industrial sectors of the Group
-
మౌలిక రంగం పరుగు
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఆగస్టులో మంచి పురోగతిని కనబరిచింది. ఈ రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, ఎరువుల విభాగాలుమినహా కీలక రంగాల పురోగతితోపాటు లో బేస్ ఎఫెక్ట్ కూడా దీనికి కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లో బేస్‌తో పోలి్చతే తాజా సమీక్షా నెల్లో ఎనిమిది రంగాల ఉత్పత్తి 11.6 శాతం పెరిగిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ దాదాపు 40.27 శాతం. గురువారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన గణాంకాలను పరిశీలిస్తే... ► బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది. ► సిమెంట్ రంగం 36.3% పురోగమించగా, స్టీల్ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది. ► పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1% పెరిగింది. ► విద్యుత్ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది. ► క్రూడ్ ఆయిల్ (మైనస్ 2.3 శాతం), ఎరువుల (మైనస్ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్ వృద్ధి లేకపోగా 17.3 శాతం క్షీనత నమోదయ్యింది. -
ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’
► వార్షిక ప్రాతిపదికన నవంబర్ ఉత్పత్తిలో వృద్ధి శూన్యం... ► 1.3 శాతం క్షీణిత (మైనస్) నమోదు ► ఇదే నెల ఐఐపీ గణాంకాలపై ► ప్రతికూల ప్రభావం చూపే అవకాశం! న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి 2015 నవంబర్‌లో పూర్తి నిరాశను మిగిల్చింది. 2014 నవంబర్‌తో పోల్చిచూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 1.3 శాతం క్షీణత (మైనస్)ను నమోదుచేసుకుంది. గడచిన ఏడు నెలల కాలంలో ఇంత దారుణమైన ఫలితం ఎన్నడూ రాలేదు (ఏప్రిల్‌లో 0.4 శాతం క్షీణత). మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా దాదాపు 38 శాతం. జనవరి రెండవ వారంలో వెలువడనున్న నవంబర్ ఐఐపీ ఫలితంపై తాజా ఫలితం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2014 నవంబర్‌లో గ్రూప్ ఉత్పత్తి రేటు 8.5 శాతం. 2015 అక్టోబర్‌లో 3.2%. కాగా 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. 2014 ఇదే కాలంలో ఈ రేటు 6 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన నవంబర్ గణాంకాల ప్రకారం 8 రంగాల పనితీరునూ వార్షిక రీతిన వేర్వేరుగా చూస్తే... క్షీణతలో... క్రూడ్ ఆయిల్: ఉత్పత్తి క్షీణత మరింత పెరిగింది. -0.1%క్షీణత మరింతగా-3.3% క్షీణతకు జారింది. సహజ వాయువు: ఈ రంగంలో కూడా -2.3 శాతం క్షీణత మరింతగా - 3.9 శాతానికి దిగింది. సిమెంట్: వృద్ధిలేకపోగా -1.8 శాతం క్షీణత నమోదయ్యింది. స్టీల్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా 8.4 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. వృద్ధి రేట్లు డౌన్... విద్యుత్: ఉత్పత్తి 9.9 శాతం నుంచి నిశ్చల స్థాయి (0 శాతం)కి చేరింది. బొగ్గు: వృద్ధి రేటు 14.6 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయింది. రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి 8.1 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. ఒకే ఒక్కటి... ఎరువులు: ఈ రంగం మాత్రం మంచి పనితీరు కనబరిచింది. 2.8 శాతం క్షీణత (మైనస్) 13.5 శాతం వృద్ధికి చేరింది.