injured girl
-
అందరి నోట అతని పేరే...టిక్‌టాక్‌లో స్టార్‌గా కూడా అతనే!
You Are A Star On TikTok: ఉక్రెయిన్ పై రష్యా గత మూడు వారాలకు పైగా భీకరమైన పోరు సలుపుతూనే ఉంది. మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం యుద్ధం ఆపాలంటూ జారీ చేసిన ఆదేశాలను సైతం దిక్కరించి ప్రపంచ దేశాల చేత యుద్ధ నేరస్తుడిగా ముద్ర వేయించుకున్నాడు వ్లాదిమిర్ పుతిన్. అయితే ఈ యుద్ధం పుతిన్‌కి చెడ్డపేరు తెస్తే వ్లాదిమిర్ జెలెన్స్కీని హీరో చేసింది. అయితే నిరవధికంగా సాగుతున్న బీకర యుద్ధంలో రష్యా దళాలు వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ని దారుణంగా నాశనం చేస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది. ఈ తరుణంలో అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుడుని మా దేశం వచ్చేయండి విమానం పంపిస్తాం అని గొప్ప ఆఫర్ ఇచ్చినప్పటికీ తిరస్కరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు జెలెన్ స్కీ. అంతేగాక మా దేశాన్ని రష్యా దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు ఇక్కడే ఉండి పోరాడుతాను మాకు యుద్ధట్యాంకులు, మిలటరీ సాయం అందించండి చాలు అని అడిగారు. అంతేగాదు యుద్ధం వేళ తాను సైతం సైనికుడిగా మారి కథనరంగంలోకి అడుగుపెట్టి దేశాన్ని ముందుండి నడిపించాడు. దీంతో జెలెన్స్కీ పేరు ప్రపంచదేశాల్లో మారుమ్రోగిపోయింది. ఎంతలా అంటే అతని పేరుని బ్రాండ్‌నేమ్‌గా వాడుకుని బిజినెస్ చేసుకునేంతగా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మాధ్యమాలు సైతం అతన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో రష్యా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చిక్కిత్స పొందుతున్న టీనేజర్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు పలకరించారు. ఆ టీనేజర్ రాజధాని కైవ్ సమీపంలోని వోర్జెల్ పట్టణం నుంచి బయలుదేరుతున్నప్పుడు రష్యా దాడిలో గాయపడింది. కాత్య వ్లాసెంకోగా గుర్తించబడిన టీనేజర్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని చూసి ఒక్కసారిగా ఆనందపడిపోతూ..." టిక్‌టిక్‌లో అంతా మీ గురించే మాట్లాడుతున్నారు. మీకే మద్దతిస్తున్నారు." అని జెలన్ స్కీతో సంతోషంగా చెబుతుంది. దీంతో జెలన్స్కీ చిరునవ్వుతో అయితే మేము ఇప్పుడూ టిక్‌టాక్‌ని ఆక్రమించామా అని అడిగారు. దీంతో ఆమె ఔను అంతా నీ గురించి మాట్లాడతారు అని బదులిచ్చింది. జెలన్ స్కీ ఆమెకు పూల బోకేని కూడా బహురించారు. అయితే రష్యన్ బలగాలు జరుపుతున్న దాడి నుంచి కాత్య తన 8 ఏళ్ల తమ్ముడుని కాపాడేందుకు అడ్డుగా నుంచోవడంతో ఆమె తీవ్రగాయలపాలైంది. ఆమె తండ్రి ఆమెను చేతులపై ఆసుపత్రికి తరలించాడు. ఈమేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పలకరించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Zelensky surprises victims in the hospital. He shook the hands of those injured bad one young girl told him he was very popular on TikTok #UkraineRussiaWar #UkraineUnderAttack #UkraineWar #Ukraine #RussiaUkraineCrisis pic.twitter.com/09LYoiLP9r — Chilly Chills (@WeeliyumF) March 18, 2022 (చదవండి: ఎవరినీ లెక్కచేయని పుతిన్.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం) -
చిన్నారిపై కుక్క దాడి
సాక్షి, పటాన్చెరు : అమీన్‌పూర్‌లోని నవ్యనగర్‌లో బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్తున్న ఓ చిన్నారిపై కుక్క దాడి చేసి గాయపర్చింది. అమీన్పూర్ పట్టణం, మండల పరిధిలో ప్రతి రోజూ ఏదో ఒక చోట కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కిష్టారెడ్డిపేట, బీఎస్ఆర్ కాలనీలో, అమీన్ఫNర్ పట్టణంలోని బీరంగూడ ఇతర ప్రాంతాల్లో జరిగిన కుక్క కాట్ల సంఘటనలు మరువక ముందే అమీన్పూర్ నవ్యనగర్‌లో బుధవారం చక్రధర్ కూతురు అద్వైత అనే చిన్నారిపై దాడి చేసింది. తల్లితో కలిసి గేటు వద్ద స్కూల్ బస్సు కోసం ఎదరు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వచ్చిన కుక్క ఆ చిన్నారికాలిపై గాయం చేసింది. అంతలోనే ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఆ కుక్కను తరిమేశారు. మొరపెట్టుకున్నా.. కాలనీలో కుక్కల దాడులు పెరిగాయని స్థానికులు అమీన్పూర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని నవ్యనగర్ కాలనీవాసులు తెలిపారు. ఈ విషయమై స్థానిక కమిషనర్ సుజాత వివరణ కోరగా కుక్కలను పట్టుకునే వ్యక్తులకు ఆ పని అప్పగించామని, గురువారం సాయంత్రానికి కుక్కలను అక్కడ నుంచి తరలిస్తామన్నారు. అయితే అమీన్పూర్లో కుక్కల దాడుల సంఘటనలు పెరుగుతున్నాయని వాట్సప్ గ్రూపుల్లో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. శునకాల దాడుల సంఘటనలకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను పరస్పరం షేర్ చేసుకుంటున్నారు. -
అత్యాచార బాధితురాలికి సంఘీభావంగా వెళ్తే.. కత్తితో దాడి!
జైపూర్( ఒడిస్సా): రాష్ట్రంలోని జైపూర్ జిల్లాలో బాలికల కాలేజీలో చదువుతున్న ఓ బాలికపై అగంతకులు దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలిని మెరుగైనా చికిత్స కోసం కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మార్చారు. వివరాల్లోకి వెళితే.. గాయపడిన బాలిక జైపూర్‌లోని సుకందా కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె రోజులాగే కాలేజీ నుంచి తన స్నేహితులతో కలిసి జాతీయ రహాదారి-200పై ఉన్న బస్టాప్ వద్ద బస్సుకోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో గుర్తుతెలియని యువకులు ఒక్కసారిగా ఆమెపై పదునైనా కత్తితో దాడికి దిగారు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కిడ్నాప్‌కు గురైన బజీ రూట్ మెమెరీయల్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్ధిని అనంతపురంలోని బోతలండా అడవి సమీపంలో గురువారం హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై నిరసిస్తూ విద్యార్ధులంతా సంఘీభావం తెలుపుతూ శుక్రవారం ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో గాయపడిన బాధితురాలు కూడా పాల్గొంది. ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆమె తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికపై దాడి జరిగినట్టు వార్తలు రావటంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సుకిందా కాలేజీ విద్యార్ధులంతా దాడిచేసినా నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ దుబూరి- సుకిందా జాతీయ రహాదారి -200 ను దిగ్భందం చేశారు. దీంతో మూడుగంటలపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు, తహసిల్దార్ ల జోక్యం చేసుకుని నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇవ్వండంతో వారు ఆందోళనను విరమించారు.