interest deduction
-
బ్యాంకుల్లో తగ్గిన వడ్డీ రేట్లు.. లాభాలు అక్కడే అంటున్న జనం
ముంబై : స్టాక్‌మార్కెట్, మ్యుచవల్ ఫండ్స్ పట్ల భారతీయుల్లో ఉన్న భయాలు క్రమంగా తొలగిపోతున్నాయి. రిస్క్ ఎక్కువని ఇంత కాలం వీటికి దూరంగా ఇండియన్లు తాజాగా స్టాక్‌మార్కెట్ పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీని బ్యాంకులు ఆఫర్ చేస్తుండటంతో.. రిస్క్ ఉన్నా పర్వాలేదనే ధోరణి స్మాల్ ఇన్వెస్టర్లలో పెరుగుతోంది. ‘మార్కెట్’పై ఆసక్తి గత ఆర్థిక సంవత్సరంలో 1,.42 లక్షల మంది కొత్తగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఇందులో 1.22 లక్షల మంది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ దగ్గర ఖాతాలు ప్రారంభించగా మరో 19.7 లక్షల మంది నేషనల్ సెక్కూరిటీ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ దగ్గర ఖాతాలు ఓపెన్ చేశారు. ఇటీవల కాలంలో ఏకంగా 44 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లుగా రిజిస్ట్రర్ అయ్యారు. తగ్గిన వడ్డీ కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు బ్యాంకుల వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా తగ్గించింది. ముఖ్యంగా రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్‌గా పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే మరీ దారుణంగా వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి కోల్పోతున్నారని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. విత్‌డ్రాకే మొగ్గు గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లు 150 ట్రిలియన్ మార్క్‌ని టచ్ చేసింది. ఈసారి 2021 ఏప్రిల్ 21 నుంచి మే 21 వరకు కేవలం రూ. 32,482 కోట్లు డిపాజిట్లే బ్యాంకులో జమ అయినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచవల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలియజేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయానికి బ్యాంకు డిపాజిట్ల మొత్తం రూ. 1.20 ట్రిలియన్లుగా ఉంది. చాలా మంది తమ ఫిక్స్డ్ డిపాజిట్లు కొనసాగించడం లేదనే దానికి ఈ గణాంకాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మ్యూచువల్స్‌కి మళ్లింపు మరోవైపు 2021 మేలో మ్యూచువల్ ఫండ్స్‌కి భారీగా నగదు పోటెత్తింది. ఏకంగా రూ. 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో మే చివరి నాటికి మ్యూచ్‌వల్ ఫండ్స్ గతంలో ఎన్నడూ లేనతంగా రూ. 33 లక్షల కోట్లను టచ్ చేసినట్టు ఓమ్ ( అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ AUM) తెలిపింది. సెబి లెక్కలు మ్యూచవల్ ఫండ్ మేనేజర్లు చెబుతున్న లెక్కలను సెబీ గణాంకాలు బలపరుస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.42 కోట్ల డిమ్యాట్ అకౌంట్లు పప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 49 లక్షలకే పరిమితమైంది. దాదాపు మూడింతలు డిమ్యాట్ అకౌంటర్లు పెరిగాయి. -
డిపాజిట్లపై వడ్డీకోత
• పావుశాతం వరకూ తగ్గించిన • ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు... • నోట్ల రద్దుతో భారీగా డిపాజిట్ల నమోదు ఎఫెక్ట్ న్యూఢిల్లీ: డిపాజిట్లపై వడ్డీరేట్లను రెండు ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు- ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు పావుశాతం తగ్గించారుు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌లో దాదాపు రూ.4,00,000 కోట్ల డిపాజిట్ల నేపథ్యంలో ఈ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డిపాజిట్ల రేటు తగ్గింపు నేపథ్యంలో వచ్చే కొద్ది రోజుల్లో రుణ రేటును కూడా తగ్గించే వీలుందన్న అంచనాలు వెలువడుతున్నారుు. తగ్గింపు డిపాజిట్ రేటును చూస్తే... ఐసీఐసీఐ బ్యాంక్... 390 రోజుల నుంచి రెండేళ్ల మధ్య స్థిర డిపాజిట్ రేటు 0.15 శాతం తగ్గింది. ఇప్పటివరకూ ఈ రేటు 7.25 శాతం కాగా తాజాగా 7.10 శాతానికి దిగివస్తుంది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇలా... రూ.1 నుంచి రూ.5 కోట్ల మధ్య బల్క్ టెన్యూర్స్ అన్నింటిపై వడ్డీరేటు 0.25 శాతం తగ్గుతుంది. గురువారం నుంచే తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది స్థిర డిపాజిట్ రేటు 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గుతుంది. మూడేళ్ల ఒక్కరోజు నుంచి ఐదేళ్ల మధ్య రేటు 6.75 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గుతుంది. ఇప్పటికే ఎస్బీఐ... కొన్ని మెచ్యూరిటీపై బుధవారమే బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 0.15 శాతం వరకూ డిపాజిట్ రేటును తగ్గించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత బుధవారం వరకూ ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు కూడా ఎస్బీఐ పేర్కొంది. కాగా ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ 0.15 శాతం నుంచి 0.20 శాతం వరకూ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఏప్రిల్ 1 విడుదల..వడ్డీరేట్ల కోత నేటి నుంచే
పీపీఎఫ్, కేవీపీ, సీనియర్ సిటిజన్ డిపాజిట్లు సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ తగ్గింపు ♦ 1.3 శాతం వరకూ తగ్గుదల... న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస పత్ర (కేవీపీ), సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం- సుకన్యా సమృద్ధి యోజనసహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై శుక్రవారం నుంచీ వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. మూడు నెలలకోసారి మార్కెట్ రేటుకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై 1.3 శాతం వరకూ వడ్డీరేటు తగ్గనుంది. ప్రతి త్రైమాసికానికీ... ముందు నెల 15వ తేదీ చిన్న పొదుపులపై రేట్లను సమీక్షిస్తారు. దీని ప్రకారం జులై నుంచి సెప్టెంబర్ మధ్య అమలయ్యే వడ్డీరేటు జూన్ 15న నిర్ణయమవుతుంది. ఈ వడ్డీ రేట్లకు ప్రాతిపదికగా అంతకు ముదు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా వ్యవస్థను తక్కువ స్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్న కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర వ్యాధులు, పిల్లల విద్య వంటి తప్పని అవసరాలకైతే పీపీఎఫ్ అకౌంట్ల ముందస్తు ఉపసంహరణలకూ కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే అకౌంట్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. మొత్తం డిపాజిట్‌పై చెల్లించే వడ్డీలో ఒకశాతం జరిమానాగా ఉంటుంది. తగ్గే రేట్లు ఇలా... ♦ కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీ రేటు తగ్గటంతో 100 నెలలకు (ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు) రెట్టింపు అవుతున్న పొదుపు ఇకపై 110 (తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు) నెలలకు రెట్టింపవుతుంది. ♦ తపాలా సేవింగ్స్‌పై రేటు 4 శాతంగా కొనసాగుతుంది. ♦ {పజాదరణ కలిగిన ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్‌పై వడ్డీ 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది. ♦ ఐదేళ్ల మంత్లీ ఇన్కమ్ డిపాజిట్లపై కూడా వడ్డీ 8.4 శాతం నుంచి 7.8 శాతానికి దిగింది. ♦ పోస్టాఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 8.4 శాతం వడ్డీ వస్తుండగా... ఇకపై ఏడాది టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.4 శాతం వడ్డీ అందుతుంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై రేటు 8.4 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ♦ సామాజిక అభివృద్ధి పథకంగా పేర్కొని, గత సమీక్షలో మినహాయించిన సుకన్యా సంమృద్ధి యోజనపై వడ్డీని కూడా 9.2 నుంచి 8.6 శాతానికి తగ్గించారు. ♦ గత సమీక్ష సందర్భంగా మినహాయింపు పొందిన ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌దీ ఇదే పరిస్థితి. మార్చి 18నే ఈ రేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది. ♦ ఒకటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస పత్రాలు, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై ఇప్పటి వరకూ... ఇదే కాలాలకు సంబంధించి ప్రభుత్వ బాండ్లకన్నా అదనంగా పావుశాతం రేటు అందుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ప్రయోజనం ఏప్రిల్ 1 నుంచి అందదు. ♦ ఫిబ్రవరి 16 ‘త్రైమాసిక సమీక్ష’ నిర్ణయం సందర్భంగా షార్ట్ టర్మ్ పోస్టాఫీస్ డిపాజిట్లపై 0.25 శాతం రేటు తగ్గించిన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, సామాజిక భద్రతా పథకాల పేరిట దీర్ఘకాల పథకాలు బాలికా, సీనియర్ సిటిజన్, ఎంఐఎల్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పీపీఎఫ్ల విషయంలో వడ్డీరేటు కోత నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆ తర్వాతి త్రైమాసికంలో (మార్చి 18న తీసుకున్న నిర్ణయం ప్రకారం) ఈ మినహాయింపులు తొలగించడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది.