investors money
-
రూ. 3.5 లక్షల కోట్లు మటాష్!
సాక్షి, ముంబై : కరోనా వైరస్ మళ్లీ పంజా విసురనుందన్న అంచనాతో అమెరికా మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేశాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చన్న వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా మార్కెట్టు కుప్పకూలాయి. కరోనా వైరస్, లాక్డౌన్ అనంతరం మార్చి తరువాత డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,800 పాయింట్లకు, ఎస్ అండ్ పి 500 5.9 శాతానికి పైగా పడిపోయింది. ఆసియా మార్కెట్లు ఇదే బాటపట్టాయి. జపాన్ నిక్కి 1.52 శాతం చైనా షాంఘై కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్, దక్షిణ కొరియాకు కోస్పి వరుసగా 0.51 శాతం, 1.03 శాతం, 2.48 శాతం పతనమయ్యాయి. దీంతో నేడు (శుక్రవారం) దేశీయంగా మన స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ ఆరంభంలోనే ఏకంగా 1100 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టోయింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 264,315 పాయింట్లు కోల్పోయాయి. ఇన్వెస్టర్ల సంపద పెద్ద మొత్తం ఆవిరై పోయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. (స్టాక్ మార్కెట్ భారీ పతనం) పెట్టుబడిదారులు రూ .3.51 లక్షల కోట్లు నష్టపోయారు. అలాగే మార్కెట్ క్యాప్ నిన్నటి (జూన్ 11) 133.14 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే జూన్ 12 న శుక్రవారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .129.63 లక్షల కోట్లకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్లో గురువారం 805.14 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మారు. దేశీయ పెట్టుబడిదారులు కూడా 874.35 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇండస్ఇండ్ బ్యాంక్, ఒఎన్జీసీ, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. అయితే ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్న సెన్సెక్స్ ప్రస్తుతం 635 పాయింట్లు క్షీణించి 32,908 వద్ద, నిఫ్టీ 175 పాయింట్లు కోల్పోయి 9723 వద్ద కొనసాగుతుండటం విశేషం. చదవండి: ఈ దుస్తులతో అరగంటలో కరోనా ఖతం! వామ్మో! పెట్రో బాదుడు -
ఇన్వెస్టర్ల సొమ్ము పూర్తిగా చెల్లిస్తాం
న్యూఢిల్లీ: సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్టర్ల సొమ్మును పూర్తిగా చెల్లిస్తామని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. స్కీములను మూసివేసినంత మాత్రాన పెట్టుబడులు పోయినట్లుగా భావించరాదని పేర్కొంది. ‘స్కీముల్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు జరిపేందుకు, మా బ్రాండ్‌పై విశ్వసనీయతను నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని ఇన్వెస్టర్లకు రాసిన నోట్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏఎంసీ(ఇండియా) ప్రెసిడెంట్ సంజయ్ సప్రే తెలిపారు. కరోనా వైరస్‌పరమైన సంక్షోభం కారణంగా రిడెంప్షన్ ఒత్తిళ్లు పెరిగిపోయి, బాండ్ మార్కెట్లలో లిక్విడిటీ పడిపోవడంతో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ స్కీములను మూసివేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 25,000 కోట్లు ఉంటుంది. మూసివేత నిర్ణయం చాలా కష్టతరమైనదని, కానీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పలేదని సప్రే తెలిపారు. ట్రిపుల్ ఎ రేటింగ్ నుంచి ఎ రేటింగ్ దాకా ఉన్న బాండ్లలో తాము ఇన్వెస్ట్ చేశామని .. ఈ వ్యూహం ఇటీవలి దాకా మంచి ఫలితాలనే ఇచ్చిందని పేర్కొన్నారు. ఫండ్‌ను ప్రభుత్వం టేకోవర్ చేయాలి: బ్రోకింగ్ సంస్థల డిమాండ్ ‘ఫ్రాంక్లిన్’ ఉదంతంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రోకింగ్ సంస్థల సమాఖ్య ఏఎన్ఎంఐ పేర్కొంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మేనేజ్మెంట్ను టేకోవర్ చేసేందుకు, పెట్టుబడుల తీరును సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖకు ఏప్రిల్ 26న ఏఎన్ఎంఐ ఈ మేరకు లేఖ రాసింది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్ట్ చేయడంతో పాటు అంతగా రేటింగ్ లేనివి, ఊరూ పేరూ లేని పలు సంస్థల్లో టెంపుల్టన్ ఫండ్ పెట్టుబడులు పెట్టడం సందేహాలు రేకెత్తిస్తోందని పేర్కొంది. -
రూ.1.79 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
ముంబై : ఆయిల్ ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ అంతకంతకు క్షీణించడం నేడు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ 550 పాయింట్ల క్రాష్ అయి, మూడు నెలల కనిష్ట స్థాయిలకు పడిపోయింది. చివరి గంట ట్రేడింగ్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కుప్పకూల్చింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా హరించుకుపోయింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఒక్కరోజే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.145.43 లక్షల కోట్ల నుంచి రూ.143.64 లక్షల కోట్లకు పడిపోయింది. ఆగస్టు 31 నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ మొత్తంగా రూ.15.74 లక్షల కోట్లు క్షీణించింది. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో, నేటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ భారీగా క్రాష్ అయి, మొట్టమొదటిసారి 73 మార్కు దిగువకు పడిపోయింది. 73.42 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. అమెరికన్ కరెన్సీకి దిగుమతిదారుల నుంచి మంచి డిమాండ్ నెలకొనడం కూడా రూపాయిని దెబ్బకొట్టింది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కో బ్యారల్‌కు 85 డాలర్లను మించిపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఈ విధంగా పడిపోవడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. ఏప్రిల్ నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 20 శాతానికి పైగా ఎగిశాయి. రూపాయి విలువ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు. రూపాయి విలువలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఏవీ మార్కెట్లను సానుకూలంగా నడిపించలేకపోయాయి. అటు నిఫ్టీలో కూడా మెజార్టీ స్టాక్స్ నష్టాలే పాలయ్యాయి. మహింద్రా అండ్ మహింద్రా 7.03 శాతం, ఐషర్ మోటార్స్ 6.79 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 6.45 శాతం, టీసీఎస్ 4.38 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.62 శాతం డౌనయ్యాయి. కోర్ సెక్టార్ డేటా కూడా నేడు మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాల వృద్ధి ఆగస్టు నెలలో 4.2 శాతానికి పడిపోయింది. ఇదే జూలై నెలలో 7.3 శాతంగా ఉంది. -
వెయ్యికోట్లతో కంపెనీ చైర్మన్ పరారీ
ప్రముఖ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అధినేత ఏకంగా వెయ్యికోట్ల వరకు పెట్టుబడిదారుల సొమ్ము తీసుకుని ఉడాయించేశాడు. అతగాడి ఆచూకీ కోసం చైనా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చైనాలోని హంగ్జూ నగరంలో వాంగ్జూ గ్రూప్ ఛైర్మన్ యాంగ్ వైగూ గత గురువారం నుంచి ఎవరికీ కనపడకుండా పోయాడు. దాంతోపాటు అప్పటివరకు ఆసంస్థలో ప్రజలు పెట్టుబడిగా పెట్టిన దాదాపు రూ. వెయ్యి కోట్ల సొమ్మును కూడా అతడు తీసుకుపోయాడు. ఈ సంస్థలో నగదు నిల్వల విషయమై ఈనెల 18 నుంచే పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటన తర్వాత హంగ్జూ నగరంలోని తమ షాపింగ్ మాల్‌ను కూడా వాంగ్జూ గ్రూపు మూసేసింది. ఎలాగోలా పెట్టుబడిదారులకు వాళ్ల సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చేస్తామని కంపెనీ చెబుతోంది. వాంగ్జూ గ్రూపు వ్యాపారాలు విస్తృతంగా ఉన్నాయి. కామర్స్ , ఆటోమొబైల్స్, ఆస్పత్రులు, వెల్త్ మేనేజ్మెంట్.. ఇలా పలు కంపెనీలతో 70 నగరాల్లో 7వేల మంది ఉద్యోగులను ఆ కంపెనీ కలిగి ఉంది.