ఆన్‌లైన్‌లో ఇండియన్ మ్యూజియం | Kolkata's Indian Museum Collection Going Online With Google | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఇండియన్ మ్యూజియం

Published Wed, May 25 2016 8:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

ఆన్‌లైన్‌లో ఇండియన్ మ్యూజియం

ఆన్‌లైన్‌లో ఇండియన్ మ్యూజియం

కోల్‌కత: ఇటీవల 360 డిగ్రీల రూపంలో(విస్తృత వీక్షణ) ఉన్న వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోల్‌కతలోని ఇండియన్ మ్యూజియానికి సంబంధించిన వీడియోను గూగుల్ సహాయంతో అందుబాటులోకి తీసుకురానున్నారు. మ్యూజియంలోని బౌద్ధకళ, గాంధార  సంస్కృతి శిల్పాలను ఈ వీడియోలో చేర్చనున్నారు.

‘ఇండియన్ బుద్ధిస్ట్’ పేరుతో ఈ రోజు (బుధవారం) నెట్‌లో విడుదల చేస్తారు. ప్రపంచంలోని ప్రముఖ కళాఖండాలని తమ వెబ్‌సైట్‌లో చేర్చే కార్యక్రమంలో భాగంగా గూగుల్  దీన్ని చేపట్టింది. మ్యూజియం డెరైక్టర్ జయంత్ సేన్‌గుప్తా మాట్లాడుతూ...‘మ్యూజియంలోని కళాఖండాలన్నింటినీ గూగుల్ వెబ్ సైట్‌లో చేర్చబోతున్నాం. ఈ వీడియోని మీరు అన్ని కోణాల్లో తిప్పి చూసుకోవచ్చు’ అని అన్నారు. గూగుల్ దీనికోసం యూకే, యూఎస్‌కి చెందిన ప్రత్యేక కెమెరాలను వినియోగించిదని సేన్‌గుప్తా వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement