Indian National Congress Party
-
హైదరాబాద్ యువ డిక్లరేషన్‌ను ప్రకటించనున్న ప్రియాంక గాంధీ
-
సిద్ధరామయ్య మా దేవుడు అంటున్న వరుణ ప్రజలు
-
భారత్ జోడో యాత్ర.. 3,570 కిలోమీటర్లు.. 12 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ ఏడవ తేదీన శ్రీకారం చుట్టనున్న ‘భారత్ జోడో యాత్ర’ కన్యాకుమారిలో మొదలై కశ్మీర్లో పూర్తికానుంది. ఇందులోభాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఏకంగా 3,570 కిలోమీటర్ల పొడవునా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగనుంది. ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్.. జుడే వతన్)’ నినాదంతో సుదీర్ఘంగా ఐదు నెలలపాటు ఈ ప్రజాఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఏకధృవ సామాజిక పోకడ, దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, విద్వేషాలను రూపుమాపేందుకు కాంగ్రెస్ నడుంబిగించింది. కులమతాలకతీతంగా దేశ ప్రజానీకం పాదయాత్రలో కదంతొక్కనున్నారు. పాదయాత్రగా కొనసాగే ఈ కార్యక్రమాన్ని స్వాతంత్య్రభారతంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. తర్వాత తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూరు, బళ్లారి, రాయచూర్ మీదుగా యాత్రను కొనసాగిస్తారు. షెడ్యూల్లో భాగంగా తెలంగాణలోని వికారాబాద్లోనూ యాత్ర ఉంటుంది. మహారాష్ట్రలోని నాందేడ్, తర్వాత జల్గావ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్తాన్‌లోని కోటా పట్టణం.. తర్వాత డౌసా, అల్వార్‌లో పాదయాత్ర ముందుకు వెళ్లనుంది. ఉత్తరభారతం విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లోని బులందర్ షహర్, తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, అంబాలా(హరియాణా)లనూ పాదయాత్ర పలకరించనుంది. జమ్మూ పట్టణం, ఆ తర్వాత చివరిగా శ్రీనగర్‌లో పాదయాత్ర పూర్తికానుంది. భౌగోళికంగా నదీజలాలు, కొండలు, అటవీప్రాంతం.. పాదయాత్ర మార్గానికి ఆటంకం కలగకూడదని అవి లేని మార్గాల్లో పాదయాత్ర రూట్‌మ్యాప్‌కు కాంగ్రెస్ నాయకులు తుదిరూపునిచ్చారు. 100 మంది ‘భారత యాత్రికులు’ పాదయాత్రలో యాత్ర తొలి నుంచి తుదికంటా 100 మంది మాత్రం కచ్చితంగా పాలుపంచుకోనున్నారు. వీరిని ‘భారత యాత్రికులు’గా పిలవనున్నారు. ఏ రాష్ట్రం గుండా అయితే భారత్ జోడో యాత్ర మార్గం లేదో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరో 100 మంది ‘అతిథి యాత్ర’లు చేస్తారు. పాదయాత్ర ఉన్న రాష్ట్రాల నుంచి మరో 100 మంది ‘ప్రదేశ్ యాత్రికులు’ జతకూడుతారు. అంటే ప్రతిసారి 300 మంది పాదయాత్రికులు కచ్చితంగా ఉంటారు. రోజూ దాదాపు పాతిక కిలోమీటర్ల దూరం యాత్ర ముందుకెళ్తుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల -
సికింద్రాబాద్ ఆందోళనకారులపై పోలీస్ ఫైరింగ్
-
సైద్ధాంతికంగా కాంగ్రెస్ మేల్కొన్నట్లేనా?
కాంగ్రెస్ పార్టీ ‘సామాజిక న్యాయ సాధన ప్యానెల్’ చేసిన సిఫార్సులు దాని భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చెబుతున్నాయి. ఓబీసీల మద్దతుతో ఓబీసీ అభ్యర్థిని ప్రధానమంత్రిగా చేసిన బీజేపీని ఎదుర్కోవడానికి... ఓబీసీ వర్గాల అనుకూల పంథాను ఎంచుకోవడమే సరైన మార్గమని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లుంది. సంస్థాగతంగా పునర్నిర్మాణం కాకపోతే ఓబీసీలు పార్టీతో కలవరని కాంగ్రెస్‌కి ఆలస్యంగానైనా బోధపడింది. లౌకిక వాదం, బహుళత్వం, మైనారిటీ ప్రాధాన్యవాదం అనే పాత సైద్ధాంతిక ఎజెండా ఇక ఏమాత్రమూ ఓబీసీ ఓట్లను సాధించిపెట్టదని కాంగ్రెస్ అవగతమైంది. ఉదయ్‌పూర్‌లో ఇటీవలే ముగిసిన మేధోమథన సదస్సులో సామాజిక న్యాయ ప్యాకేజిని కాంగ్రెస్ తీసుకురావడం ఈ అవగాహనలో భాగమే. కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ వ్యూహం ఒక బలమైన ప్రయోజనాన్ని సాధించింది. రాజ స్థాన్లోని ఉదయపూర్‌లో ఇటీవలే మూడు రోజుల పాటు జరిగిన ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ లేదా నూతన మేధోమథన సదస్సులో సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, కె. రాజు నేతృత్వంలో ‘సామాజిక న్యాయ కమిటీ’ని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ కమిటీ పార్టీ పునర్నిర్మాణం కోసం పలు సామాజిక న్యాయ చర్యలను ప్రతిపా దించింది. మీడియా రిపోర్టులను బట్టి ఈ ప్యానెల్, పార్టీ నిర్మాణం లోని అన్ని స్థాయుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసిందని తెలుస్తోంది. పార్లమెంటు లోనూ, రాష్ట్రాల అసెంబ్లీలలోనూ ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. ఆలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో ‘కోటా లోపలి కోటా’ను సమర్థించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించాలని కూడా ఇది సిఫార్సు చేసింది. మరింత కీలకమైన విషయం ఏమిటంటే, ప్రైవేట్ రంగంలోనూ కుల ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పనను కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సాధన ప్యానెల్ సిఫార్స్ చేయడం! ఇది పాలక భారతీయ జనతా పార్టీకి మింగుడు పడని సమస్యే అవుతుంది. వాస్తవానికి ఓబీసీల ఓటు కారణంగానే బీజేపీ కేంద్రంలో రెండుసార్లు అధికారం లోకి వచ్చింది. ప్రైవేట్ రంగంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ఉనికిని మెరుగుపర్చడం వైపుగా బీజేపీ ఎలాంటి చర్యా తీసుకోలేదు. నిజానికి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రైవేటీకరణ కారణంగా ఉద్యోగరంగంలో అనేక కోతలు విధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), సామాజిక న్యాయ ప్యానెల్ సిఫార్సులను అప్పటికప్పుడు ఆమోదించ లేదు. సంస్కరణాత్మకమైన సామాజిక న్యాయ కార్యక్రమం పార్టీ ఆలోచనా తీరులో కనబడిందంటే ఇది దాని భవిష్యత్ రాజకీయాలను నిర్ణయించగలదు. ఇలాంటి సామాజిక న్యాయ ప్యాకేజిని కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ తీసుకురావడమే గొప్ప. అదేవిధంగా కుల ప్రాతిపదికన జనాభా గణన కోసం కాంగ్రెస్ పోరాడాలని సిఫార్సు చేసింది. దీన్ని బీజేపీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. లౌకికవాదం, వైవిధ్యత, బహుళత్వం, మతతత్వ వ్యతిరేకత వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా పార్టీ అధికారంలోకి రావాలనీ, వస్తుందనే భావన పట్ల కాంగ్రెస్ మేథోమథన బృందాలు ఇంతవరకు సానుకూలంగా ఉండేవి. కానీ శూద్ర ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజానీకం ఇలాంటి అమూర్త భావాలపై ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించినట్లుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీకే ఘనత దక్కుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ఒక్కరే ప్రజానేత, జనాకర్షక నేతగా ఉన్నారు. పైగా తన అంతర్గత వ్యవస్థాగతమైన డోలాయ మానం కారణంగా సామాజిక న్యాయ ఎజెండాపై బలమైన వైఖరి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా తడబడుతూ వచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు రాజ్యమేలింది. పీవీ నరసింహరావు అయిదేళ్లు, తర్వాత మన్మోహన్ సింగ్ పదేళ్లు దేశాన్ని పాలించారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సామాజిక న్యాయ వ్యతిరేక కులీనవర్గాల ఆధిపత్య పట్టులోనే ఉండిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కులీన నేతల్లో చాలామంది బోర్డ్ రూమ్ మేనేజర్లే తప్ప ఓట్లు రాబట్టేవారు కాదు. మన్మోహన్ సింగ్, పి. చిదంబరం, జైరాం రమేష్, మణి శంకర్ అయ్యర్, దివంగత అహ్మద్ పటేల్ వంటివారు ప్రభుత్వాన్నీ, పార్టీని మేనేజ్ చేసేవారు మాత్రమే కాదు... క్షేత్రస్థాయిలో మండల్ శక్తుల పట్ల వ్యతిరేక భావంతో ఉండే వారు. పార్టీలోని ఈ కులీన వర్గాలకు రాజ్యసభే అధికార రాజకీ యాల్లోకి వచ్చేందుకు మార్గంగా కనిపించేది. ఇప్పుడు ఆ మార్గం రెండేళ్లుగా మూసుకు పోయింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ విజయం తర్వాత (ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 414 ఎంపీ స్థానాలు చేజిక్కించుకుంది) కాంగ్రెస్ పార్టీ దాదాపుగా డూన్ స్కూల్ టీమ్‌గా మారిపోయింది. ఇది పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీసి నూతన జాతీయ నేతగా వీపీ సింగ్ పెరుగుదలకు దారితీసింది. 1991లో పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పటికీ కాంగ్రెస్‌ని ముందుకు తీసుకుపోగలిగే మాస్ లీడర్‌గా అయన ఎప్పుడూ లేరు. మెరిట్ సిద్ధాంతాన్ని బలపర్చిన రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు మండల్ ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. రాజీవ్ గాంధీ బద్ధశత్రువు వీపీ సింగ్ మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేశారు. దీన్ని రాజీవ్ గాంధీ, ఆయన కులీన బృందం ఇష్టపడలేదు. ఓబీసీ రిజర్వేషన్ని వీరు శక్తికొద్దీ వ్యతిరేకించారు. కాంగ్రెస్ కులీన బృందంలో ఒక్కరంటే ఒక్కరు కూడా శూద్ర ఓబీసీ, దళిత్, ఆదివాసీ నేపథ్యంలోంచి వచ్చిన వారు ఉండేవారు కాదు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ శూద్ర ఓబీసీ యువత, ప్రజల ఆకాంక్షలను గానీ, వారి బలాన్ని గానీ అంచనా వేయడంలో పొరపడ్డాయి. యూపీఏ పదేళ్ల పాలనలో (2004–2014) మరింతగా సంఘటితమైన మండల్ వర్గాలను సంతృప్తి పరిచేందుకు కొన్ని సానుకూల చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఏ మండల్ అనుకూల నేతకూ కాంగ్రెస్ చోటు ఇచ్చిన పాపాన పోలేదు. 2014 నాటికి గత పదేళ్ల పాలనా కాలంలో తామేం చేసిందీ గ్రామీణ భారత ప్రజానీకానికి సమర్థవంతంగా చెప్పగల నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ లేకపోయారు. భారతదేశ వ్యాప్తంగా చక్కగా వ్యవస్థీకృతమై ఉన్న ఆరెస్సెస్, బీజేపీతో పోరాడటానికి యువ రాహుల్ గాంధీపై మాత్రమే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధారపడింది. ఇదే సమయంలో మండల్ శక్తుల ప్రాధాన్యతను చక్కగా అర్థం చేసుకున్న బీజేపీ ఓబీసీ కార్డు ఉపయోగించి నరేంద్రమోదీని రంగంలోకి దింపింది. నరేంద్రమోదీ వికాసం, దాని వెనుకనే ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగినట్లయింది. సంస్థాగతంగా పునర్ని ర్మాణం కాకపోతే ఓబీసీలు పార్టీతో కలవరని కాంగ్రెస్‌కు బోధపడింది. శూద్ర ఓబీసీల సంఖ్యను బట్టి చూస్తే (మండల్ అంచనా ప్రకారం జనాభాలో 52 శాతం) వీరి సమస్యలను పట్టించుకోకుండా, ప్రస్తావించకుండా సాధారణ ఎన్నికల్లో గెలవడం అనేది నేటి రాజకీయాల్లో ఆలోచనకు కూడా సాధ్యం కాని విషయం అని చెప్పాలి. లౌకికవాదం, బహుళత్వం, మైనారిటీ ప్రాధాన్యవాదం అనే పాత సైద్ధాంతిక ఎజెండా ఇక ఏమాత్రమూ ఓబీసీ ఓట్లను సాధించిపెట్టదని కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది. సామాజిక న్యాయ శక్తుల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ మారుతుందేమో చూడాలి. తానూ, ఖుర్షీద్ నేతృత్వంలోని ప్యానెల్ తీసుకుంటున్న సామాజిక న్యాయ చర్యలను వ్యతిరేకించే గ్రూప్‌ని లైన్లో పెట్టడం రాహుల్‌కి చాలా కష్టమైన పనే అవుతుంది. మతతత్వ శక్తుల ప్రమాదంతో క్షీణించిపోతున్న భారతీయ వ్యవస్థల పరిరక్షణ కోసమైనా సరే, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయకోసం పోరాటం చేయాల్సి ఉంది. భారత రాజ్యాంగ సంవిధానాన్ని తిరిగి ప్రజాస్వా మీకరించాల్సి ఉంది. ఇది మాత్రమే దేశాన్ని ప్రస్తుత అంధకార మార్గం నుంచి వెనక్కు మళ్లిస్తుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకొస్తుంది. ఉదయ్‌పూర్ సదస్సులో కాంగ్రెస్ ఆ మార్గాన్ని ప్రారంభించడం మంచి పరిణామమే అని చెప్పాలి. వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఈ చింత తీరేదెట్లా?
చింతలు ఎక్కువైనప్పుడు చింతన తప్పదు. సమస్యలతో సతమతమవుతున్న శతాధిక వర్ష కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు ఆ పనే చేసింది. కానీ, రాజస్థాన్‌లోని ఉదయపూర్ చింతన్ శిబిర్‌లో కొంత దృఢ నిశ్చయంతో, కొన్ని నవ సంకల్పాలు చెప్పుకున్నా... కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న చింతలు మాత్రం తీరేలా కనిపించడం లేదు. శిబిరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నామని ఊపిరి పీల్చుకొనే లోగా, ఆ పార్టీకి ఒకటికి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నికలు రానున్న గుజరాత్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్, ఇటీవలే ఎన్నికలు ముగిసిన పంజాబ్‌లో పార్టీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ ఇద్దరూ రోజుల తేడాలో పార్టీకి గుడ్‌బై చెప్పారు. సునీల్ వెంటనే బీజేపీ కండువా కప్పుకుంటే, హార్దిక్ రేపోమాపో ఆ పనే చేయనున్నట్టు వార్త. ఇవి చాలదన్నట్టు రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజా జోస్యం. ఇవేవీ అనూహ్యం కాకున్నా, గాలి ఎటు వీస్తోందో అర్థమై, భవిష్యత్తు కళ్ళ ముందే కనిపిస్తూ కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. బలమైన ఏకవ్యక్తి నాయకత్వం కింద ఒక పార్టీయే దేశ రాజకీయాలను శాసించడం మంచిది కాదని 1970, 80లలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి. కానీ, బలహీన అజెండా తప్ప మూడు రోజుల మథనంతో కాంగ్రెస్ సాధించినదేమిటంటే సంతృప్తికర మైన సమాధానం లేదు. సమస్యలున్నట్టు గుర్తించారన్న ఊరటే తప్ప, సమగ్రమైన పరిష్కారం కోసం ప్రయత్నం కనిపించదు. యాభై ఏళ్ళ లోపు వారికి సీట్లలో రిజర్వేషన్, వారసులకు సీట్ల కేటాయింపులో పరిమితి విధింపు, పార్టీ ఆఫీస్ బేరర్లకు నిర్ణీత పదవీకాలం, వివిధ సలహా సంఘాల ఏర్పాటు లాంటి పై పై చర్యలతో పార్టీ ఎదుర్కొంటున్న పెను సంక్షోభాన్ని నివారించడం అయ్యే పనీ కాదు. వరుస పరాజయాలు, ‘జీ–23’గా పేరుపడ్డ పార్టీ సీనియర్ల ధిక్కారస్వరం, ప్రశాంత్ కిశోర్ చూపిన చేదు నిజాలు, ఇచ్చిన సలహాలు – ఇవేవీ కాంగ్రెస్‌ను సుప్త చేతనావస్థ నుంచి ఇంకా కదిలించినట్టు లేవు. నవ తరాన్ని ఆకట్టుకొనే ప్రయత్నాలు, పార్టీకి జవజీవాలిచ్చే ఆలోచనలు అధిష్ఠానం చేస్తోందా అంటే అనుమానమే. సంక్షేమ పథకాలు, సంస్థాగతంగా ఎస్సీ – ఎస్టీ – ఓబీసీలకు కోటాలు, యాత్రల లాంటివి ప్రకటించినా, అవి ఇప్పటికే అరిగిపోయిన అస్త్రాలు. మోదీ రెండోసారి గెలవ గానే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకున్నాక ఇప్పటి దాకా కాంగ్రెస్ దాదాపు చుక్కాని లేని నావే. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కోరి మరీ తనను కాంగ్రెస్‌లోకి తెచ్చుకున్న రాహుల్ పైనే పరోక్ష విమర్శలతో యువ పాటీదార్ నేత హార్దిక్ పటేల్ తన రాజీనామా సమర్పిం చడం గమనార్హం. పార్టీ తప్పకుండా అధికారం నిలబెట్టుకుంటుందని ఏడాది క్రితం అనుకున్న పంజాబ్ పీఠాన్ని లేనిపోని నాయకత్వ మార్పులతో చేజేతులా పోగొట్టుకున్న ఘనత కాంగ్రెస్ యువ అధినాయకత్వానిదే. పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో రాహుల్ కానీ, యూపీలో ప్రియాంక కానీ పార్టీని కనీసం గౌరవనీయ స్థానంలో నిలపలేకపోవడం నెహ్రూ వారసుల వైఫల్యం. రాజకీయాలు పార్ట్‌టైమ్ ఉద్యోగం కాదనీ, కష్టపడితేనే ఫలితాలొస్తాయనీ వారికింకా అర్థమైనట్టు లేదు. కాంగ్రెస్‌కు కష్టాలు కొత్త కావు. కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలు మాత్రం జీవన్మరణ సమస్యే. ఆ లోగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రీ–ఫైనల్స్. 2014లో 44, ఆ తర్వాత 2019లో 52 స్థానాలే గెలిచి, గడచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జాతీయస్థాయిలో ఆ పార్టీ ఓట్ షేర్ 1984లో యాభై ఏళ్ళ అత్యధికమైన 49.1 శాతానికి చేరింది. ఇప్పుడది 19 శాతం దగ్గర తారట్లాడుతోంది. గత 8 ఏళ్ళలో జరిగిన 50 అసెంబ్లీ ఎన్నికల్లో 37 ఎన్నికల్లో ఆ పార్టీ పరా జయం పాలైంది. ప్రస్తుతం రెండే రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ స్వయంగా అధికారంలో ఉంది. రానున్న కాలం పార్టీకి అత్యంత కీలకమనేది అందుకే. 2019 ఎన్నికల్లో 170 స్థానాల్లో వరుసగా 2 సార్లు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైనవారినే అభ్యర్థులుగా ఎంచుకోవడం లాంటి తప్పులెన్నో కాంగ్రెస్ విజయావకాశాల్ని దెబ్బతీశాయి. ఈసారైనా అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. సంస్థాగత బలహీనతలు, ఎదురుగా ఉన్న సవాలు అన్నీ తెలిసినా – కాంగ్రెస్ తగినరీతిలో స్పందిస్తున్న దాఖలా లేదు. ఏళ్ళూ పూళ్ళూ గడుస్తున్నా పార్టీని పీడిస్తున్న సమస్యల్లో మార్పు లేదు. ప్రశాంత్ కిశోర్ ఆ మధ్య గణాంకాలతో సహా ఎత్తిచూపినవీ సరిగ్గా అవే. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. బలమైన ప్రత్యర్థిని ఓడించాలంటే, వ్యూహం ఉండాలి. ఉమ్మడి ప్రత్యర్థిపై పోరుకు బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలన్న వాస్తవాన్ని నిరాకరిస్తే నష్టమే. సంకల్పమే కాదు... నిరంతర శ్రమ, సమష్టి తత్త్వం అవసరం. అధిష్ఠానం నుంచి అడుగున కార్యకర్త దాకా పేరుకుపోయిన జడత్వాన్ని వదిలించుకోవాలి. పార్టీలు, విదేశీ పర్యటనల ఇమేజ్‌ని చెరుపుకొని, అధినేతలూ త్యాగాలకు సిద్ధపడితే పార్టీని నిలబెట్టవచ్చు. ఇవాళ్టికీ దేశంలో బీజేపీకి బలమైన జాతీయ ప్రతిపక్షంగా తమకున్న సానుకూలతను కాంగ్రెస్ ఉపయోగించుకోవచ్చు. అందుకు కొత్త తరంతో, క్రొంగొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. వారసత్వం కన్నా ప్రతిభకు పట్టం కట్టాలి. దానికి ఎవరెంత సిద్ధంగా ఉన్నారన్నదే ప్రశ్న. ఆ దిశగా తొలి అడుగులు పడితే ఏ చింతన శిబిరాలైనా సఫలమైనట్టు! -
మళ్లీ రచ్చకెక్కిన రఫేల్ గొడవ
ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధవిమానాల తయారీసంస్థ డసాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ ‘రఫేల్’జెట్ విమానాలను కొనుగోలు చేసిన వ్యవహారం మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. మీ హయాంలోనే అవినీతి జరిగిందంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం మళ్లీ మొదలుపెట్టాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలం(2007–12)లో సుశేన్ మోహన్ గుప్తా అనే మధ్యవర్తికి 75 లక్షల యూరోలు(దాదాపు రూ.65 కోట్లు) ముడుపులుగా అందాయని ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధనాత్మక జర్నల్ ‘మీడియాపార్ట్’తాజాగా బహిర్గతం చేయడం బీజేపీకి కొత్త విమర్శనాస్త్రంగా మారింది. యూపీఏ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి 36 ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం 2016 సెప్టెంబర్‌లో రూ.59వేల కోట్లతో మోదీ సర్కార్, డసాల్ట్ ఏవియేషన్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెల్సిందే. ‘ఐ నీడ్ కమిషన్(ఐఎన్‌సీ)గా మార్చుకోండి: బీజేపీ ఎద్దేవా న్యూఢిల్లీ: ‘రఫేల్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ముడుపుల చెల్లింపులు మీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. బహూశా ఈ చెల్లింపుల నగదు మొత్తాలతో కాంగ్రెస్, గాంధీల కుటుంబాలు సంతృప్తి చెందలేదేమో. అందుకే కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చర్చలు విఫలమయ్యాయి’అని కాంగ్రెస్‌పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు చేశారు. మీడియాపార్ట్ కథనం నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ముడుపులు తీసుకునే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ) పేరును ఇకపై ఐ నీడ్ కమిషన్(ఐఎన్‌సీ)గా మార్చాలి. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా అందరూ కమిషన్లు అడిగేవారే ’అని సంబిత్ విమర్శించారు. రఫేల్ కొనుగోళ్లలో మోదీ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ ఇన్నాళ్లూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు, చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు అని మీడియాపార్ట్ కథనంతో తేలిపోయిందని సంబిత్ స్పష్టంచేశారు. మీడియాపార్ట్ తాజాగా వెల్లడించిన వాస్తవాలపై రాహుల్ మాట్లాడాల్సిందేనని సంబిత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతిపై మీ ప్రభుత్వమెందుకు దర్యాప్తు చేయలేదు? అన్న మీడియా ప్రశ్నకు సంబిత్ సమాధానమిచ్చారు. ‘ఆ మధ్యవర్తి సుశేన్ గుప్తాను ఇదివరకే అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్‌చేసింది. ఈ అంశాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకోవాలి’అని ఆయన అన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు. సుప్రీంకోర్టు, కాగ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి కూడా’అని ఆయన చెప్పారు. మీరెందుకు దర్యాప్తు చేయట్లేదు?: కాంగ్రెస్ ఎదురుదాడి కాంగ్రెస్ హయాంలోనే ముడుపులు చేతులు మారాయన్న బీజేపీ వాదనలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ‘అదే వాస్తవమైతే బీజేపీ హయాంలో కేసు దర్యాప్తు ఎందుకు చేయలేకపోయారు? నిజాలను దాచే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ‘రహస్య కమిషన్లు అందాయని 2018లోనే సీబీఐ, ఈడీలకు సమాచారం ఉంది. అయినా ఆ దర్యాప్తు సంస్థలు దర్యాప్తునకు ఎందుకు మొగ్గుచూపలేదు? 2018లోనే అవినీతిపై ఇద్దరు బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ఒక సీనియర్ లాయర్ సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కానీ, కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకే బీజేపీ సర్కార్.. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను రాత్రికి రాత్రి పదవి నుంచి తొలగించింది. తమ అవినీతి బయటపడుతుందనే కేంద్రం దర్యాప్తునకు ఆదేశించలేదు. బీజేపీ ‘ఆపరేషన్ కవర్ అప్’కొనసాగిస్తోంది. అత్యంత ఎక్కువ ధరకు జెట్లను మోదీ సర్కార్ కొనుగోలుచేయడంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పర్యవేక్షణతో దర్యాప్తు జరిపించాలి. జేపీసీకి మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోంది? ’అని ఖేరా ప్రశ్నించారు. నిజం మనవైపే.. భయపడకండి: రాహుల్ అవినీతిమయ మోదీ ప్రభుత్వంపై పోరులో భయపడాల్సిన పని లేదని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ధైర్యం చెప్పారు. ‘ప్రతీ అడుగులో నిజం మనవైపే ఉన్నపుడు, మనం భయపడాల్సిన పనే లేదు. ‘ఆగకండి. అలసిపోకండి. భయపడకండి’అంటూ #RafaleScam హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్ గాంధీ మంగళవారం హిందీలో ట్వీట్‌చేశారు. రఫేల్ వివాదానికి జేపీసీ దర్యాప్తే అసలైన పరిష్కారమని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. -
ఫలితాలు అందరికీ పాఠాలే!
ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలను నిర్దేశిస్తాయా? అంటే, అవునని చెప్పడానికి లేదు. కాదనడానికీ వీల్లేదు! కొన్ని సంకేతాలను స్వీకరించడానికి, పరిస్థితుల్ని విశ్లేషించడానికి, కొంత అన్వయించడానికీ పనికొస్తాయనడంలో సందేహం లేదు. 13 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఇలా చూడాల్సిందే తప్ప లోతుగా తడిమి.. ఇవే ప్రామాణికం, ఇలాగే జరగొచ్చు అని సిద్దాంతీకరించలేం! హిమాచల్‌ప్రదేశ్‌లో ఫలితాలు పాలకపక్షమైన బీజేపీకి, అస్సాం, పశ్చిమబెంగాల్ ఫలితాలు విపక్ష కాంగ్రెస్ ఆత్మపరిశీలనకు పని కొస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ఒంటరి ఫలితాల్ని సాధారణీకరించలేం! స్థానికంగా నెలకొన్న రాజకీయ–సామాజిక పరిస్థితుల దృష్టి కోణం నుంచి విడిగా చూడటమే మంచిది. 29 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల మిశ్రమ ఫలితాలతో ప్రధాన పార్టీల్లో అంత ర్మథనం మొదలయింది. ఇతర పార్టీలు కూడా వారి స్థితిని గమనిస్తూ, తమ పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల యాత్రలో తమ భవిష్యత్తు ప్రణాళికకు ఈ సంకేతాలు దోహదం చేయొచ్చన్నది యోచన. రెండేళ్లలో వచ్చే పలు శాసనసభల ఎన్నికలు, ఇతర ఉపఎన్నికల్లో వెల్లడయ్యే సంకేతాలు రాజకీయ వ్యూహ–ప్రతివ్యూహాలకు దోహదపడతాయి. దేశంలో బలమైన, ప్రతిపక్షంలేని పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై బండినడక అని బీజేపీ నిమ్మ ళంగా ఉండటానికి వీల్లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 3 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న విపక్ష కాంగ్రెస్‌కే ఈ ఫలితాలు ఒకింత విస్మయం కలిగించి ఉంటాయి. ప్రస్తుత పాలకులపై ప్రజలకు విశ్వాసం సడలినపుడు, దించి తీరాల్సిందే అని దృఢంగా వారు నిర్ణయించుకున్నపుడు... విపక్ష బలం, సామర్థ్యం లెక్కలోకే రాదని మరోమారు స్పష్టమైంది. అయిదేళ్లకోసారి ప్రత్యామ్నాయానికి పట్టంగట్టే కొండప్రాంత రాష్ట్రంగా హిమాచల్ రాజకీయ చరిత్ర మన కళ్లముందున్నా... బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రం, సీఎం జైరామ్ ఠాకూర్ సొంత నియోజకవర్గం ‘మండి’ లోక్‌సభ స్థానాన్ని పోగొట్టుకోవడం కలతకు కారణమే! అంతకంటే ముఖ్యంగా, అయిదారు మాసాల్లో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో ప్రత్యర్థి కాంగ్రెస్ 48.9 శాతం ఓట్లు సాధిస్తే, తాము 28.1 శాతానికి పడిపోవడం బీజేపీకి మింగుడుపడంది! మిత్రులతో కలిసి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదుగుతోందనడానికి అస్సాం, మెఘాలయ, మిజోరాం ఉపఫలితాలు సంకేతమే! పోటీ జరిగిన ఏడు స్థానాల్లో గెలిచారు. కానీ, కేంద్ర నాయకత్వమెంత పటిష్టంగా ఉన్నా.... స్థానిక నాయకత్వం బలంగా ఉండటం, లేకపోవడాన్ని బట్టే ఫలితాలుంటాయనేది బీజేపీ నేర్చుకోవాల్సిన కొత్తపాఠం! హిమంత బిశ్వశర్మ అస్సాంలో, శివ రాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో సాధించిన ఫలితాలు ఇతర సీఎంలు జైరామ్ ఠాకూర్ (హిమా చల్), బస్వరాజ్ బొమ్మై (కర్ణాటక) సాధించలేకపోవడాన్ని గుర్తెరగాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్‌కు నువ్వా–నేనా అన్నంత పోటీ ఇచ్చిన పశ్చిమబెంగాల్లో అన్ని స్థానాల్లో ఓటమి, అంతకు మించి భారీ ఓట్ల వ్యత్యాసాలు కనువిప్పే! ‘హిందుత్వ’ బలంగా పనిచేసే హిందీ రాష్ట్రాల్లో నష్టపోయి, ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగవడం లాభసాటి వ్యవహారమేం కాదు! ఈ గ్రహింపు వల్లేనేమో, ఈశాన్య భారతంతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ నాయకత్వం కేంద్రీకరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైఎస్సార్సీపీ లాగా సానుకూల ఓటు సాధించగలిగితే గొప్పే! 2024 సాధారణ ఎన్నికల నాటికి, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉండే ఆ పార్టీ, ఎన్ని రాష్ట్రాల్లో సభాకాలం మూడు, నాలుగేళ్లు దాటుతోందో చూసుకొని జాగ్రత్త పడాలి. కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత కలిస్తే అది మరింత ప్రమాదం. పాలనపై వ్యతిరేకత, నెరవేరని హామీలు, «నిత్యావసరాల ధరల అసాధారణ పెరుగు దల, నిరుద్యోగం, వ్యావసాయిక అశాంతి, కోవిడ్‌తో మందగించిన ఆర్థిక స్థితి... ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేశాయని, చేస్తాయనీ తాజా ఫలితాల నుంచి గ్రహించాలి. దాదర్–నాగర్–హవేలీలో ఇంకా ఫలితం వెలువడక, తాము ఆధిక్యతలో ఉన్నపుడే, ‘2024 ఢిల్లీ పీఠానికి రహదారి ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొదలవుతోంది’ అన్న శివసేన వ్యాఖ్య కొంచెం అతిశయోక్తే! కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూటమికి చెందని ఇతర పక్షాలు ఒక నిజం గ్రహిం చాలి. తాము ఏకం కాకుండా బీజేపీని ఎదుర్కోవడం, వారి ఎన్నికల ఆధిపత్యాన్ని సవాల్ చేయడం దుస్సాధ్యమే! ప్రాంతీయ శక్తులున్న చోట కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రుజువైంది. బీహార్‌లో కాంగ్రెస్ నాలుగో స్థానం ఆర్జేడీ చలువే! చిన్న భాగస్వామిగా తమతో కాంగ్రెస్ కలిసిరావాల్సిన విధిలేని పరిస్థితిని పాఠంగా నేర్పింది. ఆర్జేడీ–కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే, జేడీ(యూ) అంత తేలిగ్గా రెండుచోట్ల నెగ్గేది కాదేమో? ఇక ప్రాంతీయ శక్తులేవీ బలంగాలేని రాజస్తాన్‌లో మూడు, నాలుగు స్థానాల్లోకి జార డంపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాహుల్ నాయకత్వ సామర్థ్యం, శరద్‌పవార్–మమత– మాయావతి వంటి నేతల ఆధిపత్యవాదాలు తమకు అయాచిత వరాలని బీజేపీ భావించొచ్చు! వారంతా స్పర్థలు వీడి, బలమైన ఐక్యకూటమిగా ఏర్పడితే ఫలితాలు భిన్నంగానూ ఉండొచ్చు! విభిన్న పార్శా్వలను తడిమే చర్చకు ఈ ఉపఫలితాలు తెరలేపాయి! -
భారత రాజ్యాంగ రచన
సాధారణంగా రాజ్యాంగ రచనకు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందులో ఒకటి ఆ దేశ పార్లమెంటుతో రాజ్యాంగాన్ని రూపొందించడం కాగా, రెండోది ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ లేదా సంస్థను ఏర్పాటు చేసి దానికి రాజ్యాంగ రచనా బాధ్యత అప్పగించడం. ►మొదటిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దేశం అమెరికా. ఆ దేశంలో 1787లో జరిగిన ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. ►ఫ్రాన్స్‌లో(1789లో) ‘కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ’ని ఏర్పాటు చేసి రాజ్యాంగ రచన చేశారు. తొలి డిమాండ్ ‘భారత ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్’ అనే భావన.. స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ముఖ్యమైన అంతర్గత డిమాండ్‌గా ఉంది. మొదటిసారిగా ఈ డిమాండ్‌ను భారత జాతీయ కాంగ్రెస్ చేసింది. ఈ మేరకు 1918 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ‘స్వయం నిర్ణయాధికారం’ అనే భావనతో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ► మహాత్మాగాం«ధీ 1922, జనవరి 5న ‘యంగ్ ఇండియా’ పత్రికలో ‘స్వరాజ్ అనేది బ్రిటిషర్లు ఇచ్చే ఉచిత కానుక కాదు. అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ’ అని పేర్కొన్నారు. ► 1927, మే 17న జరిగిన బాంబే సమావేశంలో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ రచన, దాని ఆవశ్యకతను ప్రస్తావించారు. ఇందులో భాగంగానే అఖిలపక్ష కమిటీ 1928, మే 19న రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ‘నెహ్రూ రిపోర్ట్’ అంటారు. దీన్ని భారతీయులు సొంతంగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. ► ప్రముఖ అభ్యుదయ, మానవతావాదైన ఎం.ఎన్.రాయ్ 1934లోనే (మొదటిసారిగా) రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని ప్రకటించారు. ఆ తర్వాత 1935లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసింది. ►1942లో క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అనంతరం 1946లో కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం, ఇతర ప్రక్రియలను నిర్ణయించారు. 1946 జూలై, ఆగస్టు నెలల్లో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. ► ప్రతి ప్రావిన్స్ నుంచి దాదాపు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడి చొప్పున రాజ్యాంగ పరిషత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ►బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోని మూడు ప్రధాన వర్గాలైన ముస్లిం, సిక్కు, జనరల్ కేటగిరీ ప్రజలకు జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించారు. ► రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో 292 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. వీరిని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు లేదా గవర్నర్ ప్రావిన్స్‌ల నుంచి ఎన్నికైన శాసనసభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకున్నారు. ఆ సమయానికి దేశంలో మొత్తం 11 ప్రావిన్స్‌లు ఉన్నాయి. అవి.. మద్రాస్, బాంబే, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఒరిస్సా, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధ్, బెంగాల్, అస్సాం. ►93 మంది ప్రతినిధులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారు. ►నలుగురు సభ్యులను చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్థాన్ నుంచి తీసుకున్నారు. దాదాపు అన్ని (అప్పట్లో ఉన్న) రాజకీయ పార్టీలు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలో పాల్గొన్నాయి. అవి సాధించిన స్థానాలు.. ►జాతీయ కాంగ్రెస్ – 208 ►ముస్లిం లీగ్ – 73 ►యూనియనిస్ట్ – 1 మతాలు, సామాజిక వర్గాల వారీగా సభ్యుల సంఖ్య ► హిందువులు – 160 ►దళితులు – 33 ►సిక్కులు – 5 ►ఆంగ్లో ఇండియన్లు – 3 ► క్రిస్టియన్లు – 7 ►మహిళలు – 15 ►పారశీకులు (పార్సీలు)– 3 ►ముస్లింలు – 3 ప్రత్యేక వివరణ ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్‌తో భారత రాజ్యాంగ పరిషత్ నుంచి వైదొలిగింది. అనంతరం దేశ విభజన జరగడంతో రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. ఇందులో 229 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నిక కాగా, 70 మంది స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన వారున్నారు. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన వివిధ వర్గాల్లోని ప్రముఖులు: ►ముస్లింలు: మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా. ►సిక్కులు: సర్దార్ బలదేవ్ సింగ్, హుకుం సింగ్ ►మైనారిటీలు: హెచ్.సి.ముఖర్జీ ►యూరోపియన్లు: ఫ్రాంక్ ఆంథోని ► అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు: బి.ఆర్. అంబేద్కర్ ►కార్మిక వర్గాలు: బాబూ జగ్జీవన్ రామ్ ► పార్సీలు: హెచ్.పి.మోదీ ►అఖిల భారత మహిళా సమాఖ్య: హన్సా మెహతా ►హిందూ మహాసభ: డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఎం.ఆర్.జయకర్ మహిళా సభ్యులు దుర్గాబాయి దేశ్‌ముఖ్, రాజకుమారి అమృత్‌కౌర్, విజయలక్ష్మి పండిట్, సరోజిని నాయుడు, హన్సా మెహతా, అమ్ము స్వామినాథన్, అన్నీ మాస్కెరీన్, బేగం అజీజ్ రసూల్, ద్రాక్షాయణి వేలాయుధన్, కమలా చౌదరీ, లీలా రే, మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రేణుకా రే, సుచిత్రా కృపలానీ తదితరులు. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన తెలుగు వారు: టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్.జి.రంగా, వి.సి.కేశవరావు, ఎం.తిరుమలరావు, రామకృష్ణ రంగారావు (బొబ్బిలి) తదితరులు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ► రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946, డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగింది. మొదటి సమావేశానికి 211 మంది (9 మంది మహిళా సభ్యులతో సహా) సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశం డిసెంబర్ 12 వరకు కొనసాగింది. సమావేశం తొలి రోజున (డిసెంబర్ 9న) డాక్టర్ సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా (ఫ్రెంచ్ సంప్రదాయం ప్రకారం), ఫ్రాంక్ అంథోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జె.బి.కృపలానీ 1946 డిసెంబర్ 11న డాక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి హెచ్.సి.ముఖర్జీ (పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత వి.టి. కృష్ణమాచారి కూడా రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ►అంతర్జాతీయ న్యాయవాది.. బెనగల్ నరసింగరావును రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఆయన బర్మా (ప్రస్తుత మయన్మార్) రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు. ఆశయాల తీర్మానం ఆశయాల తీర్మానాన్ని 1946, డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించారు. ఇది రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలంగా నిలిచింది. ఆశయాల తీర్మానం.. ప్రవేశికకు ప్రధాన ఆధారం. ఈ తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 1947, జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ కమిటీలు రాజ్యాంగ పరిషత్‌లో వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 7 ఉప కమిటీలు, 15 మైనర్ కమిటీలను నియమించారు. ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైనది – డ్రాఫ్టింగ్ (ముసాయిదా) కమిటీ. 1947, ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ సమావేశాలు, చర్చలు ►ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్‌లను తయారు చేసింది. రాజ్యాంగ ముసాయిదాను 1948 ఫిబ్రవరి 21న ప్రచురించారు. రాజ్యాంగ ప్రతిపై 7,635 సవరణలను ప్రతిపాదించగా 2,473 సవరణలు చర్చకు వచ్చాయి. ►రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాను 115 రోజుల పాటు పరిశీలించింది. అనంతరం 1949, నవంబర్ 26న ఆమోదించి.. చట్టంగా మార్చింది. ►రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మొత్తం 11 సమావేశాలు జరిగాయి. భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 1950, జనవరి 24న జరిగింది. దీనికి 284 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నూతన రాజ్యాంగం ప్రకారం గణతంత్ర భారత ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు. భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే గణతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తారు. ►రాజ్యాంగ అమలు తేదీ: జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడం వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. నెహ్రూ అధ్యక్షతన లాహోర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం (1929, డిసెంబర్ 31) జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించారు. రాజ్యాంగ పరిషత్ ఇతర విధులు భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనతోపాటుగా కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది. అందులోని ముఖ్యాంశాలు: ►1947, జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది. ►రాజ్యాంగ పరిషత్ కేంద్ర శాసనసభగా కూడా పనిచేసింది. స్వతంత్ర శాసనసభగా 1947, నవంబర్ 17న సమావేశమై మొదటి స్పీకర్‌గా జి.వి.మౌలాంకర్ను ఎన్నుకుంది. ►భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఏనుగును గుర్తించింది. ►కేంద్ర ప్రభుత్వ భాషగా దేవనాగరి లిపిలో ఉన్న హిందీని 1949, సెప్టెంబర్ 14న ఆమోదించింది. ►కామన్వెల్త్ 1949 మేలో «భారత సభ్యత్వాన్ని ధ్రువీకరించింది. ►1950, జనవరి 24న జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ ముఖ్య కమిటీలు, అధ్యక్షులు ముసాయిదా కమిటీ రాజ్యాంగ పరిషత్‌లో అతి ముఖ్యమైన, అతిపెద్ద కమిటీ. ►ముసాయిదా కమిటీ సభ్యుల సంఖ్య– 6 ►బి.ఆర్.అంబేద్కర్ (చైర్మన్) ►సభ్యులు: ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కె.ఎం. మున్షీ, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు (బి.ఎల్.మిట్టల్ అనారోగ్య కారణంగా రాజీనామా చేయడంతో ఆ స్థానంలో సభ్యునిగా వచ్చారు), టి.టి.కృష్ణమాచారి (డి.పి.ఖైతాన్ మరణించడంతో ఆ స్థానంలో వచ్చారు). సబ్ కమిటీలు కమిటీ పేరు చైర్మన్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జె.బి.కృపలానీ మైనారిటీల సబ్ కమిటీ హెచ్.సి.ముఖర్జీ ఈశాన్య రాష్ట్రాల గోపీనాథ్ హక్కుల కమిటీ బోర్డోలాయ్ ప్రత్యేక ప్రాంతాల కమిటీ ఎ.వి.టక్కర్ బి. కృష్ణారెడ్డి డైరెక్టర్, క్లాస్–వన్ స్టడీ సర్కిల్ -
నెహ్రూ నాటి స్ఫూర్తి నేడేది?
సమకాలీనం 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించింది. కానీ, ‘‘అంకెలున్నాయి. పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతమాత్రాన మేం ప్రభుత్వాన్ని పరిమిత రాజకీయ దృష్టితో చూడటంలేదు. ఇది అందరి ప్రభుత్వం, పార్టీలకతీతంగా జాతీయ ప్రభుత్వంగానే పరిగణిద్దాం. పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న దేశ ప్రజల మనోభావాలు ప్రతిబింబించేలా మనమంతా కలసి మహాన్ భారత్‌ను ఆవిష్కరిద్దాం’’ అని నెహ్రూ సభ్యుల భావోద్వేగాల మధ్య ప్రకటించారు. ఆ స్ఫూర్తి నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరవడింది. 1 2 4 8 16 ....? (తదుపరి ఏంటి?) ఇది బ్యాంకింగ్ రంగమో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోనో ‘ఆప్టిట్యూడ్ టెస్ట్’ ప్రశ్నలా లేదూ? ఒక తెలుగు జాతి, రెండు రాష్ట్రాలు, నాలుగు చట్టసభలు, ఎనిమిది పార్టీలు, పదహారు ప్రజా సమస్యలు, ...........? (ఫలితం ఏంటి?) ఇది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాజకీయ పక్షాల ‘ఆటిట్యూడ్’ను టెస్ట్ చేసే ప్రశ్నలా ఉంది కదూ! అవును. ఇప్పుడదే సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. చట్టసభల్లో రాజ కీయపక్షాల వైఖరి ప్రజాహితంలో ఉందా? అన్న ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల మెదళ్లను తొలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి, రెండు చోట్లా కొత్త ప్రభుత్వాలు కొలువుతీరి 150 రోజులు దాటింది. అంతకుముందు, ముఖ్యంగా ఏడాదిపాటు ప్రత్యేక-సమైక్య వాదనలతో రాష్ట్రం అట్టుడికి అటు, ఇటు ఇరుప్రాంత ప్రజల్లోనూ భావోద్వేగాలు మిన్నంటాయి. అందరిలోనూ అనుమానాలు, అపోహలే కాదు ఆశలు, ఆకాం క్షలు కూడా తారస్థాయికి చేరాయి. ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాల వైపు ప్రజలు ఆశగా చూశారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలుగాని, రెణ్ణెల్ల కింద జరిగిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గాని ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకొని వారి అంచనాల్ని ప్రతి బింబించేలా మాత్రంలేవు. ఉమ్మడి నిర్ణయాలతో ప్రజలకు ప్రయోజనం కలి గించే యోచనకన్నా రాజకీయ ఆధిపత్య ధోరణే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్తగా రూపుదాల్చిన రెండు రాష్ట్రాల్ని, తొలి ప్రభుత్వాలుగా తమదైన పంథాలో తీర్చిదిద్దుకోవడానికి లభించిన గొప్ప అవకాశాన్ని ఈ ఆధిపత్యపోరులో చేజార్చుకుంటున్నాయి. సంకుచిత రాజకీయ దృష్టి కోణంతో యోచించే పరి మితుల చట్రం నుంచి బయటపడలేకపోతున్నాయి. తాము అనుసరించేదే సరైన బాట అని చెప్పుకునే ఎవరి వాదన వారికి ఉండవచ్చు! కానీ, అంతిమం గా చట్టసభల ఔన్నత్యాన్ని నిలిపి, ప్రజాస్వామ్యపు పరమ లక్ష్యాన్ని సాధించే దిశలో మాత్రం నడక సాగటం లేదు. ఆరు దశాబ్దాల కింద మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో అన్నమాటల వెనుక స్ఫూర్తిని మనమి ప్పుడు గుర్తుతెచ్చుకోవాలి. 1952 ఎన్నికలప్పుడు అన్నీ తానై నెహ్రూ దేశవ్యా ప్తంగా ప్రచారం చేశారు. నలభై వేల కిలోమీటర్ల మేర పర్యటించి మూడున్నర కోట్ల మందినుద్దేశించి ప్రసంగాలు చేశారు. 489 లోక్‌సభ స్థానాలకుగాను 364లో గెలిచినా... ‘‘అంకెలున్నాయి. పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంత మాత్రాన మేం ప్రభుత్వాన్ని పరిమిత రాజకీయ దృష్టితో చూడటం లేదు. ఇది అందరి ప్రభుత్వం, పార్టీలకతీతంగా జాతీయ ప్రభుత్వంగానే పరిగణిద్దాం. పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న దేశ ప్రజల మనోభావాలు ప్రతిబింబిం చేలా మనమంతా కలసి మహాన్ భారత్‌ను ఆవిష్కరిద్దాం’’ అని సభికుల భావోద్వేగాల మధ్య ప్రకటించారు. ఆ స్ఫూర్తి నేడు కొరవడింది. తెలంగాణలోనూ తేలిపోతోంది! శాసనసభ తొలి సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ‘ప్రతి కీలక విషయంలోనూ అఖిలపక్షం నిర్వహించి పరిష్కారం కనుగొంటామ’న్నారు. ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తప్ప మరే అంశంలోనూ అఖిలపక్ష భేటీ జరగలేదు. బడ్జెట్ సమావేశాల తొలి రెండు, మూడురోజులు ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపించినా, కడకు రాజకీయ ఆధిపత్య పోరుకే పాలక-ప్రతిపక్ష టీడీపీలు యత్నిస్తున్నాయని తేటతెల్లమైంది. ఇప్పటివరకు కాంగ్రెస్ సంయమనంతోనే ఉంది. ప్రతిపక్షాల్ని కలుపుకొని పోతున్న భావన కలిగించడానికి ముఖ్యమంత్రి కొంత యత్నించారు. ‘పెద్దలు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, మిత్రుడు రేవంత్‌రెడి’్డ అని సంబోధిస్తూ వ్యక్తిగతంగా సభలో కొంత సాన్నిహిత్యం కనబరచినా, పార్టీలపరమైన వైఖరి మాత్రం ఎడ మొగం పెడమొకంగానే ఉంది. మంత్రి హరీష్‌రావు కూడా తెలివిగా, ‘పద్ధతులు తెలియకుంటే ఎలా? కావాలంటే సీనియర్లు గీతక్క, అరుణక్కలను అడిగి తెలుసుకోండి’ అని తెలుగుదేశం జూనియర్ సభ్యులకు చెబుతూ విపక్ష సభ్యుల మధ్య స్పర్థను రగిలిస్తున్నారు. ముఖ్యమంత్రి కూతురైన ఎం.పి.పై వచ్చిన అభియోగాలపై రెండు రోజులు సభా సమయాన్ని వృధాచేయడం, కడకు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం పాలకపక్ష ఏకపక్ష ధోరణికి నిదర్శనం. విపక్షం చేసిన అభియోగం తప్పయితే, సరైన సమాచారమిచ్చి అది తప్పని నిరూపించ డం ప్రభుత్వానికి అవకాశం మాత్రమే కాదు బాధ్యత కూడా. మాటకారితన మున్న కొంతమంది మంత్రులు ఎక్కువ సభాసమయం తీసుకుంటూ ప్రభు త్వం, పాలకపక్ష భావజాలాన్ని జనబాహుళ్యంలోకి పంపే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. విపక్షాలు లేవనెత్తే కీలక ప్రజాసమస్యలపై ప్రభుత్వ చిత్తశుద్ధి కొరవడుతోంది. రైతు ఆత్మహత్యలే ఇందుకు ఉదాహరణ. ‘ఇవి ఇప్పుడే మొదలయ్యాయా?’ ‘గతంలోనూ ఉన్నాయి కదా!’ అన డాన్ని మించి బాధ్యతారాహిత్యమేముంటుంది! అదే సమయంలో విపక్షం కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాకుండా నిర్మాణాత్మక సూచనలు చేయాలి, కానీ, ఆ జాడలే లేవు. అయితే, సభలో కొన్ని మంచిపోకడలూ లేకపో లేదు. సభా నాయకుడైన సీఎం ఒక వాడి, వేడి చర్చ తర్వాత నేరుగా విపక్ష బెం చీల వద్దకు వెళ్లి, సీనియర్ సభ్యుడైన జీవన్‌రెడ్డి పక్కన కూర్చొని కొంత నచ్చ జెప్పేయత్నం చేయడం సభలో సుహృద్భావాన్ని పెంచే బలమైన సంకేతమే. ఇది కొత్తేం కాదు. శాసనసభావ్యవహారాల మంత్రిగా లోగడ రోశయ్య కూడా ఇలా చేశారు. ఇటువంటివి ఇప్పుడు మామూలు విషయాలుగా కనిపించినా, దీర్ఘకాలంలో చట్టసభల్లో సత్ సంప్రదాయాల్ని బలోపేతం చేస్తాయి. వాయిదా తీర్మానాల డిమాండ్‌తో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథాచేయొద్దని, ఆ అంశాన్ని తదనంతరం చేపట్టాలని సదుద్దేశంతో పాలకపక్షం చేసిన ప్రతిపాదనకు విప క్షాలు సహకరించడం మంచిపరిణామం. విద్యుత్తు విషయంలో పొరుగు రాష్ట్రంవల్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి కేంద్రం వద్దకు వెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించడానికి విపక్షాలన్నీ సహకరించడం వంటివి సానుకూ లాంశాలు. ఈ వాతావరణాన్ని పెంచడం పాలక-విపక్షాల కనీస ధర్మం. ఆంధ్రప్రదేశ్ సభలో అధ్వానం తెలంగాణ శాసనసభలో విపక్షమైన తమ గొంతునొక్కుతున్నారని గగ్గోలు పెట్టే టీడీపీ, రెండుచోట్లా ఒకే నాయకుని నేతృత్వంలో ఉంటూ ఏపీ శాసన సభలో పాలకపక్షంగా చేసిందేమిటి? అక్కడ ఏకైక విపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ గొంతునొక్కడమే కదా! ఇద్దరు, ముగ్గురు తెలంగాణ మంత్రులు మాట్లాడితే అంతా ఒకటై ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. మరి, అక్కడ అరడజను మంది మంత్రులు విపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ఒంటి కాలిపై లేవటాన్ని ప్రజలు చూడరనుకుంటారా? అక్కడ సభలో ఉన్నది మూడు రాజకీయ పార్టీలే. మిత్రపక్షమైన బీజేపీ పాలకపక్షం టీడీపీ చంకన జేరడంతో ఇక మిగిలింది వైఎస్సార్సీపీ ఒక్కటే! ప్రజాసమస్యల ప్రస్తావన రానీకుండా, వ్యక్తిగత ఆరోపణలు, దూషణలతో విపక్షనేతపై పాలకపక్షం ఒంటికాలిపై లేచిన ఘటనలెన్నో! అవకాశాలు కల్పించడంలోనూ వివక్ష. సభావ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)లో ప్రాతినిధ్యం విషయంలోనూ నానారభస చేశారు. ప్రజా సమస్యల స్పృహ-సభ నడుపుకునే ప్రభుత్వాల బాధ్యతను విస్మరించి, ప్రతి సెషన్లో, రోజులో, పూటలో, నిర్దిష్ట చర్చలో ఇలా అంతటా ఆధిపత్య ధోరణి చూపడం, సంఖ్యాబలంతో అణచివేసే పంథా అనుసరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. సభ ఎన్నిరోజులపాటు జరపాలనే విషయంలోనూ నియం తృత్వ ధోరణే తప్ప సంప్రదింపుల సత్సాంప్రదాయమేలేదు. ‘చట్టసభలు వీలై నన్ని ఎక్కువరోజులు పనిచేయాలనే అంశాన్ని పార్లమెంటరీ ప్రిసైడింగ్ అధి కారుల వార్షిక సదస్సు ప్రతియేటా నొక్కి చెబుతోంది, కానీ ఆచరణలో జరగటం లేదు’ అని శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి తరచూ చెబుతుంటారు. తద్వారా సుపరిపాలన అందించే చట్టాల్ని చేయడమేకాకుండా ప్రజాసమస్యల్ని చర్చించి పరిష్కారాలు కనుక్కునే అవకాశం పెరుగుతుందని ఆయన విశ్లేషి స్తారు. ప్రజల తరపున వారి ప్రతినిధుల విస్తృతాభిప్రాయాల వెల్లడికి చట్ట సభలు వేదిక కావాలి. అప్పుడు రాజ్యాంగం పరిధిలోని ఇతర సంస్థల అనుచిత జోక్యాలూ తగ్గుతాయి. అన్ని వైపుల ఆలోచనల్ని ఆహ్వానించే నెహ్రూ దృక్ప థమే, ఈ దేశాన్ని వలసవాద పాలనా వారసత్వంలోకి జారనీకుండా కాపా డింది. ‘‘వస్తువినిమయ మార్కెట్‌కన్నా, ఆలోచనా వినిమయ పథంపైనే సామ్య వాది నెహ్రూకు అచంచల విశ్వాసం’’ అని నెహ్రూ జీవిత చరిత్ర రాసిన సర్వేపల్లి గోపాల్ (డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడు) అంటారు. ఆ స్ఫూర్తిని అం దిపుచ్చుకొని చట్టసభల్ని విశాల దృక్పథంతో నడపడమే 125వ జయంతి సందర్భంగా నెహ్రూకు మనమిచ్చే ఘన నివాళి!