indonesian woman
-
పదేళ్లుగా అలా ఓ కర్రలా...
హైదరాబాద్: గడిచిన పదేళ్లుగా ఆమె ఒక కర్రలా అలా పడుంది. లేచి నడవలేదు కదా కనీసం కూర్చోలేదు కూడా. లక్షల్లో ఒకరికన్నట్టు వచ్చే ఒక వింత జబ్బు ఆమెను వెంటాడుతోంది. ఇండొనేషియాకు చెందిన సెంట్రల్ జావాలోని స్రాజెన్ ప్రాంతానికి సులామీ (35) అనే యువతి గడిచిన పదేళ్లుగా నడవలేదు. మంచంపైన తన ఇష్టానుసారంగా కదలలేదు. కేవలం ఒక కర్ర మాదిరిగా అలా ఉండిపోవలసిందే. ఎవరో ఒకరు తోడుండీ మోసుకెళ్తే గానీ కదలలేని దయనీయ స్థితి. 90 ఏళ్ల అమ్మమ్మ ఆమెకు సేవలు అందించాలి. ఎవరైనా ఎత్తి నిలబెడితే కర్ర సహాయంతో కొద్ది కొద్దిగా కాళ్లను కదుపుతూ నడుస్తోంది. ఇండొనేషియా హెల్త్ డిపార్ట్ మెంట్ నివేదిక ప్రకారం ఆమె ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ అనే జబ్బుతో బాధపడుతోంది. జన్యు పరంగా వచ్చే అరుదైన జబ్బే ఆంకిలోసిస్ స్పాండిలైటిస్. ఇదొచ్చిన వాళ్లు వెన్నెముకతోపాటు ఇతర భాగాలు చచ్చుబడిపోతాయి. మొదట్లో ఇది నడుము నొప్పితో మొదలవుతుంది. అది క్రమేణా తీవ్రమై ఇలా కదలలేని స్థితికి చేరుకుంటారు. ఇది వచ్చిన వాళ్లు ఒక కర్ర మాదిరిగా అలా ఉండిపోవాల్సిందే. ఎటూ కదలలేరు. కూర్చోలేరు. నడవలేరు. శరీరంలోని ఏ భాగాన్ని కూడా కదల్చలేరు. ఎప్పుడూ అలా చచ్చుబడినట్టు ఉండాల్సిందే. ఇది రావడం వల్ల జీవన కాలమేమీ తగ్గదు. కానీ దీని వల్ల గుండెపోటు, వెన్నుపూస విరగడం, ఛాతిలో ఇన్ఫెక్షన్ కు గురికావడం, మూత్ర పిండాల సమస్య వంటివి ఉత్పన్నం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వింత వ్యాధి సోకిన వాళ్లకు క్రమం తప్పకుండా మందులు వాడుతుండటంతో పాటు ఫిజియోథెరఫీ చేయించడం తప్పని సరి. అలా చేస్తున్న దశలో కొంచెం కొంచెంగా దానికదే పరిస్థితి మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
నడిరోడ్డులో యువతికి బెత్తం దెబ్బలు
అక్కడ కొన్ని వందల మంది చుట్టూ నిల్చుని వినోదం చూస్తున్నారు. ఆ గుంపు మధ్యలో నిలబడి ఉన్న యువతి బాధతో విలవిల్లాడిపోతూ కేకలు పెడుతోంది. అది చూసి వాళ్లంతా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు అరుస్తోందో తెలుసా.. ఇస్లామిక్ చట్లాలను ఉల్లంఘించినందుకు ఆమెను బెత్తం పెట్టి నడివీధిలో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. ఈ ఆటవిక చర్య.. ఇండోనేషియాలో తాజాగా వెలుగుచూసింది. ఇండోనేషియాలోని చాలా రాష్ట్రాల్లో షరియా చట్టాన్ని గట్టిగా అమలుచేస్తారు. జూదం ఆడినా, మద్యం తాగినా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా చాలా కఠినాతి కఠినమైన శిక్షలు అమలుచేస్తారు. తాజాగా శిక్ష పడిన యువతితో పాటు మొత్తం 13 మందిని.. వాళ్లలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. అంతా 21 నుంచి 30 ఏళ్లలోపు వారే. వీళ్లందరినీ ఆ రాష్ట్ర రాజధాని బందా అసేలో ఒక మసీదు వద్ద నిలబెట్టి బెత్తంతో దెబ్బలు కొట్టారు. దాన్ని చుట్టూ ఉన్న జనం వినోదం చూస్తూ నిలబడ్డారు తప్ప.. ఎవరూ వ్యతిరేకించే ధైర్యం చేయలేదు. పెళ్లికాని యువతీ యువకులు ఒకరినొకరు ముట్టుకోవడం, కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ద్వారా వాళ్లు ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించారని తేల్చారు. మరో వ్యక్తి అయితే.. ఒక మహిళతో కలిసి రహస్య ప్రదేశంలో గడిపినందుకు శిక్ష విధించారు. వారిలో 22 ఏళ్ల మహిళ గర్భవతి కావడంతో.. ఆమెకు తాత్కాలికంగా శిక్ష నుంచి ఊరటనిచ్చారు. అయితే, ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శిక్ష అమలుచేయాలని బందా అసె డిప్యూటీ మేయర్ జైనల్ అరిఫిన్ తెలిపారు. ఇలాంటి శిక్షలు కఠినమైనవే అయినా.. దీనివల్ల భవిష్యత్తులో ఇంకెవరూ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉంటారని అన్నారు. ఇటీవలి కాలంలో మహిళలు సహా పలువురికి ఇలా బహిరంగంగా బెత్తం దెబ్బల శిక్షలు పడుతూనే ఉన్నాయి. -
కొబ్బరాకుల్లో కుడుములు
ఈ ఇండోనేషియా మహిళ చేతుల్లో ఉన్నవి ‘కేతుపట్లు’. వీటితో రుచికరమైన వరి కుడుములు తయారుచేయొచ్చు. కొబ్బరి ఆకులతో నేర్పుగా అల్లిన ఈ దొప్పల్లో బియ్యాన్ని పోసి, ఆవిరి మీద ఉడికిస్తారు. ఇండోనేషియాతోపాటు, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్లలోని సముద్రతీరప్రాంతాల్లో ఈ వరికుడుములు సంప్రదాయ వంటకం!