‘బాలల శ్రమను చట్టబద్ధం చేయొద్దు’
ఐరాస: కుటుంబం నిర్వహించే చిన్నతరహా పరిశ్రమలకు చిన్నారులు సహకరించవచ్చని భారత బాలకార్మిక చట్టం పేర్కొనడంపై యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల బలహీన వర్గాల పిల్లలు తరచుగా పాఠశాలలకు గైర్హాజరై డ్రాపౌట్లుగా మిగిలే ప్రమాదముందని అభిప్రాయపడింది.
ఈ నిబంధనను బాలకార్మిక చట్టం నుంచి తొలగించాలని గట్టిగా సిఫారసు చేస్తున్నట్లు యునిసెఫ్ ఇండియా ఎడ్యుకేషన్ చీఫ్ యుఫరేట్స్ గోబినా పేర్కొన్నారు. భారత్లో డ్రాపౌట్లుగా మారిన చిన్నారులను, బలహీన వర్గాలకు చెందిన బాలకార్మికులను పాఠశాలలకు తిరిగి రప్పించే ప్రక్రియలో పెద్దగా పురోగతి కానరాలేదన్నారు.