రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైనాయి. మొత్తం 2661 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్షలలో మాస్ కాపీయింగ్‌ను నిరోధానికి తొలిసారిగా జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్ష కేంద్రాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ 1 ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు చెప్పారు.