Indian Oil (Indane)
-
ఐవోసీ రూ.21,000 కోట్ల పెట్టుబడి
పట్నా: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. బిహార్‌లోని బరౌనీ రిఫైనరీ విస్తరణ, ఆ రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు ఐవోసీ ఈడీ సుమన్ కుమార్ వెల్లడించారు.‘సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో బరౌని రిఫైనరీని పెట్రోకెమికల్ ప్లాంట్‌తో కలిపి ప్రస్తుత 6 మిలియన్ టన్నుల నుంచి సంవత్సరానికి 9 మిలియన్ టన్నులకు విస్తరిస్తున్నాం. 27 నగరాల్లో ఆటోమొబైల్స్‌కు, గృహాలు, పరిశ్రమలకు పైపుల ద్వారా సీఎన్జీని సరఫరా చేయడానికి నెట్వర్క్ ఏర్పాటుకై మరో రూ.5,600 కోట్లు పెట్టుబడి పెడతాం. 2,00,000 టన్నుల తయారీ సామర్థ్యంతో పాలీప్రొఫైలిన్ కేంద్రాన్ని కూడా 2025 చివరినాటికి ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము? రూ.2 లక్షల కోట్ల కంటే అధిక పెట్టుబడి110 బిలియన్ డాలర్ల విలువైన ఐవోసీ..దూకుడుగా మూలధన విస్తరణ ప్రణాళికను రూపొందించింది. రిఫైనింగ్ సామర్థ్యం, పెట్రోకెమికల్ ఇంటిగ్రేషన్, అనుబంధ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన ఆస్తులను విస్తరించడానికి దశాబ్దంలో రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న నేపథ్యంలో దేశ ఇంధన అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ‘ద ఎనర్జీ ఆఫ్ ఇండియా’గా సంస్థ 2050 నాటికి భారత ఇంధన అవసరాలలో 12.5 శాతం సమకూర్చడం ద్వారా ముందు వరుసలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ పానిపట్ రిఫైనరీని సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల నుంచి 25 మిలియన్ టన్నులకు, గుజరాత్ రిఫైనరీని 13.7 మిలియన్ టన్నుల నుండి 18 మిలియన్ టన్నులకు విస్తరిస్తోంది. -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
సామాన్యులకు చమురు కంపెనీలు భారీ షాకిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మార్చి 1న పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర రూ.1,155 చేరింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2119.50కు ఎగబాకింది. కాగా, ఇప్పటికే ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న వడ్డీ రేట్లు, నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగిన ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769 నుంచి రూ.2119.50కి చేరింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1052 నుంచి రూ.1102.5కి పెరిగింది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1079 నుంచి రూ.1129కి పెరిగింది. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1068.50 నుంచి రూ.1118.5కి చేరింది. -
10 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు
చెన్నై: గ్యాస్ సబ్సిడీ రద్దు చేసుకోవాలంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి అన్యూహ్య స్పందన లభిస్తుంది. దేశ్యవాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది వినియోగదారులు తమ గ్యాస్ సబ్సిడీని రద్దు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2.09 లక్షల మంది వినియోగదారులు ఈ సబ్సిడీని రద్దు చేసుకుని.. ఆ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాన్ని మహారాష్ట్ర కైవసం చేసుకుంది. కోటి మంది వినియోగదారులు తమ గ్యాస్ సబ్బిడీని రద్దు చేసుకునే లక్ష్యంగా గ్యాస్ కంపెనీలు ఇప్పటికే మీడియా సాధనాల ద్వారా ప్రచార ఉద్ధృతిని పెంచాయి. దేశంలోని గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటంబానికి హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ గ్యాస్, ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీలు రాయితీపై ఏడాదికి 12 సిలిండర్లు చొప్పున... వినియోగదారుడికి అందజేస్తుంది. అయితే ఒక్కో సిలిండర్‌కు రూ. 207 అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దాంతో ఏటా రూ. 40 వేల కోట్లు భారం ప్రభుత్వంపై పడుతుంది. గ్యాస్‌కు ఇచ్చే సబ్సిడీ రాయితీ వదులుకుని... మరో పేద కుటుంబానికి ఆ అవకాశం కల్పించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే.