inter state thieves arrest
-
చోరీ చేశారు.. చివరికి చిక్కారు
తూర్పుగోదావరి, మామిడికుదురు: సినీ ఫక్కీలో వారు బ్యాంకుకే కన్నం వేశారు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మామిడికుదురులోని ఎస్బీఐలో చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందులో ఏడుగురు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారిని ఆదివారం రాజోలు కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు రాజోలు పోలీస్ స్టేషన్లో సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చోరీకి 11 మంది సభ్యులు వ్యూహం రచించారు. ఇందులో ఓ మహిళతో సహా ఏడుగురిని గత నెల 30న మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఆదివారం రాజోలు కోర్టులో హాజరుపర్చిన వారిలో మహారాష్ట్రకు చెందిన సంతోష్హరి ఖాదం, సచిన్ హరోన్సిం«థే, మంగేష్ దనాజీగోర్, అముల్ మహదేవ్బాగల్, సవితా సంతోష్హత్కర్, యూపీకి చెందిన అస్లాం ఖాన్, జాఫర్ అలీ ఉన్నారు. నిందితుల నుంచి రూ.93,275 చిల్లర నాణేలతో పాటు రెండు చిన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన బాబు కౌసర్ అలియాస్ బాబూఖాన్, పస్తా అలియాస్ తాజాబ్ అలమ్కల్లుఖాన్, నవజాద్ నన్సార్ అలీ అలియాస్ సహబాజ్‌ఖాన్, ఖళియా ఇస్రాక్ అలీఖాన్ అనే గుడ్డూఖాన్లను మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కాతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసులో అరెస్టు చేశారు. వారిని మామిడికుదురు ఎస్బీఐ చోరీ కేసులో అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సీఐ తెలిపారు. దోపిడీకి పాల్పడిన మిగతా సొమ్మును ఎక్కడ దాచారో వారి నుంచి కూఫీ లాగుతామన్నారు. నిందితులంతా పాత నేరస్తులే అన్నారు. కొల్హాపూర్‌లో వారిని అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండ్‌కు తీసుకుని రాజోలు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చామన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రెండు నెలల క్రితమే రెక్కీ ఈ ముఠా బ్యాంకు చోరీల్లో ఆరితేరారు. ఇందులో భాగంగా మామిడికుదురులో చోరీకి రెండు నెలల ముందే రెక్కీ నిర్వహించారు. రెండు కార్లలో అమలాపురం మీదుగా మామిడికుదురుకు గత నెల 24వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ కార్లను వెనక్కి తిప్పి పంపించేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్, సిలిండర్ల సాయంతో బ్యాంకు ప్రధాన ద్వారం తాళాలు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్, సెల్ప్ లాకర్లను తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. స్ట్రాంగ్ రూమ్‌లోని అల్యూనిమినియం పెట్టెల్లో భద్రపరిచిన రూ.18.76 లక్షలను దోచుకుపోయారు. తెల్లవారు జామున 4.30 గంటల వరకు బ్యాంకులోనే ఉండి తరువాత బయటకు వచ్చి అక్కడ రెడీగా ఉన్న తమ వాహనాల్లోనే తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని కొల్హాపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు చిక్కారు. అక్కడి పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మన జిల్లా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రాజోలు సీఐ డి.దుర్గాశేఖరరెడ్డితో పాటు వారి దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషాలు అభినందించారు. -
అంతర్ రాష్ట్ర ట్రాక్టర్ల దొంగల అరెస్ట్
త్రిపురారం (నాగార్జునసాగర్) : ఏడాది కాలంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా ట్రాక్టర్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలు పోలీసులకు చిక్కారు. శుక్రవారం హాలియా సర్కిల్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రంగనాథ్ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండల పరిధిలోని అమ్మిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుంజి వెంకట కృష్ణ, బత్తుల హన్మంతరావు, బత్తుల గోపరాజు జల్సాలకు అలవాటు పడిన వీరు సులభంగా డబ్బులు సంపాధించాలని ట్రాక్టర్, ట్రాలీల దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఎక్కడైతే దొంగతనం చేయాలనుకుంటారో అక్కడ ముందుగా ముగ్గురు రెక్కి నిర్వహిస్తారు. ఆ తరువాత ఇద్దరు నేరస్తులు ఒక మోటర్ బైక్‌పై, మరో నేరస్తుడు ట్రాక్టర్ ఇంజన్‌తో వచ్చి ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ట్రాక్టర్లను చూసి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేని సమయంలో ట్రాక్టర్ ట్రాలీలు ఉంటే నేరస్తులు తమ వెంట తీసుకవచ్చిన ట్రాక్టర్‌కి తగిలించుకొని తీసుకొని పోవడం, ట్రాక్టర్ ఇంజన్ ఉంటే దానిని తీసుకుని పోవడంలాంటి దొంగతనాలకు పాల్పడి అక్కడి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. దొంగిలించిన ట్రాక్టర్ ఇంజన్లు, ట్రాలీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు పట్టణాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 చోట్ల, ఇతర జిల్లాలో 5 చోట్ల ట్రాక్టర్, ట్రాలీల దొంగతనాలకు పాల్పడ్డారు. 24 చోట్ల కేసులు .. అంతర్రాష్ట్ర ట్రాక్టర్ నేరస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 24 చోట్ల ట్రాక్టర్లు, ట్రాలీలను చోరీ చేయడంతో పలు పోలీస్స్టేషన్లలో నేరస్తులపై కేసులు నమోదైయ్యాయి. 2017 నవంబర్‌లో నేరేడుచర్ల పీఎస్, 2018 జూన్‌లో వేములపల్లి పీఎస్, 2018 జులైలో నిడమనూరు పీఎస్, కోదాడ టౌన్ పీఎస్‌లో, అదే విధంగా పద్నాలుగు రోజుల వ్యవధిలో కోదాడ టౌన్ పీఎస్‌లో మరో కేసు, 2018 ఆగస్టులో వట్సావై పీఎస్‌లో, 2019లో అనంతగిరి పీఎస్‌లో, 2018 సెప్టెంబర్‌లో కోదాడ టౌన్ పీఎస్‌లో, 2018 అక్టోబర్‌లో వేములపల్లి పీఎస్‌లో, 2018 నవంబర్‌లో తిప్పర్తి పీఎస్‌లో, అదే విధంగా మరో వారం రోజుల వ్యవధిలో అదే పోలీస్‌స్టేషన్‌లో ట్రాక్టర్ చోరీ జరిగినట్లు మరో కేసు నమోదు అయ్యింది. 2018లో కోదాడ టౌన్ పీఎస్‌లో ట్రాక్టర్ చోరీ జరిగినట్లు కేసు నమోదు అయ్యింది. 2018 డిసెంబర్లో హాలియా పీఎస్‌లో, 2019లో గురజాల పీఎస్‌లో, 2018, 2019లో త్రిపురారం పీఎస్‌లో రెండు కేసులు నమోదు కాగా, 2019లో నిడమనూరు పీఎస్‌లో, 2019లో కుసుమంచి పీఎస్‌లో, మరో మూడు రోజుల వ్యవధిలోనే అదే పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. 2019లో గరిడేపల్లి పీఎస్‌లో, 2019 ఫిబ్రవరి 14వ తేదీ, 15వ తేదీల్లో హాలియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాక్టర్లు చోరీ జరిగినట్లు కేసులు నమోదు అయ్యియి. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 కేసులు, ఇతర జిల్లాలో 5 కేసులు నేరస్తులపై కేసులు నమోదు చేశారు. పట్టుబడింది ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు చోట్ల ట్రాక్టర్లు, ట్రాలీలు దొంగతనాలు జరగడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీ ఎస్సీ, హాలియా సీఐ ధనుంజయగౌడ్‌తో పాటు పోలీసుల బృం దాలను నియమించారు. ఈ నిఘా విభాగం నేర పరిశోధనపై దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 21న కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో గల అహ్మద్ ఇంజనీరింగ్ వర్క్ షాపు వద్ద అనుమానాస్పందంగా ఉన్న నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారించగా తాము చేసిన నేరాలను ఒప్పుకున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరస్తుల నుంచి 8లక్షల 90వేల రూపాయల నగదు, ఒక సెల్‌ఫోన్, 7 ట్రాక్టర్ ఇంజన్లు, 17 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు 61లక్షల 90 వేలు ఉంటుందన్నారు. అంతరాష్ట్ర నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ధను ంజగౌడ్, హాలియా, నిడమనూరు, త్రిపురారం ఎస్ఐలు సతీష్‌కుమార్, యాదయ్య, ఆరీఫ్, పీసీలు విజయశేఖర్, మాదాసు రామారా వు, హోంగార్డు వెంకట్రాంరెడ్డి, శేఖర్, గంగాధర్, మున్యా, నర్సిరెడ్డి, సైదులు జిల్లా ఎస్సీ అభినందించి సీఐ ధనుంజయ్గౌడ్తో పాటు పోలీస్ సిబ్బందికి రూ. 10 వేల నగదు రివార్డును అందజేశారు. -
ఐ–20 పంజా
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ నంబర్ ప్లేట్లు తగిలించిన తెల్లరంగు ఐ–20 కారులో సంచరిస్తూ నగరంలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఘరానా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ఏడాది జూన్‌లో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 16 నేరాలు చేసిన ఈ మీరట్ గ్యాంగ్ పోలీసులకు సవాల్ విసిరింది. మూడు కమిషనరేట్ల పోలీసులూ ఈ దొంగల కోసం ముమ్మరంగా వేట కొనసాగించారు. చివరికి ఎస్సార్‌నగర్ పోలీసులు నేరాలకు అసలు సూత్రదారులను పట్టుకుని వీరి అనుచరుల కోసం వేటాడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని వివిధకోణాల్లో ప్రశ్నిస్తున్న అధికారులు ఈ దొంగలు ఎత్తుకుపోయిన సొత్తు రికవరీ పైనా దృష్టి పెట్టారు. కారులో వచ్చి పట్టపగలే చోరీలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఈ గ్యాంగ్ లీడర్ పేరుమోసిన గజదొంగ. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పంజా విసిరే ఇతడిపై ఉత్తరాది పోలీసులు రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌పై కన్నేసిన ప్రధాన సూత్రదారి నలుగురు ముఠా సభ్యులతో తెల్లరంగు ఐ–20 కారులో రంగంలోకి దిగాడు. తొలిసారి జూన్ 25న గుడిమల్కాపూర్ నవోదయకాలనీలో గుడి వెనుక ఉన్న తాళంవేసిన ఇంట్లోకి ప్రవేశించి పది తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.లక్ష నగదు అపహరించుకుపోయాడు. ఆ రోజు కారు వద్ద ముగ్గురు కనిపించారని స్థానికుల ద్వారా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా కారు గుర్తింపు ఈ గ్యాంగ్ తెల్లని ఐ–20 కారు వినియోగించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చోరీకి ముందు ఆ కారు నాంపల్లి నుంచి ఆసిఫ్‌నగర్ వరకు దాదాపు నాలుగు కి.మీ. ప్రయాణించినట్లు రికార్డు ఉంది. నవోదయ కాలనీ కమ్యూనిటీ హాల్ ముందు కారును ఆపిన దొంగలు ఏడు నిమిషాలు అక్కడ తచ్చాడారు. అదే సమయంలో కారు నెంబర్ ప్లేట్ మార్చిన ఆనవాళ్లు రికార్డయ్యాయి. ఇక్కడ నుంచి రాజేంద్రనగర్ వెళ్లి అక్కడా చోరీ చేసిన గ్యాంగ్ ఆ తర్వాత రెండు రోజుల్లో (జూన్ 26, 27 తేదీల్లో) వనస్థలిపురం, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగి, మీర్పేట్ల్లో మొత్తం 16 ఇళ్లపై పంజా విసిరింది. తర్వాత రెండు రోజులూ (28, 29) చోరీలు నమోదు కాలేదు. మీర్పేట్ చోరీలో తస్కరించిన లాకర్‌ను ఎత్తుకుపోయిన ఈ గ్యాంగ్ బాలాపూర్‌లో పడేసింది. దీంతో వీరు ఆ మార్గంలో సిటీని వదిలి పారిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. మీరట్ చెందినదిగా గుర్తించినా.. కరడుగట్టిన ఈ ముఠాను పట్టుకోవడానికి సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్వోటీ) ముమ్మరంగా ప్రయత్నించాయి. ప్రధానంగా టోల్గేట్స్పై దృష్టి పెట్టిన పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి వాటి రికార్డులు, సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి విశ్లేషించారు. ఈ నేపథ్యంలో అనుమానిత ఐ–20 కారు నిర్మల్.. మహారాష్ట్రలోని వార్దా, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మీదుగా ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారు. అన్ని కోణాల్లో ఆరా తీసిన పోలీసులు ఈ గ్యాంగ్ మీరట్‌కు చెందినదిగా తేల్చారు. ఉత్తరప్రదేశ్ వెళ్లిన అధికారులు అక్కడి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) సహకారం తీసుకుని దాదాపు నెల రోజుల పాటు గాలించినా పట్టుకోలేకపోయారు. ఎస్సార్‌నగర్ పోలీసులకు కలిసొచ్చినగతానుభవం మీరట్ నుంచి స్కార్పియో వాహనంలో వచ్చిన ఓ గ్యాంగ్ ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాల్లో పంజా విసిరింది. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసును అధ్యయనం చేసిన పోలీసులు దాదాపు 70 సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించారు. దీంతోపాటు సాంకేతిక ఆధారాలను బట్టి మీరట్ గ్యాంగ్‌గా భావించి పట్టుకున్నారు. వీరిని గత ఏడాది జూన్ 15న నగరానికి తరలించి అరెస్టు చేశారు. ఈ అనుభవమే తాజా ఐ–20 గ్యాంగ్ చిక్కడానికి కారణమైంది. తాజా ముఠా కోసం రంగంలోకి దిగిన ఎస్సార్‌నగర్ పోలీసులు వారు నేరం చేసే తీరు, రోజులు తదితరాలను విశ్లేషించారు. దీనికి తోడు సాంకేతికంగానూ ముందుకు వెళ్లిన అధికారులు ఈ అంతరాష్ట్ర దొంగలు మరోసారి నేరం చేయడానికి సిటీకి వస్తున్నట్లు గుర్తించారు. కారు తీసుకుని రోడ్డు మార్గంలో కొందరు, రైలులో మరికొందరు వస్తున్నట్లు నిర్థారించారు. దీంతో వలపన్నిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగలను ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
– చోరీకి గురైన ట్రాక్టర్ స్వాధీనం – దొంగల్ని పట్టించిన సీసీ కెమరాలు హిందూపురం రూరల్ : రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టర్ని అందరి కళ్లుకప్పి అంతర్రాష్ట్ర దొంగలు అపహరించినట్లు హిందూపురం రూరల్ సీఐ రాజగోపాలనాయుడు, ఎస్ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో వారు మీడియాకు ఇలా తెలిపారు. మండలంలోని దేవరపల్లి గ్రామానికి చెందిన రామచంద్రప్ప కుటుంబ పోషణ కోసం ఫైనాన్స్‌లో రూ.6లక్షలా80 వేలు రుణం తీసుకుని ట్రాక్టర్‌తో జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం సంతేబిదనూరు గేటు వద్ద రోడ్డుపక్కనే ట్రాక్టర్ నిలిపి ఉంచి రామచంద్రప్ప భోజనానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి ట్రాక్టర్ కన్పించలేదు. చుట్టుపక్కల గ్రామాలు, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ట్రాక్టర్ ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇటీవలే ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల్లోని పుటేజీల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరిలో ఆరా తీయగా దొంగలు బోయరాజు (26), బోయ గోపీ (32) అని, రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా ట్రాక్టర్‌ను చూపించినట్లు సీఐ తెలిపారు. ట్రాక్టర్ని స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్‌కి తరలించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నారాయణ, హెడ్‌కానిస్టేబుల్ అక్బర్ కానిస్టేబుల్ రవీ, వసంత్ తదితరులు ఉన్నారు.