innaguration
-
ఏ సమస్య వచ్చినా.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం: సీఎం జగన్
తిరుపతి: సన్నీ ఆప్కోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్‌ను సన్నీ ఆప్కోటెక్ తయారు చేస్తోంది. వివిధ రకాల మొబైల్ కంపెనీలకు కెమెరాలను ఆ సంస్థ సరఫరా చేయనుంది. రూ.254 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయగా, 3వేల మందికి ఉద్యోగ అవకాశం కలగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ►ఈ క్లస్టర్లో మూడు ప్రాజెక్టులను ప్రారంభించాం ►మరో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ►టీసీఎల్ యూనిట్‌ను ప్రారంభించాం ►టీవీ ప్యానెళ్లు, మొబైల్ డిస్ప్లే ప్యానెళ్లు ఇక్కడ తయారుచేస్తారు ►3200 మందికి ఉపాధినిస్తున్నారు ►ట్రయల్‌రన్స్‌కూడా జరుగుతున్నాయి ►ఫాక్స్‌లింక్స్ అనే సంస్థ యూఎస్బీ కేబుళ్లు, సర్క్యూట్ బోర్డులను తయారు చేస్తోంది ►ఫ్యాక్టరీని పూర్తిచేసింది. మరో 2వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది ►సన్నో ఒప్పోటెక్ సెల్ఫోన్లు కెమెరా లెన్స్‌లు తయారు చేస్తోంది ►ఈ ఫ్యాక్టరీ కూడా పూర్తయ్యింది ►1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది ►నెలరోజులు తిరక్కముందే 6,400 మంది మన కళ్లముందే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది ►శంకుస్థాపన మూడు ప్రాజెక్టులకు వేశాం ►ఇదే ఈఎంసీలో డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్‌కు శంకుస్థాపన చేశాం ►నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఏడాది కాలంలో పూర్తవుతుంది. 850 మందికి ఉద్యోగాలు వస్తాయి ►ఫాక్స్‌లింక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతుంది ►ఏడాదిలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తుంది ►ఈ ఈఎంసీకి రాకముందు అపాచీ సంస్థకు సంబంధించిన సంస్థకు రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు ►15 నెలల్లో పూర్తవుతుంది. 10వేల మందికి ఉద్యోగా అవకాశాలు వస్తాయి ►ఇవాళ అన్నీ కలిపితే మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం ►మరో 3 ప్రాజెక్టులనుకూడా ప్రారంభించాం ►వీటి అన్నింటి ద్వారా దాదాపుగా రూ.4వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి, దాదాపుగా రూ.20వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ►ఇక్కడ యూనిట్లు పెట్టిన వారందరికీ ఒక్కటి చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది ►ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉన్నాం ►కచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించి.. మా రాష్ట్రంలో మీ ప్రయాణం అద్భుతంగా ఉండేలా చూస్తామని హామీ ఇస్తున్నాం. అందరికీ అభినందనలు అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
దూకుడు పెంచిన మోదీ.. ఓటర్లే టార్గెట్
సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన రానున్న లోక్‌సభ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతీష్టాత్మకంగా తీసుకున్నారు. విజయమే లక్ష్యంగా దేశమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఏ క్షణమైన విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాలన్నీ పర్యటిస్తూ పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. గడిచిన 30 రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యటించిన మోదీ 157 అభివృద్ధి పథకాలను ప్రకటించారు. కొత్తనీతి.. సరికొత్త రీతి మరోసారి అక్కడి నుంచే మోదీ పోటీ..! జనవరిలో 57 పథకాలకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్లను ఆకర్షించేందుకు అనేక పథకాలను మోదీ ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యుత్, త్రాగునీరు, నేషనల్ హైవేలు, మెడికల్ కాలేజీలు వంటి ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టిసారించారు. బీజేపీకి ఎంతో కీలకమైన ఎన్నికలు కావడంతో ఓటర్లను ఆకర్షించేందుకు వేలకోట్లు విలువ చేసే ప్రజాకర్షణ పథకాలను మోదీ ప్రకటిస్తున్నారు. మోదీ కేబినెట్ తుది భేటీ : వరాలపై ఉత్కంఠ ఇప్పటికే కాశీనుంచి కన్యాకుమారి వరకు తొలివిడత ప్రచారాన్ని మోదీ ముగించారు. ఆయన చేరుకోలేని ప్రాంతాల్లో రిమోట్ కంట్రోల్ ద్వారా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు. ముఖ్యంగా యూపీలోని అమేథి, రాయబరేలి లోక్‌సభ స్థానాలపై మోదీ దృష్టి కేంద్రీకరించారు. ఆయా స్థానాలను ఎలానైనా కైవసం చేసుకోవాలని ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. ఓవైపు ప్రతిపక్షాలపై విమర్శల దాడిని పెంచుతూనే.. ప్రజల సమస్యలపై దృష్టిసారిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నందున తన వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు. -
ఎందుకొచ్చామురా.. దేవుడా..!
* అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి * తీవ్ర ఇబ్బందులు పడిన మహిళలు, విద్యార్థులు * చీకట్లో ఎటువెళ్లాలో తెలియక అవస్థలు ఎందుకు వచ్చామురా దేవుడా.. ఈ చంద్రబాబు మీటింగ్లేమిటో మా చావుకొచ్చింది.. కాలు కదపలేకపోతున్నాం.. ఎటు వెళ్లాలో తెలియడం లేదు.. ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో.. ఈ ఫోనులూ మూగబోయాయి.. మళ్లీ ఇంకోసారి మీటింగ్‌లంటూ అధికారులు ఒత్తిడి చేస్తే అప్పుడు చెబుతాం.. ఇదీ రాజధాని భవనాల శంకుస్థాపనకు వచ్చిన మహిళల ఆవేదన..ఊరిగాని ఊరు వచ్చారు..విద్యుత్ లేక ఎటుచూసినా అంధకారం అలుముకుంది..కాలు తీసి కాలు వేయాలంటే జర్రున జారింది..ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక..ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళన వారి కళ్లలో బిక్కుబిక్కుమంటూ కనిపింది. సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంత రైతులు భవనాల శంకుస్థాపన సభలకు వస్తే గొడవ చేస్తారని, బయటి ప్రాంతాల నుంచి జనాలను తరలించిన ప్రభుత్వం వారిని అష్టకష్టాల పాలు చేసింది. డ్వాక్రా సమావేశమని గుంటూరు జిల్లా వినుకొండ, కృష్ణా జిల్లా పామర్రు వంటి సుదూర ప్రాంతాల నుంచి మహిళలను రాజధాని శంకుస్థాపన సభకు తరలించారు. ఇక్కడకొచ్చాక జోరున వర్షం కురవడంతో కరెంటు లేక, సెల్ సిగ్నల్స్ రాక ఇళ్ల దగ్గర వారికి సమాచారం సైతం ఇవ్వలేకపోయారు. శనివారం తెల్లవారు జామున మూడు గంటల వరకు సభ ప్రాంగంణం వద్దనే ఉండి వచ్చిన జనాలను తరలించేందుకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే విశేష కృషి చేశారు. కొంత మంది ఎటుపోవాలో తెలియక పార్కింగ్ ప్రాంతాల్లో ఉన్న బస్సుల్లోనే తల దాచుకున్నారు. ఐజీ సంజయ్, రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌లు తమ సిబ్బందితో వీరిని గుర్తించి రోడ్డుపైకి చేర్చారు. స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్డీఎఫ్ బలగాలు భుజాలపై నీటి మూటలు వేసుకొని మోకాళ్ల లోతు బురదలో వెళ్లి ప్రజల దాహార్తి తీర్చారు. జేసీబీల సాయంతో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీశారు. రోడ్డు క్లియర్ చేయడంలో ఎన్డీఆర్ఎఫ్ తీవ్రంగా శ్రమించాయి. ఒకదశలో ఉన్నతాధికారుల సీసీలు, డ్రైవర్ ఎక్కడనున్నారో కనుక్కోలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. డీఆర్డీఏ పీడీ హబీబ్ బాషా సభకు వచ్చిన మహిళలను వారి గమ్యస్థానాలకు చేర్చారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్ఎం 75 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు, అక్షయ పాత్ర వారు భోజనాలు ఏర్పాటు చేశారు. కదలని వాహనాలు.. సభ ముగిసే సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ప్రాంగణాలు , పార్కింగ్ ప్రదేశాలు చిత్తడిగా మారాయి. రాజధాని శంకుస్థాపన ప్రాంతం నల్లరేగడి నేల కావడంతో జనాలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. పొలాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఇరుక్కుపోయాయి. వందల సంఖ్యలో వాహనాలు ఇరుక్కపోయి అక్కడే ఉండిపోయాయి. సీఎం వచ్చిన ప్రతిసారీ.. గుంటూరు జిల్లాకు ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేశాక దాదాపు 30 సార్లు జిల్లాలో సభలు నిర్వహించారు. సభ నిర్వహించిన ప్రతిసారీ మహిళలు, స్కూలు విద్యార్థుల తరలింపు బాధ్యతను అధికారులకు అప్పగించారు. దీంతో సీఎం పర్యటనలంటే జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. సంబంధం లేని వారిని సభలకు తరలించి, ఇబ్బంది పెడుతున్నామనే భావన వెంటాడుతున్నా బయటకు చెప్పుకోలేని పరిప్థితి నెలకొంది. సీఎం సభలంటే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, ఉన్నతాధికారులు హడలిపోతున్నారు. హడావుడిగా సమీక్ష.. రాజధాని ప్రాంతంలో శంకుస్థాపన సభలకు వెళ్లిన జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం ప్రభుత్వానికి చేరింది. ఈ నేపథ్యంలో జనాల నుంచి తిరుగుబాటు వస్తుందని భావించిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా అధికారులతో హడావుడిగా సమీక్ష నిర్వహించారు.