సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన రానున్న లోక్‌సభ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతీష్టాత్మకంగా తీసుకున్నారు. విజయమే లక్ష్యంగా దేశమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఏ క్షణమైన విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాలన్నీ పర్యటిస్తూ పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. గడిచిన 30 రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యటించిన మోదీ 157 అభివృద్ధి పథకాలను ప్రకటించారు.
కొత్తనీతి.. సరికొత్త రీతి
మరోసారి అక్కడి నుంచే మోదీ పోటీ..!
జనవరిలో 57 పథకాలకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్లను ఆకర్షించేందుకు అనేక పథకాలను మోదీ ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యుత్, త్రాగునీరు, నేషనల్ హైవేలు, మెడికల్ కాలేజీలు వంటి ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టిసారించారు. బీజేపీకి ఎంతో కీలకమైన ఎన్నికలు కావడంతో ఓటర్లను ఆకర్షించేందుకు వేలకోట్లు విలువ చేసే ప్రజాకర్షణ పథకాలను మోదీ ప్రకటిస్తున్నారు.
మోదీ కేబినెట్ తుది భేటీ : వరాలపై ఉత్కంఠ
ఇప్పటికే కాశీనుంచి కన్యాకుమారి వరకు తొలివిడత ప్రచారాన్ని మోదీ ముగించారు. ఆయన చేరుకోలేని ప్రాంతాల్లో రిమోట్ కంట్రోల్ ద్వారా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు. ముఖ్యంగా యూపీలోని అమేథి, రాయబరేలి లోక్‌సభ స్థానాలపై మోదీ దృష్టి కేంద్రీకరించారు. ఆయా స్థానాలను ఎలానైనా కైవసం చేసుకోవాలని ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. ఓవైపు ప్రతిపక్షాలపై విమర్శల దాడిని పెంచుతూనే.. ప్రజల సమస్యలపై దృష్టిసారిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నందున తన వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment