న్యూఢిల్లీ : పసిడి, వెండి టారిఫ్ విలువను కేంద్రం గురువారం తగ్గించింది. 10 గ్రాముల పసిడి టారిఫ్ విలువ 382 డాలర్ల నుంచి 376 డాలర్లకు తగ్గింది. కేజీ వెండి టారిఫ్ విలువ 516 డాలర్ల నుంచి 498 డాలర్లకు తగ్గింది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువనే ప్రాతిపదికగా తీసుకుంటారు. అంతర్జాతీయ ధరల థోరణికి అనుగుణంగా కేంద్రం 15 రోజులకు ఒకసారి టారిఫ్ విలువపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ఔన్స్ (31.1 గ్రా) ధర 1,146 డాలర్ల దగ్గర ఉంది.