Indian womenTeam
-
మహిళా కబడ్డీ జట్టుకు మోడీ అభినందనలు
న్యూఢిల్లీ : ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా కబడ్జీ జట్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. 'పసిడి పతకం గెలుచుకున్న జట్టును అభినందిస్తున్నా.ఇది అసాధారణ విజయం' అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత మహిళల కబడ్డీ జట్టు దేశం గర్వపడేలా చేసిందని మోడీ అన్నారు. కబడ్డీలో మహిళలు జట్టు ఫైనల్స్‌లో ఇరాన్‌పై 31-21 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు పురుషుల కబడ్డీ జట్టు కూడా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ భారత్ 11 పసిడి పతకాలను సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
కబడ్డీ ఆటలో భారత్‌కు పతకాల పంట!
-
పురుషుల కబడ్డీలో భారత్‌కు స్వర్ణం
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల కబడ్డీ జట్టు 'పసిడి' పతకం సొంతం చేసుకుంది. ఫైనల్స్‌లో ఇరాన్‌పై 27-25 తేడాతో భారత్ జట్టు గెలుపొందింది. ఇక ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీ జట్టు వరుసగా ఏడోసారి స్వర్ణం సాధించటం విశేషం. దాంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 11వ స్వర్ణం. మరోవైపు శుక్రవారం జరిగిన మహిళల కబడ్డీ జట్టు కూడా బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. ఫైనల్స్‌లో ఇరాన్‌పై మహిళల జట్టు 31-21 తేడాతో విజయం సాధించింది. -
ఏషియన్ గేమ్స్‌లో 'కబడ్డీ' ఆడేశారు
ఇంచియాన్ : దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు చెడుగుడు ఆడేసింది. మహిళల కబడ్డీ జట్టు మరో స్వర్ణ పతాకాన్ని తెచ్చింది. ఫైనల్స్‌లో ఇరాన్‌పై 31-21 తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ భారత్ పది స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది. 1990 నుంచి జరిగిన ఆసియా క్రీడలన్నింటిలోనూ భారత్ బంగారం పతకం గెలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.