సకాలంలో పన్నులు చెల్లించండి
కాకినాడ సిటీ :
వ్యాపారులందరూ తమ పన్నులను సకాలంలో చెల్లించి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించాలని జీఎస్టీ అదనపు డైరెక్టర్ ఎస్కే రెహమా¯ŒS కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంస్థల ఆధ్వర్యంలో శనివారం స్థానిక యంగ్మె¯Œ్స హ్యాపీక్లబ్లో నగరంలోని వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏకీకృత పన్ను (జీఎస్టీ) విధానంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును విశాఖ కస్టమ్స్ కమిషనర్ బి.హరేరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతినెలలో వ్యాపారులు విక్రయించిన వస్తువులకు తరువాత నెలలోని 20వ తేదీన వివరాలు వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథి, జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్కే రెహమా¯ŒS మాట్లాడుతూ ఒకే పన్ను విధానం ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విధానంపై వ్యాపారులకు అవగాహనను గత ఏడాది నుంచి కల్పిస్తున్నామన్నారు. జీఎస్టీ విధానం అమలయ్యాక వాటితో వచ్చిన ఇబ్బందులను వ్యాపారుల నుంచి తెలుసుకుని కేంద్రానికి వివరిస్తామన్నారు. ఈ సదస్సుకు కోకనాడ చాంబర్ అధ్యక్షుడు దంటు సూర్యారావు అధ్యక్షత వహించగా వాణిజ్య పన్నులశాఖ డీసీ డి.రమేష్, కాకినాడ ఐసీఏఐ చైర్మ¯ŒS ఎ¯ŒS.సురేష్, గోదావరి చాంబర్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జీ, ఆంధ్రా చాంబర్ అధ్యక్షుడు జి.సాంబశివరావు, వ్యాపారులు, చాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు.