Ipas
-
వారెవ్వా ఐపాస్... ప్రగతి పట్టాలపై పారశ్రామిక పరుగు
కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామికరంగం మళ్లీ ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతోంది. గత ఏడేళ్లలో పరిశ్రమల ఏర్పాటులో మేడ్చల్ అగ్రభాగాన ఉండగా..రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర ఖజానాకు మూడో వంతు ఆదాయాన్ని సమకూర్చడమేగాకుండా నిరుద్యోగులకు ఉపాధిలోనూ ముందు వరుసలో ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే–2021లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే టాప్‌లో నిలిచింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ అండ్ సెల్ప్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ ఐపాస్) విధానంతో ఉమ్మడి జిల్లాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత (2014–21 మధ్య) జిల్లాకు రూ.29,488 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఏర్పాటు చేసిన 5,362 కంపెనీల వల్ల 2,62,018 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. అంతేకాదు నగరశివారులో ఏర్పాటు చేసిన ఈ సంస్థల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూ రాయి. ఫలితంగా జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ కొనసాగుతోంది. పరిశ్రమల ఏర్పాటు లో మాత్రం మేడ్చల్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఏడేళ్లలో మేడ్చల్ జిల్లాలో 3,805 కంపెనీలు ఏర్పాటు కాగా, రంగారెడ్డిజిల్లాలో 1,137 కం పెనీలు వచ్చాయి. వీటి ద్వారా 1,60,382 మందికి ఉపాధి లభించింది. ఉత్పత్తుల ఎగుమతుల్లో మేడ్చల్ 25.52శాతంతో మొదటి స్థానంలో ఉంటే, అదే రం గారెడ్డి 16.97 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన టీఎస్–ఐపాస్‌కు ఆన్లైన్ దరఖాస్తులతో అన్ని రకాల అనుమతులు ఏకగవాక్ష విధానంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే జారీ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఫలితంగా దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సహాకాలు ప్రకటిస్తుంది. ఫలితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మచ్చుకు కొన్ని.. ఇప్పటికే విమానాలు, హెలిక్యాప్టర్ విడిభాగాల ఉత్పత్తిని చేపడుతున్న జిల్లా త్వరలోనే రైల్వేకోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రం కానుంది. శంకర్పల్లి మండలం కొండకల్ వద్ద మేద సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు చేసింది. ఏటా 500 రైల్వే కోచ్‌లు, 50 లోకోమోటివ్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనుంది. అంతేకాదు 2,200 మందికి ఉపాధి కల్పించనుంది. ట్రయల్ రన్లో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మహేశ్వరం మండలం కేసీతండాలో ఎలక్ట్రిక్ హార్ట్‌వేర్ పార్క్‌లో రూ.300 కోట్లతో విప్రో కన్జ్యూమర్ కంపెనీ స్థాపించింది. 900 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇటీవల ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. ఐపాస్‌తో పెరిగిన వేగం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుత పారిశ్రామిక వాడలను మరింత విస్తరించడంతో పాటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మంఖాల్, మహే శ్వరం, షాబాద్, తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఎంఎస్ఎంఈ పార్కులు, ఫుడ్ పార్కులు, ప్లాస్టిక్ అండ్ లెదర్ పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నాం. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నాం. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రవాణా, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ, అధికారి (చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్) -
పరిశోధనలను ముమ్మరం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఎదురు కాబోయే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. కోవిడ్ –19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డి.ఐ.పి.ఏ.ఎస్) శాస్త్రవేత్తల సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు. సోమవారం డి.ఐ.పి.ఏ.ఎస్.కు చెందిన దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. కోవిడ్ –19 చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డి.ఐ.పి.ఏ.ఎస్., ఇతర డీఆర్డీఓ ల్యాబ్‌లను వెంకయ్య అభినందించారు. అంతేగాక ఎ లాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవం తంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కార్యక్రమం ప్రారంభంలో కోవిడ్ –19 చికిత్స, నిర్వహణ కోసం డీఆర్డీఓ ల్యాబ్స్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చెందిన వివిధ ఉత్పత్తులు, పరికరాల గురించి డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆహ్వానించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను వారితో పంచుకున్నందుకు ఉపరాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఈపాస్’ అయితేనే రేషన్
పాత పద్ధతిలో పంపిణీ లేనట్టే.. వేలిముద్రలు పడని వారికి ప్రత్యేక ఆప్షన్ పంపిణీ మేరకే సరకుల లిఫ్టింగ్ విశాఖపట్నం: ‘ఈపాస్’ ద్వారా తీసుకుంటేనే రేషన్ సరకులు.. లేకుంటే లేనట్టే. ఇప్పటి వరకు వేలిముద్రలు పడకపోయినా.. మిషన్లు పనిచేయకపోయినా పాతపద్ధతిలో సరకులిచ్చేవారు. ఇక నుంచి ఈ అవకాశం లేదు. ఈ‘పాస్’యితేనే సరకులు లేకుంటే ఆశలు వదులుకోవల్సిందే. జిల్లాలో ఈపాస్ అమలవుతున్న 1604 రేషన్ షాపుల పరిధిలో 9.50 లక్షల కార్డులుండగా ప్రతి నెలా ఏడున్నర లక్షలమంది కార్డుదారులకు ఈపాస్ ద్వారా సరకుల పంపిణీ జరుగుతోంది. క్రమం తప్పకుండా సరకులు తీసుకునే మరో 50 వేలమందికి సాంకేతిక కారణాలవల్ల మిషన్లు పనిచేయకున్నప్పటికీ పాత పద్ధతిలోనే పంపిణీ చేసేవారు. వచ్చే నెల నుంచి పాతపద్ధతిలో సరకుల పంపిణీకి ఫుల్స్టాప్ పెట్టడం నిరుపేదలకు అశనిపాతంగా మారింది. జీవీఎంసీ పరిధిలో 76 శాతం, గ్రామీణ ప్రాంతంలో 89 శాతం వరకు సరకుల పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు క్లోజింగ్ బ్యాలెన్స్కనుగుణంగానే కార్డుల సంఖ్యను బట్టి మరుసటి నెల సరకుల కేటాయింపు జరిగేది. డిసెంబర్లో ఈపాస్ వర్తింప చేసే షాపుల కు సరకుల కేటాయింపులో 10 శాతం కోత విధించారు. జనవరి నుంచి నూరు శాతం ఈపాస్‌లో పంపిణీ జరిగిన సరకుల మేరకే లిఫ్టింగ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. పైగా గతంలో మాదిరిగా ఇండెంట్ పెట్టుకోవల్సిన అవసరం లేదు. ప్రతి నెలా 22వ తేదీన ఈపాస్ మిషన్ నెంబర్ కొట్టగానే ఆ మిషన్ ఏ డీలర్‌కు చెందింది.? ఆ షాపులో ఆ నెలలో ఎన్ని కార్డులకు సరకుల పంపిణీ జరిగింది? మెయిన్ సర్వర్‌లో తెలిసిపోతుంది. తదనుగుణంగా ఆటోమేటిక్‌గా లిఫ్టింగ్ జనరేట్ అయిపోతుంది. సరకుల కోసం గతంలో మాదిరిగా మండల లెవల్ సప్లయి (ఎంఎల్ఎస్) పాయింట్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈపాస్ ద్వారా జనరేట్ అయ్యే లిఫ్టింగ్‌ను బట్టి సరకులను నేరుగా సంబంధిత రేషన్ షాపునకు చేరుస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సరకులు తీసుకునేటప్పుడు, రవాణాలో కూడా తరుగు కన్పిస్తుందని.. తద్వారా నష్టపోవాల్సి వస్తుందంటూ డీలర్లు ఇన్నాళ్లు గగ్గోలు పెట్టేవారు. ఇక నుంచి నేరుగా రేషన్ షాపునకు లిఫ్టింగ్ జరుగనుండడంతో అక్కడే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌లో సరకులను తూకం వేసి తమకు కేటాయించిన మేరకు సరకులు వచ్చాయా? లేదా? చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇదంతా మాన్యువల్‌గానే జరిగేది. ఇక నుంచి లిఫ్టింగ్ కూడా ఈపాస్ ద్వారానే జరుగనుంది. మిషన్‌లో డీలర్, రూట్ ఆఫీసర్ ఒకేసారి వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. గత నెలలో సరకులు తీసుకున్న కార్డుదారుని వేలిముద్రలు పడకపోవడం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురైతే అటువంటి వారి కోసం ఈపాస్ మిషన్‌లోనే ప్రత్యేకంగా ఆప్షన్ పొందుపరుస్తున్నారు. ఏదైనా తీర్థయాత్రలకు, వ్యక్తిగత అవసరాలు లేదా కూలి పనుల నిమిత్తం కుటుంబసమేతంగా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్లడం వలన ఆ నెలలో సరకులు తీసుకోలేకపోతే ఆ మరుసటి నెలలో వారికి సరకులు హుళక్కే. దీంతో ఇప్పటికే ఈపాస్ పుణ్యమాని లక్షన్నర కుటుంబాలకు పైగా రేషన్‌కు దూరం కాగా.. ఇప్పుడు ఈ కొత్త మెలిక వల్ల ప్రతి నెలా వేలాదిమంది సాంకేతిక సమస్యల కారణంగా రేషన్ పొందలేని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. జనవరి నుంచి అమలు డిసెంబర్లో ఈపాస్ ద్వారా ఎంతమందికైతే సరకుల పంపిణీ జరుగుతుందో ఆ మేరకే జనవరిలో రేషన్ షాపునకు సరకుల కేటాయింపు జరుగుతుంది. ఇక నుంచి ఈపాస్ బయట ఎలాంటి లావాదేవీలు జరగడానికి వీల్లేదు. ఇప్పటికే 1604 షాపుల్లో ఈపాస్ అమలు చేస్తున్నాం. మిగిలిన షాపుల్లో కూడా త్వరలోనే అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. తరుగు సమస్య లేకుండా చర్యలు చేపట్టాం. -జె.నివాస్, జాయింట్ కలెక్టర్