International prices
-
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా..?
న్యూఢిల్లీ: రష్యా ఆఫర్కు భారత్ వేగంగా స్పందించడమే కాదు, చౌక చమురుకు ఆర్డర్ కూడా చేసేసింది. అంతర్జాతీయ ధర కంటే చాలా చౌకగా 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఆర్డర్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒక ట్రేడర్ ద్వారా ఈ డీల్ జరిగినట్టు చెప్పాయి. మే నెలకు సంబంధించి ఉరల్స్ క్రూడ్ను.. బ్రెంట్ క్రూడ్ ధర కంటే 20–25 డాలర్లు తక్కువకు ఐవోసీ కొనుగోలు చేసింది. ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో మిత్రదేశమైన భారత్కు మార్కెట్ ధర కంటే తక్కువకు ముడి చమురు సరఫరా చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం రష్యా స్వయంగా ఆఫర్ చేయడం గమనార్హం. దీంతో ఐవోసీ మొదటి ఆర్డర్ ఇచ్చింది. దీని కింద విక్రయదారు భారత తీరం వరకు రవాణా చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. దీంతో రవాణా పరంగా సమస్యలు ఏర్పడినా ఆ బాధ్యత ఐవోసీపై పడకుండా చూసుకుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆరంభించగా..పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినా, ఆయిల్, ఇతర ఇంధనాలను మినహాయించారు. కనుక ఇంధన కొనుగోలు డీల్స్ ఆంక్షల పరిధిలోకి రావు. -
పసిడి దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు...
న్యూఢిల్లీ : పసిడి, వెండి టారిఫ్ విలువను కేంద్రం గురువారం తగ్గించింది. 10 గ్రాముల పసిడి టారిఫ్ విలువ 382 డాలర్ల నుంచి 376 డాలర్లకు తగ్గింది. కేజీ వెండి టారిఫ్ విలువ 516 డాలర్ల నుంచి 498 డాలర్లకు తగ్గింది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువనే ప్రాతిపదికగా తీసుకుంటారు. అంతర్జాతీయ ధరల థోరణికి అనుగుణంగా కేంద్రం 15 రోజులకు ఒకసారి టారిఫ్ విలువపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1 గ్రా) ధర 1,146 డాలర్ల దగ్గర ఉంది. -
మూడోవారంలోనూ తగ్గిన పుత్తడి
ప్రపంచ ట్రెండ్ ప్రభావం అంతర్జాతీయ ధరలు బలహీనంగా ఉండటంతో దేశీయంగా బంగారం ధరలు గతవారం క్షీణించాయి. దీంతో పుత్తడి ధర వరుసగా మూడోవారం కూడా తగ్గినట్లయ్యింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ. 27,000లోపునకు తగ్గింది. 99.9 స్వచ్ఛతగల పుత్తడి రూ. 26,950 వద్దకు, 99.5 స్వచ్ఛతగల బంగారం రూ. 26,800 వద్దకు తగ్గింది. ఈ రెండూ అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 380 మేర తగ్గాయి. దేశీయంగా ఈ ధర 6 వారాల కనిష్టం. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలకు బలం చేకూరడంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,168 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇది 11 వారాల కనిష్టం.