటీవల ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద బాంబు బెదిరింపుల ఘటన జరిగింది. అటు.. ముంబయిలోనూ ఆర్బీఐ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే అయోధ్య రామాలయం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీ సర్కార్‌కు షాక్.. మొహల్లా క్లినిక్‌లపై సీబీఐ దర్యాప్తు -
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన టాప్ 20 మ్యూజియంలు
-
ఆన్లైన్లో ఇండియన్ మ్యూజియం
కోల్‌కత: ఇటీవల 360 డిగ్రీల రూపంలో(విస్తృత వీక్షణ) ఉన్న వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోల్‌కతలోని ఇండియన్ మ్యూజియానికి సంబంధించిన వీడియోను గూగుల్ సహాయంతో అందుబాటులోకి తీసుకురానున్నారు. మ్యూజియంలోని బౌద్ధకళ, గాంధార సంస్కృతి శిల్పాలను ఈ వీడియోలో చేర్చనున్నారు. ‘ఇండియన్ బుద్ధిస్ట్’ పేరుతో ఈ రోజు (బుధవారం) నెట్లో విడుదల చేస్తారు. ప్రపంచంలోని ప్రముఖ కళాఖండాలని తమ వెబ్సైట్లో చేర్చే కార్యక్రమంలో భాగంగా గూగుల్ దీన్ని చేపట్టింది. మ్యూజియం డెరైక్టర్ జయంత్ సేన్‌గుప్తా మాట్లాడుతూ...‘మ్యూజియంలోని కళాఖండాలన్నింటినీ గూగుల్ వెబ్ సైట్లో చేర్చబోతున్నాం. ఈ వీడియోని మీరు అన్ని కోణాల్లో తిప్పి చూసుకోవచ్చు’ అని అన్నారు. గూగుల్ దీనికోసం యూకే, యూఎస్‌కి చెందిన ప్రత్యేక కెమెరాలను వినియోగించిదని సేన్‌గుప్తా వివరించారు. -
నందికొండ పోదామా..
నందికొండ.. అది ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేల... బౌద్ధం పరిఢవిల్లిన ప్రాంతం.. కృష్ణమ్మ పరవళ్ల నడుమ.. ఎత్తయిన కొండల మధ్య విస్తరించి ఉన్నదే నాగార్జునకొండ. దానిపై నెలకొల్పిన మ్యూజియంలో ఇక్ష్వాకులు, శాతవాహన కాలం నాటి చరిత్రకు సాక్ష్యాలైన అనేక కళాఖండాలు దర్శనమిస్తాయి. నాగార్జునసాగర్ జలాశయంలో నల్లమల కొండల నడుమ 144 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రాంతమే నాగార్జున కొండ(నందికొండ). ఈ కొండపై 1966లో మ్యూజియం ప్రారంభించారు. ఇందులో 1923 నుంచి 1960 వరకు సాగిన తవ్వకాల్లో దొరికిన క్రీస్తు శకం 3,4 శతాబ్దాలకు చెందిన ఇక్ష్వాకులు, శాతవాహనుల కాలం నాటి శిల్పాలు, శిలాఫలకాలు, చారిత్రక వస్తువులను భద్రపరిచారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తుశకం మూడో శతాబ్దం వరకు నాగార్జునకొండ దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ భౌద్ధకేంద్రంగా విరాజిల్లింది. ఇది ప్రముఖ బౌద్ధతాత్వికుడు, దార్శనికుడు ఆచార్య నాగార్జునుడి పేరిట ప్రసిద్ధికెక్కింది. మహాయాన బౌద్ధమతధర్మ వ్యాప్తికి ఇక్కడి విజ్ఞాన కేంద్రం ఎంతో దోహద పడింది. చైనా, శ్రీలంక దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి ధార్మిక విద్యాభ్యాసం చేసేవారని చరిత్ర చెబుతోంది. నాగార్జున విశ్వవిద్యాలయం, చైత్యగృహాలు, స్థూపాలు, మంటపాలు, విహారాలు, పాలరాతి కట్టడాలు, బౌద్ధశిల్పాలు ఇక్కడి తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిలో స్థూపాల్ని పోలిన తొమ్మిది నిర్మాణాలు చెప్పుకోదగినవి. ఇవి చక్రాకారంలో నిర్మితం కావడం విశేషం. ఇందులోమహాచైత్యం అత్యంత ప్రముఖమైనది. 1955లో నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం వల్ల వీటిపై పెద్ద జలాశయం ఏర్పడింది. ఆ చారిత్రక అవశేషాలను పరి రక్షించేందుకు నందికొండకు తరలించి మ్యూజియంలో భద్రపరిచారు. అయితే వీటిలో కొన్ని శిల్పాలు, విశేషాలను మద్రాస్ మ్యూజియానికి, మరికొన్నింటిని బ్రిటిష్‌వారు లండన్ మ్యూజియానికి తరలించారు.